E-Paper
Advertisement

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే ఈ మోసాలపై బీ అలర్ట్.. తెలంగాణ సైబర్ బ్యూరో వార్నింగ్!

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే ఈ మోసాలపై బీ అలర్ట్.. తెలంగాణ సైబర్ బ్యూరో వార్నింగ్!
Advertisement

Online Scams: ఆన్‌ లైన్‌ షాపింగ్‌ చేసే వారిని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెగబడుతున్నారు. నకిలీ ప్రకటనలతో నగదు వసూలు చేయడంతోపాటు క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వివరాలను తస్కరించి అనధికార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ప్రజలకు జాగ్రత్త అంటూ హెచ్చరిక జారీ చేసింది. సైబర్‌ అవగాహన ప్రచారంలో భాగంగా ‘మీ డబ్బు.. మీ క్లిక్‌.. మీ ఎంపిక’ అన్న నినాదంతో ప్రజలకు సూచనలు చేసింది.

నమ్మశక్యం కాని డిస్కౌంట్లతో టోకరా..

ఇన్‌ స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో బ్రాండెడ్‌ ఎలక్ట్రానిక్‌ వస్తువులు, దుస్తులు, హాలిడే ప్యాకేజీలు, బ్యూటీ, గృహ సేవలు, ఆన్‌ లైన్‌ కోర్సులను భారీ రాయితీలతో అందిస్తామంటూ మోసగాళ్లు ప్రకటనలు ఇస్తున్నారు. ‘ఫ్లాట్‌ 70 శాతం డిస్కౌంట్‌’, ‘మెగా సేల్‌’ అంటూ ఆకర్షిస్తున్నారు. వీటిని నమ్మి యూపీఐ, డిజిటల్‌ వాలెట్లు, బ్యాంకు బదిలీల ద్వారా ముందస్తుగా డబ్బులు చెల్లించిన వారిని మోసం చేస్తున్నారు. నకిలీ ఆర్డర్‌ ధ్రువీకరణలు పంపి, డెలివరీ ఆలస్యమైందంటూ కాలయాపన చేస్తున్నారు. ఆ తర్వాత ఫోన్‌ నంబర్లను బ్లాక్‌ చేసి వెబ్‌సైట్లను మూసివేస్తున్నారు. చివరికి డబ్బులు పోవడమే తప్ప వస్తువులు, సేవలు అందడం లేదు.

కార్డు పరిమితి పెంపు పేరుతో..

Advertisement

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుదారులను లక్ష్యంగా చేసుకుని మరో తరహా మోసానికి పాల్పడుతున్నారు కేటుగాళ్లు. బ్యాంకు రివార్డులు, క్యాష్‌ బ్యాక్‌, క్రెడిట్‌ కార్డు పరిమితి పెంపు పేరుతో ఫిషింగ్‌ లింక్‌లు పంపుతున్నారు. ‘మీ కార్డు పరిమితిని 5 లక్షలకు పెంచుకోండి’ అంటూ నమ్మిస్తున్నారు. ఆ లింకులను తెరిచినవారి చేత ఏటీఎం కార్డు నంబరు, గడువు తేదీ, సీవీవీ, పిన్‌, ఓటీపీ వివరాలను నమోదు చేసేలా చేస్తున్నారు. సేకరించిన వివరాలతో బాధితుల అనుమతి లేకుండానే దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించి నగదు కాజేస్తున్నారు.

సైబర్ బ్యూరో కీలక సూచనలు..

ఆన్ లైన్ మోసాల బారిన పడకుండా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గొయల్ పలు సూచనలు చేశారు. గుర్తుతెలియని సోషల్‌ మీడియా విక్రేతల వద్ద నుంచి కొనుగోళ్లు చేయవద్దన్నారు. అసాధారణంగా తక్కువ ధరలకు వస్తువులు అందిస్తామనే ప్రకటనలను నమ్మొద్దన్నారు. ధృవీకరించని ఖాతాలకు ముందస్తు చెల్లింపులు చేయవద్దన్నారు. వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌లలో వచ్చే గుర్తుతెలియని ఏపీకే ఫైళ్లను డౌన్‌ లోడ్‌ చేయద్దని సూచించారు. కార్డు నంబరు, సీవీవీ, పిన్‌, ఓటీపీ వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని చెప్పారు. కార్డు అప్‌ గ్రేడ్‌, రివార్డు ఆఫర్లను బ్యాంకు అధికారిక యాప్‌ లేదా కస్టమర్‌ కేర్‌ ద్వారా నిర్ధారించుకోవాలన్నారు.

Advertisement

Also Read: జియో రూ. 1,748 vs రూ. 1,799 ప్లాన్లు.. బెనిఫిట్స్ పరంగా దేని దమ్ము ఎంత? ఏది రీఛార్జ్ చేస్తే బెటర్?

గంటలోపు ఫిర్యాదు చేస్తే డబ్బు సేఫ్!

ఒకవేళ అనధికార లావాదేవీ సమాచారం అందిన వెంటనే కార్డును బ్లాక్‌ చేసి బ్యాంకుకు తెలియజేయాలని సూచించారు. గోల్డెన్‌ హవర్‌ అయిన మొదటి గంటలో ఫిర్యాదు చేయాలన్నారు. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, చెల్లింపులు, బ్యాంకింగ్‌ అభ్యర్థనల విషయంలో తొందరపడకుండా ముందుగా ధృవీకరించుకోవాలని సూచించారు. సైబర్‌ ఆర్థిక మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ 1930కు కాల్‌ చేయాలన్నారు. www.cybercrime.gov.in వెబ్‌ సైట్‌ లో ఫిర్యాదు నమోదు చేయాలని కోరారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బును ఫ్రీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

Also Read: వీఐ రూ.398 ప్లాన్.. కాలింగ్, 5G డేటాతో పాటు.. 19 ఓటీటీలు ఉచితం!

Tags

Related News

పండుగలను మనం కోల్పోయామా..? పండుగలే మనల్ని వదిలేసి వెళ్లిపోయాయా..?

జియో రూ. 1,748 vs రూ. 1,799 ప్లాన్లు.. బెనిఫిట్స్ పరంగా దేని దమ్ము ఎంత? ఏది రీఛార్జ్ చేస్తే బెటర్?

పెళ్లికాని ప్రసాదులకు ఏఐ హెచ్చరిక.. ఫోటో చూసి ఫ్లాట్ అయ్యారో.. ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం!

iPhone 20 Proలో ఊహించని మార్పు.. డైనమిక్ ఐలాండ్ విషయంలో యాపిల్ ప్లాన్ ఇదేనా?

వీఐ రూ.398 ప్లాన్.. కాలింగ్, 5G డేటాతో పాటు.. 19 ఓటీటీలు ఉచితం!

ఇంట్లోనే కేఫ్ స్టైల్ కాఫీ..రూ.1,899కే అగారో రాయల్ కాఫీ మేకర్‌

వాట్సప్‌లో ఏఐతో పనులు మరింత ఈజీ.. ప్రైవసీ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్న సీఈఓ!

Big Stories

Advertisement
×