Youtube Monitization : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ల కోసం సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూనే ఉంటుంది. అదే సమయంలో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు తమ ట్యాలెంట్ చూపించుకోవడం కోసం, అలాగే మంచి ఆదాయం పొందేందుకు చక్కని ప్లాట్‌ఫామ్. తమ ప్యాషన్‌ను మంచి లాభాదాయక వనరుగా మార్చుకోవడానికి యూట్యూబ్ చక్కని వేదిక. అయితే ఆదాయ వనరుగా మార్చుకోవడానికి కేవలం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని, కంటెంట్‌ను అప్లోడ్ మాత్రమే చేస్తే కుదరదు. మానిటైజేషన్ కూడా చేయాలి. ఈ కథనంలో మానిటైజేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
అసలు యూట్యూబ్ మానిటైజేషన్ అంటే ఏమిటి? –
యూట్యూబ్‌లో మానిటైజేషన్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు డబ్బులు సంపాదించుకోవచ్చు. అడ్వటైజ్మెంట్స్, ఛానెల్ మెంబర్షిప్స్, సూపర్ చాట్, మెర్చండైజ్ షెల్ఫ్ ద్వారా ఆదాయాన్ని పొందుచ్చు. అయితే వీటిని పొందాలంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాలి.
యూట్యూబ్ పార్ట్నర్ ప్రొగ్రామ్‌కు అర్హత సాధించాలంటే? –
మీ యూట్యూబ్ ఛానల్‌ను మానిటైజ్ చేసే ముందు ప్రతీ ఒక్కరూ ఈ అర్హత ప్రాసెస్‌ను ఫాలో అవ్వాలి. యూట్యూబ్ పాలిసీస్ను, గైడ్‌లైన్స్‌ను కచ్చితంగా అనుసరించాలి. ఇందులో కమ్యూనిటీ గైడ్‌లైన్స్, టెర్మ్స్ ఆఫ్ సర్వీసెస్, కాపీ రైట్ లాస్ ఉంటాయి.
ప్రతి ప్రాంతంలో, దేశంలో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఉంటుంది. అయితే ఇది చాలా చోట్ల ఉన్నప్పటికీ, అన్ని దేశాల్లో ఉండదు. అలానే గడిచిన 12 నెలల కాలంలో వీడియోలు కనీసం 4,000 వాచ్ అవర్స్ కలిగి ఉండాలి. 1000కుపైగా సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఆదాయం ఆర్జించడం కోసం యాడ్సెన్స్ అకౌంట్‌ను లింక్ చేసుకోవాలి.
మానిటైజేషన్ ఎలా అప్లై చేయాలి? –
మాజిటైజేషన్కు అర్హత సాధించాలంటే కొన్ని స్టెప్స్‌ను ఫాలో అవ్వాలి.
స్టెప్ 1 : ముందుగా 2 స్టెప్ వెరిఫికేషన్ పొందాలి. మీ గూగుల్ అకౌంట్లో 2 స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఈ సెక్యురిటీ ప్రాసెస్ మీ అకౌంట్‌ను రక్షణగా ఉంటుంది.
స్టెప్ 2 : యూట్యూబ్‌లో సైన్ ఇన్ చేసుకోవాలి
మీరు ఏ అకౌంట్‌కు అయితే మానిటైజేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో, ఆ అకౌంట్లో సైన్ ఇన్ అవ్వాలి.
స్టెప్ 3: యాక్సెస్ యూట్యూబ్ స్టూడియో
టాప్ రైట్ కార్నర్లో ఉన్న ప్రొఫైల్ పిక్చర్లో యూట్యూబ్ స్టూడియో పై క్లిక్ చేయాలి.
స్టెప్ 4 : మానిటైజేషన్‌ను నావిగేట్ చేయాలి
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బార్లో ఉన్న మానిటైజేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అది మానిటైజేషన్ ఓవర్ వ్యూ పేజ్‌కు తీసుకెళ్తుంది.
స్టెప్ 5 : రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టెర్మ్స్
రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టెర్మ్స్పై క్లిక్ చేసి, అందులో టెర్మ్స్‌ను చదవాలి. అది మీకు ఓకే అనుకుంటే యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అనాలి.
స్టెప్ 6 : గూగుల్ యాడ్సెన్స్ కోసం సైన్అప్ చేయాలి.
మీకు యాడ్సెన్స్ అకౌంట్ లేదంటే, మీరు ఒకటి క్రియేట్ చేసుకుని యూట్యూబ్ ఛానల్‌పై క్లిక్ చేయాలి. స్టార్ట్పై క్లిక్ చేసి, సైప్ అప్ ఫర్ యాడ్సెన్స్పై మళ్లీ క్లిక్ చేయాలి. అప్పుడు ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది.
స్టెప్ 7 : మానిటైజేషన్ ప్రిఫరెన్సెస్ సెట్ చేయాలి
సెట్ మానిటైజేషన్ ప్రిఫరెన్సెస్పై స్టార్ట్ అని క్లిక్ చేయాలి. అక్కడ మీకు ఎలాంటి యాడ్స్ మీ అకౌంట్‌పై రన్ చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి. మీ అవసరాన్ని బట్టి దాన్న అడ్జెట్ చేసుకోవాలి.
స్టెప్ 8 : వెయిట్ ఫర్ రివ్యూ
ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే, మీ ఛానల్‌ను యూట్యూబ్ అన్నీ పాలిసీస్, గైడ్‌లైన్స్‌తో రివ్యూ చేస్తుంది. ఈ ప్రాసెస్ట్ కోసం కొన్ని వారాలు పడుతుంది. ఆ తర్వాత మానిటైజేషన్ అయితే ఈమెయిల్ ద్వారా యూట్యూబ్ మీకు సమాచారం అందిస్తుంది.
యూట్యూబ్ ద్వారా ఎక్కువ సంపాదించాలంటే? –
హై క్వాలిటీ కంటెంట్‌ను క్రియేట్ చేయాలి. ఎప్పటికప్పుడు వ్యూయర్స్‌ను ఆకర్షించేలా కంటెంట్‌ను క్రియేట్ చేయాలి. ఇంకా అవి ఇన్ఫర్మేటివ్గా, మంచి ఎడిటింగ్‌తో ఉండాలి. మీ వీడియో కోసం లేదా సమాచారం కోసం సెర్చ్ చేయగానే మీ వీడియో కనిపించేలా మంచి టైటిల్స్, డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్ ఇవ్వాలి. దీని ద్వారా మీ వ్యూస్ పెరుగుతాయి. మంచి వాచ్ టైమ్ వస్తుంది.
మీ వీడియోలకు వచ్చే కామెంట్స్‌కు మీరు స్పందిస్తూ ఉండాలి. ఫీడ్ బ్యాక్ కోరడం వంటి కూడా చేయాలి. ముఖ్యంగా ఎంగేజ్డ్ వ్యూవర్స్ కోసం ఈ పని చేస్తూ ఉండాలి. మీ ఛానల్‌ను ప్రమోట్ కూడా చేసుకోవాలి. సోషల్ మీడియా, బ్లాగ్స్ లేదా ఇతర ప్లాట్‌ఫామ్స్ ద్వారా మీ యూట్యూబ్ ఛానల్‌ను ప్రమోట్ చేయాలి. తద్వారా మీ వీడియోస్ ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా రెగ్యూలర్‌గా మీ యూట్యూబ్ అనలిటిక్స్‌ను మానిటర్ చేయాలి. మెరుగైన వ్యూస్ కోసం మంచి స్ట్రాటజీలను ఉపయోగించాలి.
ALSO READ : యాపిల్, సామ్సాంగ్ కు వన్‌ప్లస్ షాక్! ముందెన్నడూ లేని ఫీచర్స్ తో కొత్త మెుబైల్ వచ్చేస్తుందోచ్