BigTV English

L2E Empuraan Teaser: ‘ఎల్2ఈ ఎంపురాన్’ టీజర్ వచ్చేసింది.. అసలు లూసీఫర్ ఎవరు.?

L2E Empuraan Teaser: ‘ఎల్2ఈ ఎంపురాన్’ టీజర్ వచ్చేసింది.. అసలు లూసీఫర్ ఎవరు.?

L2E Empuraan Teaser: హీరోలు, దర్శకులు.. ఇలా రెండిటిలో సక్సెస్ అందుకున్న నటీనటులు చాలా తక్కువమంది. ఒకప్పటి సీనియర్ హీరోలు అలా రెండు విభాగాలను సమానంగా మ్యానేజ్ చేస్తూ మంచి హిట్లు సాధించారు. కానీ ఈరోజుల్లో అలాంటి వారు చాలా తక్కువ. అలా హీరోగా, డైరెక్టర్‌గా రెండు డిపార్ట్మెంట్స్‌లో సక్సెస్ సాధించిన నేటి తరం హీరోల్లో పృథ్విరాజ్ సుకుమారన్ ఒకడు. దాదాపు సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా నటుడిగా గుర్తింపు సాధించిన పృథ్విరాజ్.. ‘లూసీఫర్’ అనే మూవీతో దర్శకుడిగా మారి హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే మూవీకి సీక్వెల్‌గా ‘ఎల్2ఈ ఎంపురాన్’ తెరకెక్కించగా దానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలయ్యింది.


డెవిల్‌తో డీల్

ఇరాక్‌లో జరుగుతున్న దాడులు చూపించడంతో ‘ఎల్2ఈ ఎంపురాన్’ టీజర్ మొదలవుతుంది. ‘‘ఏదో ఒకరోజు నీ చుట్టూ ఉన్నవాళ్లు మోసగాళ్లు అని తెలిసినప్పుడు నీ నాన్న లేకుంటే నిన్ను ఆదుకోగలిగినవాడు ఒక్కడే ఉంటాడు.. స్టీఫెన్’’ అనే బ్యాక్‌గ్రౌండ్ డైలాగ్ వినిపిస్తుంది. అలా ఒక వ్యక్తి గురించే చెప్తూ వరుసగా డైలాగులు వస్తుంటాయి. కానీ ఎవ్వరి మొహం కూడా రివీల్ చేయరు. అలా మరోసారి లూసీఫర్‌గా మోహన్ లాల్ ఎంట్రీ ఇస్తారు. ‘‘తను మళ్లీ వస్తున్నాడు. ఈ డీల్ ఒక డెవిల్‌తో చేస్తున్నాం’’ అని చెప్తున్నప్పుడు మోహన్ లాల్ ఫేస్ రివీల్ అవుతుంది. ‘లూసీఫర్’తో పోలిస్తే ఈ సీక్వెల్‌లో యాక్షన్ మరింత ఎక్కువగా ఉండబోతుందని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది.


ఎన్నో మార్పులు

‘ఎల్2ఈ ఎంపురాన్’ (L2E Empuraan) టీజర్‌లో హైలెట్‌గా నిలిచిన అంశం పృథ్విరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) ఎంట్రీ. టీజర్ అయిపోయి టైటిల్ పడిన తర్వాత గన్ మ్యాన్‌గా పృథ్వి ఎంట్రీ ఇస్తాడు. ‘‘ఒక సైగ చాలు భాయ్‌జాన్. ఒకేఒక్క సైగ చాలు. ఎదురుచూస్తుంటాను’’ అంటూ పృథ్విరాజ్ చెప్పే డైలాగ్‌తోనే ఈ టీజర్ ముగుస్తుంది. మొత్తానికి టీజర్ అంతా యాక్షన్ ప్యాక్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్. ‘లూసీఫర్’ సినిమాను పూర్తిగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించాడు పృథ్విరాజ్. కానీ ‘ఎల్2ఈ ఎంపురాన్’ విషయానికొస్తే.. దీనిని కాస్త దేశభక్తి నేపథ్యంలో నడిపిస్తున్నాడనే అనుమానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అప్పటికి, ఇప్పటికి మోహన్ లాల్ (Mohanlal) పాత్రలో చాలా మార్పులు వచ్చాయని మాత్రం టీజర్ చూస్తే అర్థమవుతోంది.

Also Read: ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ షూటింగ్ మొదలు.. మేకర్స్ మొదటిగా వెళ్లింది ఆ దేశానికే..

హ్యాట్రిక్ మూవీ

లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ‘ఎల్2ఈ ఎంపురాన్’ను నిర్మిస్తోంది. తమిళంలో ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్‌గా పేరు తెచ్చుకున్న లైకా.. ఇప్పుడు ఈ మూవీతో మాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే మోహన్ లాల్, పృథ్వి కలిసి ‘బ్రో డాడీ’, ‘లూసీఫర్’ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇది వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం కాబోతోంది. ఇది కూడా పక్కా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. 2019లో విడుదలయిన ‘లూసీఫర్’ సినిమాను తెలుగులో చిరంజీవి రీమేక్ చేశారు. ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో కూడా మంచి హిట్‌ను అందుకుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×