HMD Skyline Launching Nokia Lumia 920 Soon: నోకియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ HMD గ్లోబల్ త్వరలో ‘HMD Skyline’ అనే కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ నోకియా లూమియా 920ని గుర్తు చేస్తుంది. రాబోయే ఈ కొత్త ఫోన్ నోకియా లూమియా 920 వంటి డిజైన్‌ను కలిగి ఉంటుంది. గత నెలలోనే కంపెనీ 90s నాటి క్లాసిక్ నోకియా 3210 స్మార్ట్‌ఫోన్‌ను మళ్లీ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా కంపెనీ తీసుకురాబోతున్న కొత్త ఫోన్ HMD Skyline గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
HMD నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ స్కైలైన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త ఫోన్ గురించి ఇప్పటికే ఎన్నో లీక్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరికొన్ని వివరాలు ఈ ఫోన్ గురించి తెలుసుకున్నాయి. తాజాగా ఈ ఫోన్‌కి సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఒక సోషల్ మీడియా యూజర్ తన ఖాతాలో HMD స్కైలైన్ ఫోన్‌ను షేర్ చేసారు. ఇందులో ఫోన్ డిజైన్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఫ్యాబులా డిజైన్ భాషలో ఉందని చెప్పవచ్చు. ఈ డిజైన్‌ను కంపెనీ నోకియా N9లో అందించింది. అయితే ఈ ఫోన్ ఎల్లో కలర్‌లో ఉండటంతో నోకియా లూమియా 920 లాగా కనిపిస్తుంది.
అయితే HMD స్కైలైన్ డిజైన్ నాస్టాల్జిక్‌గా ఉన్నప్పటికీ.. స్పెక్స్‌లో పెద్ద మార్పులేవి కనిపించడం లేదు. HMD స్కైలైన్ స్పెసిఫికేషన్ల గురించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. స్కైలైన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది Qualcomm Snapdragon 7s Gen 2 SoCతో అమర్చబడి ఉండే అవకాశం ఉంది.
Also Read: బొమ్మ అదిరిపోద్ది.. 108MP కెమెరాతో HMD కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..?
కెమెరా ముందు భాగంలో ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 108MP ప్రధాన సెన్సార్, అల్ట్రావైడ్ లెన్స్, మాక్రో లేదా డెప్త్ సెన్సార్ ఉండవచ్చు. అంతేకాకుండా ఇది సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే పెద్ద 4,900mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది కాకుండా దుమ్ము, వాటర్ రెసిస్టెన్సీ కోసం IP67 రేట్ చేయబడింది. ఈ ఫోన్ సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సదుపాయాన్ని కూడా కలిగి ఉంటుంది.
HMD గ్లోబల్ నుండి రాబోయే ఈ ఫోన్ ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఇది Google మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన తాజా వెర్షన్ Android 14లో పని చేస్తుంది. HMD స్కైలైన్ ధర విషయానికొస్తే.. HMD స్కైలైన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం €520 గా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం.. దాదాపు రూ. 46,926 గా అంచనా వేయబడుతుంది. లాంచ్ విషయానికి వస్తే.. కంపెనీ ఈ ఫోన్‌ను వచ్చే నెల అంటే జూలై 2024లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.