E-Paper
Advertisement

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తప్పుడు సంకేతాలా? ఆ మంత్రుల పరపతికి పరోక్షంగా దెబ్బకొట్టే యత్నమా? బీఆరెస్‌ వ్యూహంలో భాగంగానే సురేఖ సారీ పాచికా?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తప్పుడు సంకేతాలా? ఆ మంత్రుల పరపతికి పరోక్షంగా దెబ్బకొట్టే యత్నమా? బీఆరెస్‌ వ్యూహంలో భాగంగానే సురేఖ సారీ పాచికా?
Advertisement

కొండా సురేఖ అంటే అంతే మరి. ఆమె ఏం మాట్లాడినా రాజకీయ వివాదానికే దారి తీస్తుంది. మంత్రిగా ఉన్నా లేకున్నా.. ఆమె మాటల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. కొండా మురళి వెనుకుండి నడిపించే సురేఖ రాజకీయాలు ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువే. తాజాగా ఆమె మరోసారి వార్తల్లెకెక్కారు.

గతంలో కేటీఆర్‌పై చేసిన కామెంట్స్‌పై పశ్చాత్తాపం ప్రకటించారు. సారీ చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగా చేసిన కామెంట్స్‌ కావవి అని సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ‘అప్పటి రాజకీయాల అవసరాల కోసమే చేశాను తప్ప.. వ్యక్తిగతంగా కేసీఆర్‌ను, ఆ కుటుంబాన్ని డ్యామేజీ చేయాలని ఏమాత్రం కాద’న్నారు. ప్రస్తుతం ఆమె సారీ చెప్పడంలోని రాజకీయ మర్మాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు.

Advertisement

ఆమెపై కేటీఆర్‌ గతంలో వేసిన కేసు విషయంలో ఉపసంహరణ కోసమే ఈ విధమైన కామెంట్ చేసి ఉంటారని బీఆరెస్‌ శిబిరం నుంచి ఆన్సర్ వస్తున్నా.. ఇది పెద్దగా నమ్మశక్యంగా లేదు. దాసుడి తప్పులు దండంతో సరి అన్నట్టుగా..నాగార్జున తనపై కేసు వేసిన విషయంలో సారీతో సరిపెట్టుకున్నట్టు.. రాజకీయంగా కేటీఆర్‌తో శత్రుత్వమెందుకు? అనే కోణంలో ఇలా చెప్పి ఉంటారా? అనే విశ్లేషణలు కూడా సాగుతున్నాయి.

అంతకు మించి కీలకమైన చర్చ మరోటి సాగుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ సురేఖ చేసిన ఈ కామెంట్స్‌ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. నల్లగొండ- వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి పేరును డిక్లేర్‌ చేశారు రేవంత్‌ రెడ్డి. ఖమ్మం ఉమ్మడి జిల్లా కూడా ఈ నియోజకవర్గంలో ఉండటం.. కీలకమైన ముగ్గురు మంత్రులు ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఈ ఎమ్మెల్సీ సీటు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది.

Advertisement

భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరావు.. ప్రభుత్వంలో కీలక మంత్రులు. రేవంత్‌రెడ్డి తరువాత అంతో ఇంతో సర్కార్‌లో కీలక మంత్రులుగా గుర్తింపు పొందుతున్నారు. నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా.. ఆయనను పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. బీఆర్‌ఎస్‌.. ఈ సీటు గెలుపుపై సీరియస్‌ నజర్‌ పెట్టింది. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌పై ఆశలు వదులుకున్నదా పార్టీ.

రెండు సీట్లలో కనీసం ఒక్కటైనా గెలవకపోతే పార్టీకి బూస్టింగ్‌ ఇస్తూ వస్తున్న తరుణంలో డ్యామేజీ ఖాయమని కేటీఆర్ భావిస్తున్నాడు. దీనికి తోడు ఈ ఎన్నికల ఫలితాలను సెమీ ఫైనల్స్‌గా చూడాలని హరీశ్‌రావు ఇది వరకే ప్రకటించి ఉన్నారు. దీంతో కచ్చితంగా ఒక సీటు గెలవాల్సిందేనన్న బలమైన సంకల్పంతో కేటీఆర్ ఉన్నాడు.

నల్లగొండ- ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి బరిలో ఉన్నాడు. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఈసారి సమీకరణలన్నీ కలిసి వస్తే.. కచ్చితంగా గెలుస్తాడనే ధీమాలో ఉన్నారంతా. ఈ క్రమంలోనే అసంతృప్త నేతగా ఉన్న సురేఖకు కేటీఆర్‌ గాలం వేశారా? ఆయన వేసిన వ్యూహంలో భాగంగా సురేఖ ఈ సారీ అనే పాచిక వేశారా? అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది.

ఎట్టి పరిస్థితుల్లో ఆమెను పార్టీలోకి తీసుకోబోమని జగదీశ్‌రెడ్డి ఇటీవల కామెంట్ చేశారు. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులండరనే విధంగా.. వరంగల్‌లో బలమైన బీసీ నేతలుగా కొండా దంపతులును చూస్తున్నారు. కడియం శ్రీహరిపై ప్రతీకారంతో రగిలిపోతున్నాడు కేటీఆర్‌. సురేఖ ద్వారా కడియానికి కూడా చెక్‌ పెట్టొచ్చనే సమీకరణ పై కూడా చర్చ జరుగుతోంది. మొత్తానికి కొండా వదిలిన  సారీ అనే ఈ బాణం బీఆరెస్‌ గ్రాడ్యుయేషన్‌ క్యాండిటేట్‌ రాకేశ్‌ రెడ్డికి మేలు చేసేలాగే ఉన్నాయనే కామెంట్స్ అయితే వస్తున్నాయి.

Tags

Related News

కేంద్ర కరువు సాయం ప్యాకేజీపై పెదవి విరుపేనా? నాడు కేసీఆర్‌కు చేదు అనుభవం..! ఇప్పుడు 20వేల కరువు ప్యాకేజీలో ఎంతిస్తారో?

రాజీవ్‌ను సోనియా వద్దన్నారు! సోనియాను రాహుల్‌ వద్దన్నారు! ‘బిలాంగింగ్‌ .. ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ బుక్‌ నేపథ్యంలో కొత్త చర్చ!

దేశ రాజకీయాల్లో మళ్లీ బిఆర్‌ఎస్‌ ఎంట్రీ.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

ఇలాంటి స్పూర్తే మీ నుంచి కోరుకునేది అధ్యక్షా! జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిన పీసీసీ చీఫ్‌ మెరుపు ధర్నా!

కాళేశ్వరం ఉంటే.. మళ్లీ తుమ్మిడిహట్టి ఎందుకు? వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

రజినీకాంత్ వదిలేసిన కల.. అల్లుడు ధనుష్ నిజం చేయబోతున్నారా?

ఫ్రీ బస్సుపై దుష్ప్రచారం..అది మహిళలపై కోపమా? సర్కార్‌ను బద్నాం చేసే వ్యూహమా? బండి కనకయ్య మాటలతో తొండి వాదన!

Big Stories

Advertisement
×