Airtel 598 Plan: మొబైల్ రీఛార్జ్ అంటే ఒకప్పుడు కేవలం కాల్స్, డేటా మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌లతో పాటే ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు, ఇతర డిజిటల్ బెనిఫిట్స్‌ను అందిస్తున్నాయి. ఈ విషయంలో ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన రూ.598 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తక్కువ ధరలోనే ఎన్నో ప్రయోజనాలు ఇస్తున్న ఈ ప్లాన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ రూ.598 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో భాగంగా యూజర్లకు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 28 రోజులకు కలిపి 56GB డేటా వాడుకోవచ్చు. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. వీటి కోసం ప్రత్యేకంగా ఎలాంటి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అదనంగా ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి.
వినోదాన్ని ఇష్టపడే వారి కోసం ఈ ప్లాన్‌లో అదిరిపోయే ఓటీటీ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఒక్క రీఛార్జ్‌తో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీని ద్వారా మీకు నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లను హాయిగా చూడొచ్చు. అంతేకాకుండా.. జియోహాట్‌స్టార్ సూపర్ సబ్‌స్క్రిప్షన్ కూడా కాంప్లిమెంటరీగా వస్తుంది. వీటితో పాటు 28 రోజుల పాటు జీ5 ప్రీమియం, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం యాక్సెస్ కూడా ఉంటుంది. వేర్వేరు ఓటీటీల కోసం విడిగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పని ఉండదు.
Also Read: BSNL దిమ్మతిరిగే ఆఫర్.. జస్ట్ రూ.1కే కొత్త సిమ్.. 24 రోజులు ఫ్రీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!
కేవలం సినిమాలే కాకుండా క్రియేటివ్ వర్క్ చేసే వారి కోసం ఎయిర్‌టెల్ ఇందులో ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తోంది. బయట రూ.4,000 ధర ఉండే అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఏకంగా 12 నెలల పాటు పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. దీని సాయంతో మీరు సోషల్ మీడియా పోస్టులు, బ్యానర్లు, పోస్టర్లు, ఇతర గ్రాఫిక్ డిజైన్లను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కంటెంట్ క్రియేటర్లకు ఇది నిజంగా గొప్ప వరం.
మీ దగ్గర 5G స్మార్ట్‌ఫోన్ ఉండి, మీ ఏరియాలో ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉంటే అన్‌లిమిటెడ్ 5G డేటాను వాడుకోవచ్చు. రోజువారీ వచ్చే 2GB డేటాతో సంబంధం లేకుండా ఈ అదనపు 5G డేటా పనిచేస్తుంది. అలాగే సైబర్ మోసాల నుంచి రక్షణ కల్పించే Aitel Safe ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇది స్పామ్ కాల్స్ అలర్ట్స్ ఇవ్వడంతో పాటు ఫేక్ లింక్స్, ఓటీపీ బ్యాంకింగ్ మోసాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అదనంగా ప్రతి 30 రోజులకు ఒకసారి నచ్చిన హలో ట్యూన్‌ను ఉచితంగా సెట్ చేసుకోవచ్చు.
Also Read: భారత్‌లోకి Motorola Edge 70 Neo 5G.. ఈ ఫోన్ కోసం ఎదురుచూడటానికి ముఖ్య కారణాలివే!