UP Viral Video: ఉత్తరప్రదేశ్ లోని హమీర్‌పూర్ జిల్లాలో ప్రేమ వ్యవహారానికి సంబంధించి నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. కుమార్తె ప్రేమించిన యువకుడి తండ్రిపై ఆమె తల్లి కోర్టు బయట దాడికి పాల్పడింది. చెప్పుతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ చేసిన దాడి దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
బివాంర్ పోలీస్ స్టేషన్ (Biwanr Police Station) పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి.. కాన్పూర్ పరిధిలోని బిథూర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో కలిసి సెప్టెంబర్ 20న ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు బుధవారం నాడు ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె స్టేట్‌మెంట్ నమోదు చేయడానికి గురువారం కోర్టులో హాజరుపరిచారు.
న్యాయమూర్తి ఎదుట ఆ యువతి మాట్లాడూతూ తనకు ప్రియుడితోనే కలిసి ఉండాలని ఉందని స్పష్టం చేసింది. దీంతో బయట వేచి ఉన్న ఆమె తల్లికి ఈ విషయం తెలిసింది. కుమార్తె నిర్ణయంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లి.. కోర్టు ప్రాంగణం బయట ఉన్న యువకుడి తండ్రితో గొడవకు దిగింది.
ఆగ్రహంతో ఊగిపోయిన సదరు మహిళ.. యువకుడి తండ్రిని నిలదీస్తూ ఆయనపై దాడి చేసింది. చెంపదెబ్బలు కొడుతూ, కాళ్లతో తన్నుతూ, చెప్పుతో దాడికి పాల్పడింది. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఘటన అనంతరం ఆ మహిళ బొలేరో వాహనంలో అక్కడ నుంచి వెళ్లిపోయింది. రెండు కుటుంబాల మధ్య నెలకొన్న వివాదం ఈ రచ్చకు కారణమని తెలుస్తోంది.
#हमीरपुर।प्रेमी युगल के भागने के बाद युवती की मां ने युवक के पिता को पीटा,
महिला ने पुरुष को मारा पहले थप्पड़ फिर बरसाई चप्पलें,
पास में खड़े एक शख्स ने वीडियो बनाकर सोशल मीडिया पर किया वायरस,
प्रेमी युगल के भागने के बाद दोनों के परिजन थाने से निकले थे बाहर, pic.twitter.com/bZVyVQlyRq
— समाचार तंत्र टीवी | Samachar Tantra Tv (@SamacharTantraa) October 2, 2026
Also Read: ‘ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా’.. ఎలాన్ మస్క్ సడెన్ బ్రేకప్‌పై.. శివోన్ జిలిస్ తీవ్ర భావోద్వేగం!
అయితే ఈ దాడి ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. హమీర్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ యశ్ పాల్ సింగ్ మాట్లాడుతూ ‘ఈ దాడిపై మాకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు గానీ, సమాచారం గానీ రాలేదు. బాధితులు లేదా సంబంధిత వ్యక్తులు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. పరిశ్రమ బాయిలర్‌లో భారీ పేలుడు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి!