Allu Arjun Pushpa 2 :అల్లు అర్జున్ (Allu Arjun).. ఒకప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి, ఆ తర్వాత తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఎప్పుడైతే సుకుమార్(Sukumar)దర్శకత్వంలో పుష్ప(Pushpa) సినిమా చేసి జాతీయ అవార్డు లభించిందో.. ఇక అప్పటినుంచి ఆయనలో పూర్తిగా మార్పు వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా యాటిట్యూడ్ చూపిస్తూ తగ్గేదేలే అంటూ సిగ్నేచర్ డైలాగ్ తో మరింత దురుసుగా ప్రవర్తిస్తున్నారని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు ఇటీవల ‘పుష్ప 2’ సినిమా విడుదలై ఏకంగా వారంలోపే రూ.1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. దీంతో ఈయన ధిమాక్ మరింత పెరిగిందని అందరూ విమర్శిస్తూ ఉండడం గమనార్హం.
పుష్ప 2 బెనిఫిట్ షోలో మహిళ మృతి.. పట్టించుకోని బన్నీ..
ఇదిలా ఉండగా పుష్ప 2 ఇచ్చిన క్రేజ్ తో.. ఆ గౌరవాన్ని ఆయన ఉపయోగించుకోకుండా.. ఎక్కువగా తగ్గేదేలే అని కామెంట్లు చేస్తూ తాను ధరించే బట్టల్లో కూడా ఐకాన్ స్టార్, వైల్డ్ ఫైర్ అంటూ యాటిట్యూడ్ చూపిస్తున్నారనే వార్తలు కూడా వ్యక్తం అవుతున్నట్లు సమాచారం.. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్ సంఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. అక్కడికి ర్యాలీతో వచ్చిన బన్నీకి ఆ మహిళ చనిపోయిన విషయం తెలుసు. ఆమె కొడుకు శ్రీ తేజ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విషయం కూడా తెలుసు
కానీ వాటిని పట్టించుకోకుండా మళ్లీ రిటర్న్లో ర్యాలీ చేసుకుంటూ వెను తిరిగిపోవడంతో ఆయనలో మానవత్వం పూర్తిగా తగ్గిపోయిందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఒక అభిమాని కూడా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తగ్గేదేలే కాదు ఇకనైనా తగ్గు.. మానవత్వం అలవాటు చేసుకో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.
బన్నీ అరెస్ట్..
ఇదిలా ఉండగా సంధ్యా థియేటర్ సమయంలో ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేస్ ఫైల్ అయింది. దీనికి తోడు అల్లు అర్జున్ ను అరెస్టు చేయగా నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే హైకోర్టులో అల్లు అర్జున్ తరఫు న్యాయవాది క్వాష్ పిటిషన్ వేయగా.. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మాత్రమే లభించింది. ఇక బెయిల్ వచ్చిన తర్వాత కూడా కోర్టు ఆదేశాల మేరకు శ్రీతేజ కుటుంబాన్ని నేను కలవలేక పోతున్నాను అని చెప్పడంతో అల్లు అర్జున్ పై పూర్తి వ్యతిరేకత నెలకొంటోంది. ఇదిలా ఉండగా అరెస్ట్ కారణంగా ఆయన ప్లాన్స్ అన్నీ కూడా అప్సెట్ అయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
రాత్రంతా జైల్లోనే..
అసలు విషయంలోకెళితే.. రాత్రంతా చంచల్గూడా జైల్లో గడిపిన అల్లు అర్జున్, మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చారు. ఇంటిదగ్గర బన్నీని చూడగానే కుటుంబం భావోద్వేగానికి గురైంది. ఆ తర్వాత హుషారుగా, ధైర్యంగా కనిపిస్తూ మీడియా ముందు కొత్త వివాదాలకు చోటు ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. ఇక్కడితో ఎండ్ కార్డు పడలేదు..ఈ అరెస్ట్ ప్రభావం ఇంకొంత కాలం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బన్నీకి దొరికింది కేవలం మధ్యంతర మాత్రమే. ఈ బెయిల్ వల్ల 14 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలులో మగ్గాల్సిన బాధ తప్పింది. కాకపోతే ఇంకా విచారణలోనే ఉన్న నేపథ్యంలో బన్నీ ప్లాన్స్ అన్నీ కూడా అప్సెట్ అయిపోయాయి.
బన్నీ ఆశలకు గండి..
పుష్ప -2 ప్రచారం ఈవారం మొత్తం చేద్దామనుకున్నారు. అలాగే నార్త్ లో రెండోసారి ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాడు కూడా.. హైదరాబాద్ లో కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు.. తాను చేయాల్సింది.. తిరగాల్సింది ఎంతో ఉంది. అంతేకాదు ఇదంతా పూర్తయితే ఫ్యామిలీతో వరల్డ్ టూర్ వెళ్దాం అనుకున్నారట. కానీ ఇంతలోనే అరెస్టయ్యాడు. అరెస్ట్ అయినా ఇంకా కేసు నడుస్తూనే ఉంది. దాంతో పుష్ప 2 ప్రమోషన్లకు గండి పడినట్టు అయింది. ఈ ప్రమోషన్లు అవ్వగానే కుటుంబంతో వెకేషన్ కి వెళ్దాం అనుకున్నాడు. కానీ ఇప్పట్లో కుదరనట్టే. ఇంకొన్ని రోజులు సినిమాకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా బన్నీ దూరం కావాల్సిందే. ఏది ఏమైనా బన్నీ చేసిన పొరపాటే ఇప్పుడు ఆయన ప్లాన్స్ కు వ్యతిరేకంగా మారిందని చెప్పవచ్చు.