E-Paper
Advertisement

వీఐ యూజర్లకు ఊహించని షాక్.. 84 రోజుల ప్లాన్ ధర పెంపు.. కొత్త ధర, బెనిఫిట్స్ ఇవే!

వీఐ యూజర్లకు ఊహించని షాక్.. 84 రోజుల ప్లాన్ ధర పెంపు.. కొత్త ధర, బెనిఫిట్స్ ఇవే!
Advertisement

Vi Recharge: వొడాఫోన్ ఐడియా తమ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే బాగా పాపులర్ అయిన రీఛార్జ్ ప్లాన్ ధరను సైలెంట్‌గా పెంచేసింది. 84 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న సదరు ప్లాన్ ధరను పెంచినప్పటికీ.. వినియోగదారులకు అందించే బెనిఫిట్స్ లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా 84 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 9 రకాల వేర్వేరు ప్లాన్‌లను అందుబాటులో ఉంచగా.. వాటిలో 5G డేటాతో వస్తున్న అత్యంత చౌకైన ప్లాన్ పైనే ఈ ధరల భారాన్ని మోపడం యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

రూ. 859 ప్లాన్.. ఇకపై రూ. 899గా మార్పు

ఇన్నాళ్లు రూ. 859 గా ఉన్న ఈ రీఛార్జ్ ప్లాన్ ధరను ఏకంగా రూ. 40 పెంచి ఇప్పుడు రూ. 899 వీఐ మార్చింది. ధరను సవరించిప్పటికీ పాత బెనిఫిట్సే రూ.899 ప్లాన్ లో కొనసాగుతాయని వీఐ వర్గాల స్పష్టం చేశాయి. రూ. 899 రీఛార్జ్ చేసుకునే యూజర్లకు పాత ప్లాన్ తరహాలోనే 84 రోజుల వ్యాలిడిటీ, ప్రతిరోజూ 1.5GB డేటా, ఫ్రీ కాల్స్ లభించనున్నాయి. .

అదిరిపోయే అదనపు బెనిఫిట్స్

Advertisement

ఈ రూ. 899 ప్లాన్‌తో యూజర్లకు అదిరిపోయే అదనపు బెనిఫిట్స్‌ను సైతం వీఐ అందిస్తోంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అపరిమితంగా 5G డేటాను ఈ ప్లాన్ కింద ఉపయోగించుకోవచ్చు. ఈ సమయంలో వాడే డేటా రోజువారీ కోటా (1.5GB) నుండి ఏమాత్రం కట్ కాదని వీఐ పేర్కొంది. అదే విధంగా వారంలో మిగిలిపోయిన డేటాను వారాంతంలో వాడుకునే ‘వీకెండ్ డేటా రోలోవర్’ సదుపాయాన్ని సైతం వీఐ అందిస్తోంది. మరోవైపు ప్రతి నెలా ఉచితంగా 2GB వరకు బ్యాకప్ డేటాను పొందే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ బ్యాకప్ డేటాను వినియోగదారులు ‘Vi App’ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు.

మరికొన్ని బెనిఫిట్స్

రూ.899 ప్లాన్ కింద వీఐ మరికొన్ని బెనిఫిట్స్ ను సైతం అందిస్తోంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లతో పాటు ‘వీఐ మూవీస్ అండ్ టీవీ’ యాప్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ చేస్తోంది. దీని ద్వారా మెుబైల్స్, స్మార్ట్ టీవీలలో సినిమాలు, టీవీ షోలు, లైవ్ న్యూస్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. 84 రోజుల వ్యాలిడిటీతో పాటు వీఐ ఎంటర్ టైన్ మెంట్ యాప్ కు యాక్సెస్ ఇచ్చే పక్కా ఆల్ రౌండర్ ప్లాన్ ఇదేనని టెలికాం వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Also Read: మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఇది మీ మంచికే బాస్!

వీఐ ఇతర 84 డేస్ ప్లాన్లు

వొడాఫోన్ ఐడియా వద్ద 84 రోజుల వ్యాలిడిటీతో ఉన్న ఇతర ప్లాన్ల వివరాలను పరిశీలిస్తే.. ముందుగా తక్కువ ధరలో రూ.470 ప్లాన్ అందుబాటులో ఉంది. 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ చౌకైన ప్లాన్ లో ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్ లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎలాంటి డేటాను ఈ ప్లాన్ ఆఫర్ చేయడం లేదు. రూ. 548 ప్లాన్ లో 7GB డేటా, 84 రోజుల వ్యాలిడిటీతో పాటు ఫ్రీగా ‘వీఐ మూవీస్ అండ్ టీవీ’ యాప్ యాక్సెస్ పొందొచ్చు. అటు రూ. 1,599 ప్లాన్ కింద 84 రోజుల వ్యాలిడిటీ, 5G డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లతో పాటు ‘నెట్‌ఫ్లిక్స్’ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుండటం విశేషం.

Also Read: అభిషేక్ బ్యాటింగ్ త‌ల‌చుకుని, న్యూజిలాండ్ బౌల‌ర్లు నిద్ర‌లోనూ ఉలిక్కిప‌డ‌తారు

Tags

Related News

ఒక సెకనులో 20 వేల 4K సినిమాలు డౌన్‌లోడ్.. ఇంటర్నెట్ వేగంలో చైనా ప్రపంచ రికార్డు!

కొత్త పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా? వీటి కంటే బెస్ట్ ఉండవేమో!

మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఇది మీ మంచికే బాస్!

చిన్న కుటుంబాలకు బెస్ట్ 5 స్టార్ ఫ్రిజ్..ఇప్పుడు ఆఫర్‌‌లో తక్కువ ధరకే!

మీరు మాట్లాడింది ఇట్టే టెక్స్ట్ అయిపోతుంది! ట్రెండింగ్‌లో ఉన్న ఈ గాడ్జెట్ గురించి తెలుసా?

రూ.729కే పోర్ట్రానిక్స్ ఇయర్ బడ్స్..ఫీచర్స్ చూస్తే మతిపోతుంది!

కాలేజ్ విద్యార్థుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్..తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

Advertisement
×