BigTV English

Uttar Pradesh Accident: యూపీలో యాక్సిడెంట్.. నలుగురు యూట్యూబర్లు మృతి.. ఎలా జరిగింది..?

Uttar Pradesh Accident: యూపీలో యాక్సిడెంట్.. నలుగురు యూట్యూబర్లు మృతి.. ఎలా జరిగింది..?

4 YouTubers Died in Uttar Pradesh Car Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు యూట్యూబర్లు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది?


అమ్రోహా జిల్లా మనోటా బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు యూట్యూబర్లు రౌండ్ టు వరల్డ్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నారు. అయితే వీరంతా కారులోని అమ్రోహాలోని హసన్‌ పూర్‌‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. భోజనం చేసి వీరంతా బయలుదేరారు. ఈ క్రమంలో మనోటా బ్రిడ్జి సమీపం లోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారును వేగంగా వస్తున్న మరో కారుని ఢీ కొట్టింది.

ఈ ఘటనలో స్పాట్‌లో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


Also Read: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర దాడి.. 10కి చేరిన మృతుల సంఖ్య.. ఖండించిన ప్రధాని

మృతులు లక్కీ, సల్మాన్ షారూఖ్, షెహ్నవాజ్‌గా గుర్తించారు పోలీసులు. వీరంతా కామెడీ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Related News

Hyderabad crime: ఛీ.. ఛీ.. వీడు మనిషేనా? ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం..

Medak crime: ప్రియుడి కోసం కొడుకుపై కత్తి.. మెదక్‌లో తల్లి ఘాతుకం!

Anantapur Crime: గర్భిణి ఆత్మహత్య.. వారి పేర్లు చెబుతూ వాయిస్ రికార్డు.. అడ్డంగా బుక్కైన పోలీసులు

Bihar gang: హైదరాబాద్‌లో బీహార్ గ్యాంగ్ అలర్ట్.. చర్లపల్లిలో మూడు పిస్టల్స్ స్వాధీనం!

Rave Party: బర్త్ డే పేరుతో రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో 51 మంది, డ్రగ్స్ స్వాధీనం

Srikakulam Crime: వాట్సాప్‌లో అమ్మాయి పేరుతో చాటింగ్.. తర్వాత నిద్ర మాత్రలు ఇచ్చి.. ప్రియుడిని పిలిచి.. భర్త హత్య

Big Stories

×