BigTV English

Triumph Scrambler 1200 X: ఇండియాలో లాంచ్ అయిన ట్రయంఫ్​ స్క్రాంబ్లర్​ 1200 ఎక్స్.. ధర రూ.11.83 లక్షలు!

Triumph Scrambler 1200 X: ఇండియాలో లాంచ్ అయిన ట్రయంఫ్​ స్క్రాంబ్లర్​ 1200 ఎక్స్.. ధర రూ.11.83 లక్షలు!
Triumph Scrambler 1200 X

Triumph Scrambler 1200 X: వాహన ప్రియులను ఆకట్టుకునేందుకు రోజుకో కొత్త రకం వాహనాలు మార్కెట్‌లోకి దర్శనమిస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చేస్తూ కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పటికే ఎన్నో రకాల మోడల్ బైక్‌లు మార్కెట్‌లోకి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


తాజాగా మరో అద్భుతమైన లగ్జరీ బైక్ ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ కంపెనీ తాజాగా ఇండియాలో ‘ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200ఎక్స్’ పేరుతో సరికొత్త లగ్జరీ బైక్‌ని లాంచ్ చేసింది. ఈ బైక్ లుక్, డిజైన్ వాహన ప్రియులను కట్టిపడేస్తుంది. అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బైక్ ధర, ఫీచర్లు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫీచర్స్, స్పెసిఫికేషన్స్:


ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్ లగ్జరీ బైక్‌లో 1200cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 89 బిహెచ్‌పీ పవర్‌ని, 110NM టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అందించబడింది. అలాగే ఈ బైక్స్ సీట్ హైట్ 820mm ఉంటుంది. అయితే దీనిని 795mmకి తగ్గించుకునే అవకాశాన్ని కూడా కంపెనీ అందించింది. ఇది నాన్- అడ్జస్ట్ అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్‌లను, వెనుక మార్జోచి మోనోషాక్ కోసం ప్రీలోడ్-అడ్జస్ట్‌ను కలిగి ఉంది.

Read More: మార్కెట్‌లోకి మరో కొత్త యమహా బైక్.. ఫీచర్స్ అదుర్స్.. ధర ఎంతంటే?

అంతేకాకుండా ఇందులో అత్యాధునిక బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నట్లు తెలుస్తోంది. యాక్సియల్లీ – మౌంటెడ్ నిస్సిన్ కాలిపర్స్‌తో ట్విన్ ఫ్రంట్, సింగిల్ రియర్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ఈ లగ్జరీ బైక్‌లో రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్, రైడర్ కాన్ఫిగరెబుల్ వంటి 5 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అలాగే ఐఎంయూని కలిగిన ట్రాక్షన్ కంట్రోల్, ABS వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ బైక్‌కు 21 అంగుళాల ముందు, 17 అంగుళాల వెనుక వైర్-స్పోక్ అల్యూమినియం వీల్స్ ఉన్నాయి. ఇవి ట్యూబ్‌లెస్ టైర్‌లతో ఉండనున్నాయి. కాగా ఇది 15 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వచ్చింది. ఇందులో టర్న్ బై టర్న్ నేవిగేషన్, అలాగే నోటిఫికేషన్ అలెర్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Read More: బీఎండబ్ల్యు బైక్స్.. వందేళ్ల లిమిటెడ్ ఎడిషన్ విడుదల..

ధర:

ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్ లగ్జరీ బైక్ ధరను దాదాపు రూ.11.83 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. అయితే ముందు మోడల్ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్‌సీ కన్నా ఈ బైక్ రూ.1.10 లక్షలు ఎక్కువ. అందువల్ల మంచి లగ్జరీ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ బైక్ మంచి ఆప్షన్ అవుతుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం సంబంధిత షోరూమ్‌లో తెలుసుకోవచ్చు.

Related News

iPhone 17 Pro Max: ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ కు పోటీనిచ్చే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు..

iPhone 16 vs iPhone 17: ఐఫోన్ 16 లేదా ఐఫోన్ 17.. భారతీయులకు ఏది బెటర్?

Best Selling iPhone: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఐఫోన్ మోడల్ ఇదే.. తాజా రిపోర్ట్‌‌లో షాకింగ్ విషయాలు!

Iphone Air : వచ్చేసింది ఐఫోన్ ఎయిర్.. గెలాక్సీ S25 ఎడ్జ్‌కు సవాల్ విసిరిన ఆపిల్

Nothing Phone Discount: నథింగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్‌పై సూపర్ ఆఫర్.. రూ.35000 డిస్కౌంట్.. ఎక్స్‌ఛేంజ్ లేకుండానే!

No network Simcard: ఫోన్‌లో సిమ్ కార్డ్ ఉన్నా నెట్ వర్క్ చూపించడం లేదా? ఇవే కారణాలు..

Big Stories

×