BigTV English

NBK 109 Glimps Out: జాలి, దయ, కరుణ లేని అసురుడు ‘NBK 109’.. గ్లింప్స్ ఊచకోతే..!

NBK 109 Glimps Out: జాలి, దయ, కరుణ లేని అసురుడు ‘NBK 109’.. గ్లింప్స్ ఊచకోతే..!

NBK 109 Glimpse Released Watch Now: బాలయ్య బాబు – దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న కొత్త సినిమా ‘NBK 109’. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణను ఎన్నడూ చూడని మాస్ పాత్రలో దర్శకుడు ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి బాలయ్య బాబు ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.


ఆ గ్లింప్స్‌లో బాలకృష్ణ ఊచకోత మామూలుగా లేదు. వేట గొడ్డలి పట్టుకుని విలన్లను వేటాడిన యాక్షన్ సీన్లు అభిమానులకు విపరీతంగా నచ్చేశాయి. అంతేకాకుండా యూట్యూబ్‌లో కూడా తెగ ట్రెండ్ అయ్యాయి. ఆ మధ్య ఈ గ్లింప్స్ భారీ రెస్పాన్స్‌ను అందుకొని.. అందరిలోనూ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

బాలయ్య మాస్ యాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇదంతా ఒకెత్తయితే ఇవాళ బాలయ్య బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఎన్‌బీకే 109’ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూసారు. అలా ఎదురుచూసిన వారికి మేకర్స్ కిక్కిచ్చే సర్‌ప్రైజ్ అందించారు. ఇందులో భాగంగానే బాలయ్య బాబుకు బర్త్ డే విషెస్ తెలుపుతూ మరో గ్లింప్స్ రిలీజ్ చేశారు.


Also Read: బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్.. ఇక బాక్సాఫీసు బద్దలే..

అందులో బాలయ్యబాబు మాస్ అండ్ యాక్షన్ లుక్ ఓ లెవెల్లో ఉంది. ఈ గ్లింప్స్ ప్రకారం చూస్తే.. మొదట్లో ‘‘దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు. వీళంతు చూడాలంటే కావాల్సింది.. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు’’ అని చెప్పిన డైలాగ్ తర్వాత బాలయ్య బాబు మాస్ ఎంట్రీ అత్యద్భుతంగా ఉంది. ఆ తర్వాత గుర్రంపై కనిపించే లుక్ మరో రేంజ్‌ అనే చెప్పాలి. మొత్తంగా బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్‌ ప్రేక్షకాభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ గ్లింప్స్ చూసి ఎంజాయ్ చేసేయండి.

పుట్టిన రోజు వేళ గుడిలో ప్రత్యేక పూజలు..

ఇదంతా ఒకెత్తయితే ఇవాళ నందమూరి బాలకృష్ణ బర్త్ డే.. ఈ సందర్భంగా ఆయన ఓ ఆలయాన్ని సందర్శించారు. ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో హిందుపురం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచారు బాలయ్య బాబు. ఈ క్రమంలో నేడు తన పుట్టిన రోజున తన నియోజకవర్గం అయిన హిందుపురంలోని ఓ ఆలయాన్ని సందర్శించారు. ఇందులో భాగంగా అక్కడి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×