BigTV English
Advertisement

YouTube : యూట్యూబ్‌లో నచ్చిన లాంగ్వేజ్ లో సబ్‌టైటిల్స్ కావాలా..! ఒక్క సెట్టింగ్ మారిస్తే చాలు

YouTube : యూట్యూబ్‌లో నచ్చిన లాంగ్వేజ్ లో సబ్‌టైటిల్స్ కావాలా..! ఒక్క సెట్టింగ్ మారిస్తే చాలు

YouTube : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ యూట్యూబ్‌లో సబ్‌టైటిల్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ తో ఎలాంటి విదేశీ భాషా కంటెంట్ అయినా తేలికగా అర్ధం చేసుకోవచ్చు. మరి అసలు ఈ ఫీచర్ ను ఎలా అనేబుల్ చేయాలి అనే విషయం తెలుసుకుందాం.


యూట్యూబ్.. ప్రపంచ నలుమూలల ఎక్కడ ఏం జరిగినా ఇట్టే మన కళ్ళ ముందు చూపించగలిగే వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్. ఇందులో హిందీ, ఇంగ్లీష్ తో పాటు పలు భాషలకు సంబంధించిన కంటెంట్ అందుబాటులో ఉంటుంది. నిజానికి యూట్యూబ్ లో ఉండే కంటెంట్ కు లిమిట్ లేదనే చెప్పాలి. మరి ప్రతి ఒక్కరికి తమ భాషలో కంటెంట్ వినడం తేలికే కానీ ఇతర బాషకు సంబంధించిన కంటెంట్ చూడాలంటే ఆ భాషను అర్థంకాక ఇబ్బందులు ఎదురవుతాయి. మరి ఇలాంటి వారి కోసమే యూట్యూబ్ కొత్తగా ఓ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో యూట్యూబ్లో ఉండే అన్ని రకాల కంటెంట్ ను మీకు నచ్చిన లాంగ్వేజ్ లో మార్చుకునే అవకాశం ఉంటుంది. సొంత భాషలోకి నచ్చిన కంటెంట్ ను మార్చుకోవాలంటే కొన్ని సెట్టింగ్స్ మారిస్తే చాలు.

ALSO READ : రియల్ మీ 14 ప్రో ప్లస్ కొనచ్చా.. ఫీచర్స్ ఓకేనా!


యూట్యూబ్ ఇతర భాష కంటెంట్ ను చూడటానికి వినటానికి తీసుకొచ్చిన బెస్ట్ ఆప్షన్ సబ్ టైటిల్ ఫీచర్. ఈ ఫీచర్ తో ఎలాంటి కంటెంట్ అయినా సబ్ టైటిల్స్ వస్తాయి. దీన్ని బట్టి అక్కడ జరిగే విషయాన్నీ అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నిజానికి యూట్యూబ్ లో ఉండే సబ్ టైటిల్ ఫీచర్ ఇంగ్లీషులో మార్చుకునే అవకాశం ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇలా కాకుండా నిజానికి మీకు కావాల్సిన విధంగా హిందీ ,ఇంగ్లీష్, నేపాలి తో పాటు మరిన్ని భాషల్లోకి మార్చుకునే అవకాశం ఉంటుంది. మరి అసలు అందుబాటులోకి మార్చుకోవాలంటే మార్చాల్సిన సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుందాం

YouTubeలో సబ్ టైటిల్స్ ఎలా సెట్ చేసుకోవాలంటే..

STEP1: ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో YouTube యాప్‌ని ఓపెన్ చేయాలి

STEP2: ఆపై దిగువన కనిపించే ప్రొఫైల్ చిహ్నంపై క్లిక్ చేయాలి

STEP3: ఇప్పుడు పైన ఉన్న సెట్టింగ్‌ల చిహ్నంపై నొక్కాలి.

STEP4: ఆపై క్రిందికి స్క్రోలింగ్ చేసినప్పుడు క్యాప్షన్  లో కావల్సిన ఫీచర్స్ కనిపిస్తాయి.

STEP 5: క్యాప్షన్ ఆప్షన్‌కి వెళ్లిన తర్వాత షో క్యాప్షన్ టోగుల్‌ను ఆన్ చేయాలి.

STEP6: ఆపై మోర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, లాంగ్వేజ్‌పై క్లిక్ చేయాలి వెళ్లండి.

STEP7: లాంగ్వేజ్ ఆప్షన్‌లో మీకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. మీరు నచ్చిన సబ్ టైటిల్ లాంగ్వేజ్ ను ఎంచుకోండి.

STEP8: ఇప్పుడు కావాల్సిన ఆప్షన్స్ లో సబ్ టైటిల్స్ కనిపిస్తాయి. ఒకవేళ హిందీ ఎంచుకుంటే యూట్యూబ్లో వీడియోలు అన్ని హిందీ సబ్ టైటిల్స్ తో కనిపిస్తాయి

ఇకపై భాషతో సంబంధం లేకుండా నచ్చిన కంటెంట్ ను నచ్చిన లాంగ్వేజ్ లో వినే ఆప్షన్ ఉంటుంది. యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఎంతోమంది యూజర్స్ ను ఆకట్టుకుంటుంది

Tags

Related News

AI Hospital Bill Error: ఆస్పత్రిలో రూ.1.6 కోటి బిల్లు చూసి షాకైన యువకుడు.. అసలు బిల్లు రూ.29 లక్షలే.. మోసం ఎలా కనిపెట్టాడంటే

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Big Stories

×