Big Stories

Rahul Priyanka Ayodhya Visit: అయోధ్యకు రాహుల్, ప్రియాంక.. ఆ రెండు స్థానాల్లో పోటీ..?

Rahul, Priyanka Ayodhya Visit: ఉత్తర్ ప్రదేశ్‌లోని లోక్ సభ స్థానాలకు ఎన్నికలు మే 20న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకోబోతుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ నెల 27న అయోధ్యలోని బాల రామున్ని దర్శించుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రాముని దర్శనం తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం.

- Advertisement -

కాగా ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ కంచుకోటగా అభివర్ణించే అమేథీ, రాయ్ బరలీ లోక్ సభ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. కాగా ఏఐసీసీ వర్గాలు మాత్రం అమేథీ బరిలో రాహుల్, రాయ్ బరేలీ బరిలో ప్రియాంక గాంధీ ఉంటారని చెబుతున్నాయి. దీంతో ఆ రెండు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేముందు అయోధ్య బాల రాముని దర్శనం చేసుకుంటారని తెలుస్తోంది.

- Advertisement -

అటు గాంధీ కుటుంబానికి అమేథీ, బరేలీ పెట్టింది పేరు. 2004 నుంచి మూడు సార్లు అమేథి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. కాగా 2019లో బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో 55 వేల ఓట్ల తేడాతో రాహుల్ ఓటమి చవిచూశారు. ఇక 2004 నుంచి రాయ్ బరేలి లోక్ సభ నియోజకవర్గానికి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. అటు అనారోగ్య కారణాల చేత ప్రత్యక్ష రాజకీయాలకి స్వస్తి పలికి సోనియా గాంధీ పెద్దలు సభకు వెళ్లారు. దీంతో ప్రియాంక గాంధీ సోనియా స్థానాన్ని భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: నాటకాలు ఆపు, మంగళసూత్రం విలువ మోదీకి ఏం తెలుసు

కాగా 5 వ విడత ఎన్నికల్లో భాగంగా అమేథీ, రాయ్ బరేలి నియోజకవర్గాలకు మే 20 న పోలింగ్ జరగనుంది. మే 3 తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. మే 1,2 తేదీల్లో ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News