HYD FIRE: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ నిర్వహించిన భారతమాతకు హారతి కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. వేడుక సందర్భంగా బాణాసంచా కాలుస్తుండగా.. అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో హుస్సేన్ సాగర్‌లోని రెండు బోట్లు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితి నెలకొంది.
Also Read: RRB Recruitment: RRBలో 1036 ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు.. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రమాదంలో బోట్లలో ఉన్న పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి 15 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బోట్ల దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.