Bigg boss 10:బిగ్ బాస్ సీజన్ 10వ వారంలో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్ స్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. వంశీ, ముఖేష్, నరేష్, శ్వేత లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చి సందడి చేయగా.. ఇప్పుడు రాంప్రసాద్ తల్లి గారు అలాగే ఆయన కూతురు వచ్చి ఆకట్టుకున్నారు. ఇక కంటెస్టెంట్స్ తో సరదాగా గడిపిన వీరు.. రాంప్రసాద్ గురించి ఒక సీక్రెట్ బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు రాంప్రసాద్ తల్లి. అంతేకాదు రాంప్రసాద్ కూతురు కంటెస్టెంట్స్ తో ఆట ఆడి అందరినీ ఆకట్టుకుంది. మొత్తానికైతే ఈ పిల్లను చూసిన నెటిజన్స్ రామ్ ప్రసాద్ అన్న కూతురు గడుసు పిల్లే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి తాజా ప్రోమో ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం.
ఫ్యామిలీ వీక్ లో భాగంగా 67వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోని తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. బీబీ స్కూల్లో భాగంగా బ్యాక్ బెంచర్స్ అయిన త్రిగుణ్ , రామకృష్ణ ని పిలిచి మీరిద్దరూ 25 తెచ్చుకున్నారు. 75 కోసం ప్రయత్నం చేయండి అంటూ నరేష్ నవ్వించాడు. ఇక రామకృష్ణ మాట్లాడుతూ మమ్మల్ని ఎవరు గుర్తించలేదు సార్.. మీరే గుర్తించారు అంటూ కామెడీతో నవ్వించాడు. తర్వాత రాంప్రసాద్ తల్లి హౌస్ లోకి వచ్చింది. ఆ తర్వాత రాంప్రసాద్ కూతురు ఎంట్రీ ఇచ్చింది. ఇక హౌస్లో తాము ఎక్కడ ఉంటాము ? ఎలాగే ఆడతాము ఇలా ప్రతి విషయాన్ని తన కూతురికి వివరించారు రాంప్రసాద్.
ఆ తర్వాత ముఖేష్ మాట్లాడుతూ.. ఎప్పుడూ నవ్వుతూ నవ్వించే రాంప్రసాద్ ఏ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు?” అని ప్రశ్నించారు. దీనికి రాంప్రసాద్ తల్లి మాట్లాడుతూ.. “ఇప్పటివరకు అయితే నేను రాంప్రసాద్ లో ఆ సీరియస్ నెస్ చూడలేదు. ఒకవేళ మనసులో బాధ ఉన్నా.. కోపం ఉన్నా.. మింగేస్తాడే తప్ప బయటకు చూపించడు” అంటూ ఆయనలోని ఒక రహస్యాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.
also read:చాగంటి ప్రవచనాలతో ‘ఇడుపు కాయితం’ అఫీషియల్ టీజర్.. ఎలా ఉందంటే?
ఇక రాంప్రసాద్ కూతురు కంటెస్టెంట్స్ తో ఒక ఆట ఆడుకుంది. మొత్తానికి అయితే చిన్నారి రాకతో హౌస్ లో అల్లరి నవ్వులు పూసాయి. తనకు ఇష్టమైన ఐస్క్రీం పైన రింగ్ వేసి కంటెస్టెంట్స్ కి ట్రీట్ ఇచ్చింది రాంప్రసాద్ కూతురు. మొత్తానికైతే సరదాగా సాగిన ఈ ప్రోమో ఎక్కడ ఎమోషనల్ కి చోటు ఇవ్వకుండా చాలా సరదాగా బాగుంది.
ఇదిలా ఉండగా మరొకవైపు నామినేషన్ లో 12 మంది ఉండగా.. ఎలిమినేషన్ దిశగా అడుగులు వేసే ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరు అనే ఆసక్తి నెలకొంది. తాజా ఓటింగ్ ప్రకారం సుధీర్, నీతూ మాస్టర్ డేంజర్ జోన్ లో ఉన్నారు. పైగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే కామెంట్లు కూడా వినిపోస్తున్నాయి. ఒకవేళ నిజంగానే డబుల్ ఎలిమినేషన్ అంటే.. వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అవుతారా లేక ఓటింగ్లో మార్పు వస్తుందా అనే విషయం వైరల్ గా మారింది.