E-Paper
Advertisement

ఒక సెకనులో 20 వేల 4K సినిమాలు డౌన్‌లోడ్.. ఇంటర్నెట్ వేగంలో చైనా ప్రపంచ రికార్డు!

ఒక సెకనులో 20 వేల 4K సినిమాలు డౌన్‌లోడ్.. ఇంటర్నెట్ వేగంలో చైనా ప్రపంచ రికార్డు!
Advertisement

Optical Fiber Technology: కమ్యూనికేషన్ రంగంలో ఒక అద్భుతమైన, అసాధారణ ఘటన చోటుచేసుకుంది. ఆప్టికల్ ఫైబర్ ద్వారా అత్యంత వేగంగా డేటాను చేరవేసే క్రమంలో చైనాకు చెందిన పరిశోధకులు ప్రపంచ రికార్డును నెలకొల్పారు. 24 కోర్ కేబుల్‌ను ఉపయోగించి రియల్ టైమ్‌లో సెకనుకు ఏకంగా 3.2 పెటాబిట్లు (Pb/s) డేటాను ప్రసారం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. హుబే ప్రావిన్స్ ప్రభుత్వ నివేదిక ప్రకారం.. ఈ వేగంతో ఒకే ఒక్క సెకనులో 20,000 కంటే ఎక్కువ 4K నాణ్యత కలిగిన సినిమాలను ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గత రికార్డు పటాపంచలు!

చైనా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ గ్రూప్ ఆధ్వర్యంలోని ‘నేషనల్ కీ లాబొరేటరీ ఆఫ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ నెట్‌వర్క్, పెంగ్‌చెంగ్ లాబొరేటరీ, ఫైబర్‌హోమ్ ఫుజిక్యురా ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా ఈ పరిశోధనను విజయవంతం చేశాయి. ఇదే పరిశోధక బృందం ఈ ఏడాది ఆరంభంలో సెకనుకు 2.5 పెటాబిట్ల వేగంతో రికార్డు సృష్టించగా.. 12 నెలలు తిరక్కుండానే దానిని తిరగరాయడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. పాత రికార్డుతో పోలిస్తే ఏకంగా 30 శాతం వేగాన్ని పెంచడం వారి అద్భుతమైన సాంకేతిక నైపుణ్యానికి అద్దం పడుతోంది.

32 లక్షల రెట్లు ఎక్కువ

Advertisement

సాధారణంగా మన ఇళ్లలో వాడే ఒక గిగాబైట్ (1 Gbps) వేగం కలిగిన ఇంటర్నెట్ కనెక్షన్‌తో పోలిస్తే.. ఈ కొత్త రికార్డు వేగం దాదాపు 32 లక్షల రెట్లు ఎక్కువ. రాబోయే రోజుల్లో ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే ఒక్క ఫైబర్ లైన్ ద్వారా ఏకకాలంలో 32 లక్షల ఇళ్లకు గిగాబైట్ స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను నిరంతరాయంగా అందించవచ్చు. కాగా, ఈ ప్రయోగంలో ఇంజనీర్లు ‘స్పేషియల్ డివిజన్ మల్టీప్లెక్సింగ్’ (SDM)తో పాటు ‘S+C+L మల్టీ బ్యాండ్ ట్రాన్స్‌మిషన్’ టెక్నాలజీని 24-కోర్ ఫైబర్ కేబుల్‌పై విజయవంతంగా అప్లై చేశారు. అయితే ఈ విజయం అంతా ఈజీగా పరిశోధకులకు దక్కలేదు. ప్రయోగ సమయంలో పరిశోధకులు రెండు ప్రధాన సాంకేతిక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆ సవాళ్లను దాటుకుని వారు సాధించిన ఈ విజయం కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త బాటలు వేసింది.

Also Read: ఫ్లాట్ ఇవ్వడంలో ఆలస్యం.. బిల్డర్‌కు వినియోగదారుల కమిషన్ బిగ్ షాక్.. రూ.87 లక్షల ఫైన్!

ఈ రికార్డు ప్రత్యేకత ఏంటంటే

Advertisement

అయితే గతంలో కూడా ప్రయోగశాలలలో సైద్ధాంతికంగా 5.29 Pb/s వరకు వేగాన్ని నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవన్నీ వాణిజ్యపరంగా వాడటానికి వీలులేని సంక్లిష్టమైన ప్రయోగశాల పరికరాలపై మాత్రమే సాధ్యమయ్యాయి. అయితే ప్రస్తుత చైనా బృందం సాధించిన 3.2 Pb/s రికార్డు ప్రత్యేకత ఏంటంటే.. ఇది మార్కెట్‌లో సాధారణంగా లభించే వాణిజ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న హార్డ్‌వేర్ ఆధారంగానే సాధ్యమైంది. ఈ నయా సాంకేతికత అతి త్వరలోనే పబ్లిక్ నెట్‌వర్క్‌లు, పెద్ద పెద్ద ఎంటర్‌ప్రైజ్ నెట్‌వర్క్‌లలో ప్రత్యక్షంగా వినియోగంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చైనా వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read: వీఐ యూజర్లకు ఊహించని షాక్.. 84 రోజుల ప్లాన్ ధర పెంపు.. కొత్త ధర, బెనిఫిట్స్ ఇవే!

Tags

Related News

ఫోన్ హ్యాంగ్ అవుతోందా?ఈ సింపుల్ సెట్టింగ్స్‌తో రాకెట్ లా దూసుకెళ్తుంది

కొత్త పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా? వీటి కంటే బెస్ట్ ఉండవేమో!

వీఐ యూజర్లకు ఊహించని షాక్.. 84 రోజుల ప్లాన్ ధర పెంపు.. కొత్త ధర, బెనిఫిట్స్ ఇవే!

మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఇది మీ మంచికే బాస్!

చిన్న కుటుంబాలకు బెస్ట్ 5 స్టార్ ఫ్రిజ్..ఇప్పుడు ఆఫర్‌‌లో తక్కువ ధరకే!

మీరు మాట్లాడింది ఇట్టే టెక్స్ట్ అయిపోతుంది! ట్రెండింగ్‌లో ఉన్న ఈ గాడ్జెట్ గురించి తెలుసా?

రూ.729కే పోర్ట్రానిక్స్ ఇయర్ బడ్స్..ఫీచర్స్ చూస్తే మతిపోతుంది!

Big Stories

Advertisement
×