Mobile Spyware : స్మార్ట్ ఫోన్.. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి చేతిలో అమరిపోయే ఓ చిన్న ఆట బొమ్మ. అరచేతి పరిమాణంలో ఇమిడిపోయే ఈ బొమ్మ ఆడించినట్టు ఆడడమే ఆరడుగుల మనిషి పని. ఎంతటి వారైనా ఈ స్మార్ట్ ఫోన్ కు దాసోహం కాక తప్పడం లేదు. ఎంత వద్దనుకున్నా స్మార్ట్ ఫోన్ ఒక్క క్షణం కూడా దూరం పెట్టకుండా ఉండలేకపోతున్నారు. అంతలా ఒక మనిషి ప్రపంచాన్ని ఆక్రమించేసిన ఈ స్మార్ట్ ఫోన్స్ తో అప్రమత్తంగా ఉండాలనే విషయం చాలామందికి తెలియదు. మనిషిని కనీసం ఆలోచించే సమయం ఇవ్వకుండా ప్రతీ విషయానికి తన పైన ఆధారపడేలా చేసుకున్నా ఈ స్మార్ట్ ఫోన్స్ తో ప్రమాదాలు ప్రతిక్షణం పొంచి ఉన్నాయి. అప్రమత్తంగా ఉండకపోతే మునిగిపోయే అవకాశాలు సైతం అంతే ఉన్నాయి. ఇక అసలు స్మార్ట్ ఫోన్ తో వచ్చే పెద్ద ప్రమాదం ఏంటో తెలిస్తే మీరు షాక్ అవ్వకుండా ఉండలేరు.
స్మార్ట్ ఫోన్ మీరు మాట్లాడే ప్రతి మాటని వింటుంది అనే విషయం తెలుసా? మీపై నిగా ఉంచే అతిపెద్ద నిఘా నేత్రం స్మార్ట్ ఫోనే. పక్కనే ఉంటూ బల్లెంలా మారే స్మార్ట్ ఫోన్ వెనుక ఉండే అసలు కథ చాలామందికి తెలియదు. నిజానికి ఈ విషయాన్ని ఎవరో అంచనా కూడా వేయలేరు. ఒకసారి పరిశీలిస్తే ఇప్పటివరకు ఫోన్లో ఎప్పుడు సర్చ్ చేయని ఒక విషయం కోసం ఫోన్లో పక్కనే ఉంచుకొని ఎవరితోనైనా రెండు మూడు రోజులు మాట్లాడితే అసలు విషయం బయటపడుతుంది. మీరు ఏ విషయం కోసమైతే మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని ఫోన్లో సర్చ్ చేయకపోయినా మీరు ఫేస్ బుక్, గూగుల్ ఓపెన్ చేసినప్పుడు దానికి సంబంధించిన సమాచారం యాడ్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఒక కొత్త ప్రదేశం కోసం మాట్లాడితే ఆ ప్రదేశంలో ఉండే రెస్టారెంట్స్, ఫ్లైట్స్, టికెట్ బుకింగ్ కోసం యాడ్స్ వరుసగా వస్తూనే ఉంటాయి అంటే ఫోన్ నీ పైన నిఘా ఉంచినట్టే.
ఈ చిన్న టెస్ట్ ను మీరు కూడా ప్రయత్నించవచ్చు. ఇప్పటివరకు ఎప్పుడూ మీరు మాట్లాడలేని కొత్త టాపిక్ ని తీసుకొని, దానికోసం మాట్లాడుతూ ఉంటే గూగుల్లో, ఫేస్బుక్లో అవే కనిపిస్తూ ఉంటాయి. దానికి లింక్ అయినా యాడ్స్ మీరు చూస్తూ ఉంటారు. నిజం ఒకసారి ప్రయత్నిస్తే మీరు షాక్ అవ్వక తప్పదు. అయితే ఇలాంటి విషయాల్లో అప్రమత్తత తప్పనిసరి. ప్రముఖ కంపెనీలకు సంబంధించిన యాప్స్ తో పెద్ద ఇబ్బంది ఉండకపోయినా గేమ్స్ సరదా కోసం ఉపయోగించే యాప్స్ ను డౌన్లోడ్ చేసినప్పుడు ఇచ్చే మైక్రోఫోన్, కెమెరా, స్టోరేజ్ వంటి పర్మిషన్స్ తోనే అసలు సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అందుకే ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. వీలైతే ఎప్పటికప్పుడు ఫోను అప్డేట్ చేయడం తప్పనిసరి యాప్స్ కు ఇచ్చే పర్మిషన్స్ సైతం తొలగించి, ఫోన్ టు ఫ్యాక్టరీ అథెంటికేషన్ లో పెట్టుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
ALSO READ : గీజర్ వాడుతున్నారా.. ప్రాణాలకే ప్రమాదం!!