E-Paper
Advertisement

భూమిని కుళ్లుకునేలా చేస్తున్న గ్రహం.. చుట్టూ ఏకంగా 285 చందమామలు.. అక్కడంతా వెన్నెల మయం!

భూమిని కుళ్లుకునేలా చేస్తున్న గ్రహం.. చుట్టూ ఏకంగా 285 చందమామలు.. అక్కడంతా వెన్నెల మయం!
Advertisement

Saturn Moons: చిన్నప్పటి నుండి గురు గ్రహానికే (Jupiter) అత్యధిక చంద్రులు ఉన్నాయని చాలా మంది చదువుకుంటూ వచ్చారు. కానీ అందమైన వలయాలతో ఆకట్టుకునే శని గ్రహం (Saturn) ఆ రికార్డును తన పేరిట మార్చుకుంది. ఖగోళ శాస్త్రవేత్తలు శని గ్రహం చుట్టూ తిరుగుతున్న కొత్త, చిన్నపాటి ఉపగ్రహాలను గుర్తించారు. దీంతో శని గ్రహానికి ఉన్న మొత్తం చంద్రుల సంఖ్య ఏకంగా 285కి చేరుకుని చరిత్ర సృష్టించింది.

ఇవి సాధారణ చంద్రులు కావు..

అయితే శని గ్రహానికి ఉండే అతిపెద్ద ఉపగ్రహం ‘టైటాన్’ (Titan) లాగా ఇవి భారీ ఆకారంలో ఉండవు. వాటిలో చాలావరకు కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్నాయి. మైనర్ ప్లానెట్ సెంటర్ (MPEC 2026-F14) ధృవీకరించిన ఈ కొత్త ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు ‘ఇర్రెగ్యులర్ శాటిలైట్స్’ (క్రమరహిత ఉపగ్రహాలు) అని పిలుస్తున్నారు. ఇవి శని గ్రహానికి చాలా దూరంగా తిరుగుతుంటాయి. వీటిలో చాలావరకు గ్రహం తిరిగే దిశకు వ్యతిరేక దిశలో ప్రయాణించడం విశేషం. ఇవి శని గ్రహంతో పాటు పుట్టినవి కావని గతంలో అంతరిక్షంలో జరిగిన భారీ విస్ఫోటనాల వల్ల ఏర్పడిన శిథిలాలని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అవి శని గ్రహ ఆకర్షణకు లోనై దాని చుట్టూ తిరుగుతున్నాయని అయోవా విశ్వవిద్యాలయ పరిశోధకురాలు అలిసన్ జేన్స్ వివరించారు.

అంత దూరంలో వీటిని ఎలా గుర్తించారు?

Advertisement

భూమికి శని గ్రహం దాదాపు 120 కోట్ల కిలోమీటర్ల (746 మిలియన్ మైళ్లు) దూరంలో ఉంటుంది. ఇంతటి సుదూరంలో ఉన్న చిన్నపాటి రాళ్లను గుర్తించడం అంత సులభమైన పని కాదు. శక్తివంతమైన టెలిస్కోపుల సాయంతో శాస్త్రవేత్తలు రోజుల తరబడి ఆకాశంలో కదులుతున్న అతి సూక్ష్మమైన వెలుగు చుక్కలను నిశితంగా గమనించారు. అవి కేవలం అటుగా వెళ్తున్న గ్రహశకలాలు (Asteroids) కాదని శని గ్రహం చుట్టూనే తిరుగుతున్నాయని నిర్ధారించుకోవడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని జేన్స్ తెలిపారు.

భూమికి ఒక్కటే.. శని గ్రహానికి ఇన్ని ఎందుకు?

భూమికి ఒకే ఒక్క చందమామ ఉంటే శని గ్రహానికి దాదాపు 300 వరకు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆ గ్రహం పరిమాణం, ఉన్న ప్రదేశమని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శని గ్రహం మన భూమి కంటే దాదాపు 9 రెట్లు పెద్దది. దీనివల్ల దానికి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంది. పైగా శని గ్రహం ఉన్న ప్రాంతంలో అంతరిక్ష శిథిలాలు ఎక్కువ. మన భూమి పరిమాణంలో చిన్నది కావడమే కాకుండా సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ అంతరిక్ష శిథిలాలు తక్కువని అందుకే భూమికి ఒకే చంద్రుడు ఉన్నాడని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

Advertisement

Also Read: లిఫ్టులు, ఎస్కలేటర్లపై కొత్త రూల్స్.. ప్రభుత్వం కఠిన ఆంక్షలు.. రాష్ట్రంలో అందరూ పాటించాల్సిందే!

ఇంకా ఎన్నో దాగి ఉన్నాయా?

శని గ్రహంపై పరిశోధనలు ఇక్కడితో ఆగిపోలేదు. దాని చుట్టూ ఇంకా ఎన్నో చిన్న చంద్రులు దాగి ఉండి ఉంటాయని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. మనం అంతరిక్షాన్ని ఎంత దగ్గరగా, ఎంత లోతుగా పరిశీలిస్తే అంత కొత్త విషయాలు బయటపడతాయని అలిసన్ జేన్స్ అభిప్రాయపడ్డారు. అంతులేని ఈ విశ్వంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మరెన్ని వింతలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.

Also Read: పండుగ ఆఫర్లు లేవు.. హంగూ ఆర్భాటం ఉండదు.. అయినా సామాన్యుల అడ్డాగా డీమార్ట్ ఎలా మారింది?

Tags

Related News

చాట్‌జిపిటి ప్లస్ ఏడాది పాటు ఫ్రీ..వారికి ఓపెన్‌ఏఐ బంపర్ ఆఫర్!

బ్లాక్ ఫ్రైడే సేల్ 2026..ఐఫోన్లు,ఆండ్రాయిడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు,ఎప్పటినుంచంటే?

పవర్‌ఫుల్ పార్టీ స్పీకర్ వచ్చేసింది! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

మీ కిచెన్‌కి ఏ మిక్సర్ గ్రైండర్ బెటర్? 500W, 750W లేదా 1000Wలలో ఏది కొనాలి!

సాదాసీదా సౌండ్‌కి గుడ్‌బై చెప్పండి..ఈ హెడ్‌ఫోన్స్‌తో మ్యూజిక్ ఫీల్ నెక్స్ట్ లెవెల్ అంతే!

బడ్జెట్ ధరలో సూపర్ క్లీనింగ్ ఇచ్చే..టాప్ వాషింగ్ మెషీన్లు

రీఛార్జ్ ఖర్చు తగ్గించుకోవాలా? జియోలో రూ.147కే 22 రోజుల వ్యాలిడిటీ.. అన్‌లిమిటెడ్ కాల్స్!

Big Stories

Advertisement
×