E-Paper
Advertisement

మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చాలా? ఈ కొత్త రూల్ తెలిస్తే షాక్ అవుతారు!

మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చాలా? ఈ కొత్త రూల్ తెలిస్తే షాక్ అవుతారు!
Advertisement

Driving Licence: ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు, అలాగే లైసెన్స్‌లో వివరాలు మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం.. రోడ్డు భద్రతపై అవగాహన కోసం నిర్వహించే ఆన్‌లైన్ అసెస్‌మెంట్ పరీక్ష పాస్ మార్కులను 60 శాతం నుంచి ఏకంగా 75 శాతానికి పెంచింది. అంతేకాకుండా డ్రైవింగ్ అవగాహన ట్యుటోరియల్ కనీసం 30 నిమిషాల పాటు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక లైసెన్స్‌లో పేరు లేదా చిరునామా మార్పుల కోసం దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు 15 రోజుల్లోగా దానిని ఆమోదించడమో లేక తిరస్కరించడమో చేయాలి. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఎందుకు చేశారో సరైన కారణం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ 30 రోజుల వరకు మీ చిరునామా మార్పు దరఖాస్తుపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే.. అది ఆటోమేటిక్‌గా ఓకే అయినట్లే పరిగణిస్తారు.

వివరాల మార్పుకు ఫీజు మినహాయింపు!

Advertisement

ప్రజలకు భారం తగ్గించేలా ఆన్‌లైన్‌లో ఆధార్ ఆధారితంగా పొందే కొన్ని డ్రైవింగ్ లైసెన్స్ సేవలకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని ముసాయిదాలో పేర్కొన్నారు. పేరు, చిరునామా లాంటి వివరాల మార్పులకూ ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని భావిస్తున్నారు. మరో ముఖ్యాంశం ఏంటంటే.. ఇకపై చిరునామా ధ్రువీకరణ కోసం ఎల్‌ఐసీ పాలసీ కాగితాలను అనుమతించరు. వీటి స్థానంలో ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, బర్త్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్లు, ఇ-రేషన్ కార్డు లేదా గడిచిన 3 నెలల విద్యుత్, గ్యాస్ బిల్లులను పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే కొత్తగా ఇచ్చే లైసెన్సులు, రెన్యువల్ కార్డులు లేమినేటెడ్ లేదా స్మార్ట్ పీవీసీ కార్డు రూపంలోనే జారీ చేయనున్నారు.

30 రోజుల్లో ఆటోమేటిక్ అప్రూవల్!

Advertisement

ప్రస్తుతం ఈ ప్రతిపాదనలతో ముసాయిదా నోటిఫికేషన్ విడుదలైంది. 30 రోజుల పాటు ప్రజలు, భాగస్వామ్యపక్షాల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత సర్కార్ తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆన్‌లైన్ విధానాలను సులభతరం చేస్తూనే, రోడ్డు భద్రతకు ప్రాధాన్యతనిచ్చేలా ఈ కొత్త ప్రతిపాదనలు చేసింది.

Also Read: హైదరాబాద్‌లో స్పేర్ వీల్స్ చోరీల కలకలం.. MBA విద్యార్థి అరెస్ట్!

Tags

Related News

వారణాసి-ఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. సోమవారం నుంచే రెగ్యులర్ సర్వీసులు!

భారత బుల్లెట్ రైలుకు స్క్వీజ్ టెస్ట్.. ప్రమాదం జరిగినా బోగీలు చెక్కుచెదరవా?

గంటకు 320 కిలో మీటర్ల వేగం.. సముద్రం కింద బుల్లెట్ రైలు ప్రయాణం!

ఎండలు మండినా తరగని జలకళ.. దేవరకొండ కోటలో వింత కోనేరు!

NH 65 To NH 365B.. నల్లగొండ మీదుగా ఇన్ని హైవేలున్నాయా?

భారత్‌లోనే విదేశీ అందాలు.. ఈ 5 ప్రదేశాలను చూస్తే స్విట్జర్లాండ్ వెళ్లినట్లే ఫీలవుతారు!

మారనున్న నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‌ రూపురేఖలు.. రూ.197 కోట్లతో అభివృద్ధి పనులు!

Big Stories

Advertisement
×