Big Stories

HMD Phones 2024 : హెచ్ఎమ్‌డీ నుంచి మూడు క్లాసిక్ ఫోన్లు.. ఎంత చీప్ అంటే!

HMD Phones 2024 : స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో సేల్స్ పెంచుకునేందుకు బడ్జెట్ ఫోన్ల మార్కెట్‌పై కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయి. కాంప్రమైజ్ కాకుండా తక్కువ ధరకే ఫోన్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ HMD తన బ్రాండ్ నుంచి పల్స్ సరీస్ పేరుతో ఫోన్లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మూడు ఫోన్లు ఉన్నాయి. HMD పల్స్, పల్స్+, పల్స్ ప్రో. ఈ ఫోన్ల ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫోన్‌లు యూజర్ రిపేర్ కోసం తీసుకొచ్చారు. అంటే మీరు బ్యాటరీని మార్చుకోవచ్చు లేదా అవసరమైతే స్క్రీన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు. దీని కోసం కంపెనీ iFixit అనే వెబ్‌సైట్ నుండి సెల్ఫ్ రిపేర్ కిట్‌లను అందిస్తుంది. పల్స్ మోడల్ 4GB RAM + 64GB ధర సుమారు రూ. 12,500. Pulse+ ప్రారంభ ధర రూ. 14,200.పల్స్ ప్రో మోడల్ 6GB RAM+128GB ధర రూ.16,100గా నిర్ణయించింది.

- Advertisement -

HMD పల్స్, పల్స్+ ఫోన్‌లు 6.65-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తున్నాయి.90Hz రిఫ్రెష్ రేట్,600నిట్స్ పీక్ బ్రైట్‌నెస్,రిజల్యూషన్ 1612 x 720 పిక్సెల్స్ కలిగి ఉన్నాయి. దీని డిస్‌ప్లే చాలా స్మూత్‌గా ఉంటుంది. సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్‌లో చిన్న కటౌట్ ఉంది. ఈ రెండు ఫోన్‌లు UNISOC T606 చిప్‌సెట్‌తో వస్తాయి. 6GB RAM + 256GB స్టోరేజ్, మీరు మైక్రో SD కార్డ్‌ని ఇన్‌సర్ట్ చేయడం ద్వారా కూడా స్టోరేజీని పెంచుకోవచ్చు.

- Advertisement -

Also Read : బెస్ట్ డీల్.. రూ.5499 లకే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్

ఈ రెండు ఫోన్‌లు కొత్త ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతాయి.సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు రాబోయే 2 సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటాయి. సెక్యురిటీ అప్‌డేట్‌లు 3 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. కనెక్టివిటీ కోసం, ఇందులో 4G నెట్‌వర్క్, Wi-Fi, బ్లూటూత్, NFC, USB ఛార్జింగ్ పోర్ట్, లొకేషన్ సర్వీస్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

HMD పల్స్‌లో 13MP ప్రైమరీ కెమెరా; బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ ఇచ్చే మరొక కెమెరా ఉంది. పల్స్+లో 50MP మెయిన్ కెమెరా ఉంది. రెండు ఫోన్‌లలో సెల్ఫీలు , వీడియో కాల్‌ల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. రెండు ఫోన్‌లు 10W ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే పెద్ద 5000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఇది కాకుండా ఫింగర్ ప్రింట్ సెన్సార్, OZO ఆడియో ఫీచర్, వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కోసం IP52 రేటింగ్ కలిగి ఉంది.

పల్స్ ప్రో 6.65 అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది.600 నిట్స్ బ్రైట్‌నెట్ వరకు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్‌లో చిన్న కటౌట్ ఇవ్వబడింది. పల్స్ ప్రో UNISOC T606 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. 6GB RAM + 128GB స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ 5000mAh పెద్ద బ్యాటరీతో వస్తుంది. ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది కొత్త ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు రాబోయే 2 సంవత్సరాలకు అందుబాటులో ఉంటాయి.

Also Read : మోటో G64 5G సేల్ స్టార్ట్.. ఫీచర్లు చూస్తే అవాక్కవుతారు!

పల్స్ ప్రోలో 50MP మెయిన్ కెమెరా, మరొక సెకండరీ కెమెరా ఉన్నాయి.సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. కనెక్టివిటీ కోసం, ఇందులో 4G నెట్‌వర్క్, Wi-Fi, బ్లూటూత్, NFC, USB ఛార్జింగ్ పోర్ట్, లొకేషన్ సర్వీస్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News