OnePlus Open 2 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్.. వచ్చే ఏడాది రెండవ త్రైమాసికంలో అదిరే కొత్త మెుబైల్ ను తీసుకురాబోతుంది. OnePlus Open 2 పేరుతో వచ్చేస్తున్న ఈ మెుబైల్ Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ తో గ్లోబల్ మార్కెట్‌లోకి లాంఛ్ కాబోతుంది.
వన్ ప్లస్ కంపెనీ OnePlus Open మెుబైల్ ను స్టార్ట్ చేసిన సమయంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చిన్నపాటి తుఫాన్ వచ్చిందనే చెప్పాలి. అయితే, ఇది పాత కథ.. ఇప్పుడు ఆ బ్రాండ్ పేరుతో మరో కొత్త మెుబైల్ ను పాత మెుబైల్ కు ధీటుగా తీసుకురావటానికి వన్ ప్లస్ సన్నాహాలు చేస్తుంది. అయితే వచ్చే ఏడాది ఈ మెుబైల్ చైనాలో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మెుబైల్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. ముందు వెర్షన్ తో పోలిస్తే లేటెస్ట్ ఫీచర్స్ తో ఈ మెుబైల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక Oppo Find N5 రీబ్రాండెడ్ వెర్షన్ అని కూడా తెలుస్తుంది. ఈసారి, OnePlus కొత్త ఫీచర్లతో పాటు మెురుగైన క్వాలిటీస్ తో OnePlus ఓపెన్ 2ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
OnePlus Open 2 Features –
ఈ మొబైల్ లేటెస్ట్ అప్డేట్స్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ తో పనిచేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. Weiboలో ప్రముఖ టిప్‌స్టర్ అయిన డిజిటల్ చాట్ స్టేషన్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో వచ్చిన దాని ముందు వెర్షన్ తో పోలిస్తే ఇది ఒక పెద్ద మార్పని తెలిపింది. ఇక ఈ కొత్త ఫోన్ లో మెరుగైన గేమింగ్ అనుభవం సైతం పొందే అవకాశం ఉందని తెలిపింది.
ఎంతో గ్రాండ్ గా లాంఛ్ అయిన వన్ ప్లస్ ఓపెన్ మొబైల్.. వైర్లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయకపోవడం కొన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు రాబోతున్న వన్ ప్లస్ ఓపెన్ టు మొబైల్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ను కలిగి ఉండనుంది. దీంతో లేటెస్ట్ మెుబైల్స్ కు పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఇతర లీక్స్ సైతం టెక్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి. OnePlus Open 2కి IPX8 వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఉంటుందని తెలుస్తుంది. ‘యాంటీ డ్రాప్ బాడీ స్ట్రక్చర్’ అనే ప్రత్యేక లక్షణాన్ని కూడా ఉండనుంది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్ మంచి మన్నికను కలిగి ఉంటుందని తెలుస్తుంది.
వన్‌ప్లస్ ఓపెన్ 2 సెన్సార్‌లకు సంబంధించిన కొన్ని లీక్స్ సైతం వినిపిస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆప్టికల్ జూమ్ సదూపాయంతో 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది.
ఇక లాంఛ్ విషయానికొస్తే, Oppo Find N5 మార్చి 2025 చివరి నాటికి చైనీస్ మార్కెట్‌కు రాబోతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. 2025 రెండవ త్రైమాసికం నాటికి OnePlus Open 2 ఇండియాలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.