Aadhaar registered mobile number: ప్రస్తుతం ప్రతీ ప్రభుత్వ పథకం, బ్యాంక్ అకౌంట్ , సిమ్ కార్డ్ తీసుకోవడానికి ఆధార్ కార్డ్ అత్యంత కీలకంగా మారింది. స్కాలర్ షిప్‌లు, పెన్షన్లు, బ్యాంకు సేవలు, సబ్సిడీల పొందడం కోసం ఆధార్ తప్పనిసరి. అయితే.. సేఫ్టీ కారణాల రీత్యా ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నంబర్ లింక్ అయి ఉందో చాలా మందికి గుర్తుండదు లేదా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓటీపీ ఆధారిత సేవలు అన్నీ ఆ నంబర్ మీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి.. దీన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆధార్‌తో ఏ ఫోన్ నంబర్ లింక్ అయి ఉందో.. ఇంట్లోనే ఉండి కేవలం రెండు నిమిషాల్లో ఆన్‌లైన్‌లో ఈజీగా ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం!
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రజల కోసం ఆన్‌లైన్‌లోనే మొబైల్ నంబర్ వెరిఫికేషన్ చేసుకునే అద్భుతమైన సదుపాయాన్ని కల్పిస్తోంది. దీనికోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే సరి పోతుంది.
1.ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లో బ్రౌజర్ ఓపెన్ చేసి UIDAI అధికారిక వెబ్ సైట్ (uidai.gov.in) లేదా మై ఆధార్ పోర్టల్‌లోకి వెళ్లాలి.
2.హోమ్ పేజీలో కనిపించే ‘Aadhaar Services’సెక్షన్‌కు వెళ్లండి. అక్కడ ‘Verify an Aadhaar Number’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ 12 ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
4. స్క్రీన్ పై కనిపించే క్యాప్చా కోడ్ టైప్ చేయండి.
5.ఆ తర్వాత ‘Proceed and Verify Aadhaar’ బటన్‌పై క్లిక్ చేయండి.
మీరు క్లిక్ చేసిన వెంటనే.. మీ ఆధార్ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఆ పేజీలో మీ వయస్సు, జెండర్, రాష్ట్రంతో పాటు కింద ‘Mobile Number’ అనే సెక్షన్ కనిపిస్తుంది. మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే.. ఆ నంబర్‌కు సంబంధించిన చివరి చివరి 3 అంకెలు అక్కడ స్పష్టంగా డిస్ప్లే అవుతాయి. (ఉదాహరణకు: xxxxxx1234). ఒకవేళ మీ మొబైల్ నంబర్ లింక్ కాకపోతే, అక్కడ ‘Not Linked’ లేదా ఖాళీగా కనిపిస్తుంది. దీని ద్వారా మీ ఫోన్ నంబర్ లింక్ అయిందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు.
ఒకవేళ మీ ఆధార్‌కు ఏ నంబరూ లింక్ కాకపోయినా.. లేదా పాత నంబర్ పోయి కొత్త నంబర్ మార్చుకోవాలనుకున్నా వెంటనే ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్ డేట్ చేయడానికి లేదా కొత్తగా లింక్ చేయడానికి UIDAI నిబంధనల ప్రకారం ..అధికారిక ఫీజు కేవలం రూ.50 మాత్రమే ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సాధారణంగా 2 నుంచి 5 రోజులు పడుతుంది. అప్‌డేట్ అయిన తర్వాత మీరు.. మళ్లీ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఆధార్ సేఫ్టీ, ఆన్‌లైన్ మోసాలను నివారించడానికి ఎప్పటి కప్పుడు మీ ఆధార్‌తో.. ఏ మొబైల్ నంబర్ లింక్ అయి ఉందో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఈజీ పద్ధతి ద్వారా మీరు కేవలం రెండు నిమిషాల్లో.. మీ స్టేటస్ తెలుసుకోవచ్చు.