Big Stories

Yamaha FZ-X Price: మార్కెట్‌లోకి మరో కొత్త యమహా బైక్.. ఫీచర్స్ అదుర్స్.. ధర రూ.1.36 లక్షలే!

Yamaha FZ-X Features & Price: భారత మార్కెట్‌లోకి రోజుకో కొత్తరకం వాహనాలు దర్శనమిస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రముఖ కంపెనీలు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా బైక్‌లపై వాహన ప్రియులు మక్కువ చూపిస్తున్నారు. ఎక్కువ మైలేజీ, తక్కువ ధర, అద్భుతమైన ఫీచర్లు కలిగిన వాహనాలను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

- Advertisement -

అయితే అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ వాహన తయారీ కంపెనీలు సరికొత్త డిజైన్లతో బైక్‌లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ కంపెనీల నుంచి అదిరిపోయే బైక్‌లు దర్శనమివ్వగా.. తాజాగా మరో బైక్ అందుబాటులోకి వచ్చింది. భారత మార్కెట్‌లో ఎంతో ఆదరణ సంపాదించుకున్న ప్రముఖ వాహన తయారీ సంస్థ యమహా.

- Advertisement -

తాజాగా ఈ కంపెనీ తన కొత్త FZ-X క్రోమ్ ఎడిషన్ మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. అంతేకాకుండా ఈ బైక్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది. ఈ బైక్‌ను కొనుగోలు చేసే మొదటి 100 మంది కస్టమర్లకు కొత్త కాషియో జి-షాక్ వాచ్‌ని గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు తెలిపింది.

READ MORE: Royal Enfield at Rs 18,000: రూ.18700కే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్..!

యమహా మోటార్స్ తీసుకొచ్చిన ఎఫ్‌జెడ్-ఎక్స్ క్రోమ్ ఎడిషన్ ధర రూ.1.40 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. దీని మెటాలిక్ బ్లాక్ కలర్ వేరియంట్ రూ.1.36 లక్షల ధర వద్ద అందుబాటులో ఉంది.

కాగా ఈ బైక్‌ను కొత్త కలర్ స్కీమ్‌తో తీసుకొచ్చినప్పటికీ.. డిజైన్, ఫీచర్లు, డైమెన్షన్‌ల పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో పవర్‌ట్రెయిన్ 149cc, సింగిల్ – సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. అలాగే 12.4bhp, 13.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతోపాటు ఫ్రంట్ భాగంలో సింగిల్ ఛానల్ ABS, వెనక భాగంలో డిస్క్ బ్రేక్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్‌తో వచ్చింది. వీటితో పాటు మరికొన్ని అదిరిపోయే ఫీచర్లను అందించారు.

ఈ బైక్ బ్రేకింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. ABSతో 280 ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుక వైపు 220 ఎంఎం డిస్క్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ మోడల్ E20 ఇంధనానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే స్టెబిలిటీ పట్ల యమహా తన నిబద్దతను ప్రదర్శిస్తోంది.

ఆకట్టుకునే ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో వచ్చిన ఈ బైక్‌ ప్రస్తుతం వాహన ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News