E-Paper
Advertisement

ఫోన్ పాస్‌వర్డ్ మర్చిపోయారా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా ఇలా అన్‌లాక్ చేయండి!

ఫోన్ పాస్‌వర్డ్ మర్చిపోయారా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా ఇలా అన్‌లాక్ చేయండి!
Advertisement

How to unlock android phone: తొందరపాటులో కొత్త పాస్‌వర్డ్ లేదా ప్యాటర్న్ సెట్ చేసి దానిని మర్చిపోవడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్యే. కొన్ని సార్లు పిల్లలు ఫోన్‌తో.. ఆడుకుంటూ తప్పు పాస్‌వర్డ్స్ ఎంటర్ చేసి ఫోన్‌ను లాక్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక టెన్షన్ పడి సర్వీస్ సెంటర్‌కు పరుగెత్తుతుంటాము. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా, ఎవరి సహాయం లేకుండా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌ను మీ ఇంటి నుంచే అన్‌ లాక్ చేసుకోవడానికి కొన్ని అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1: గూగుల్ ‘ఫైండ్ మై డివైస్’ :

మీ లాక్ చేసిన ఫోన్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్‌లో ఉన్నట్లయితే.. గూగుల్ అందించే “Find My Device” టూల్ చాలా బాగా పని చేస్తుంది. ఇందుకోసం ముందుగా మరొక ఫోన్ లేదా కంప్యూటర్‌లో బ్రౌజర్ ఓపెన్ చేసి [google.com/android/find](https://google.com/android/find) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. మీ లాక్ చేసిన ఫోన్లో ఏ గూగుల్ అకౌంట్ అయితే ఉందో, అదే అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ స్క్రీన్‌పై డివైస్ లొకేషన్‌తో పాటు కొన్ని ఆప్షన్‌లు కనిపిస్తాయి. అందులో ‘ఎరేస్ డివైస్’ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ ఫోన్‌లోని.. డేటాతో పాటు లాక్ స్క్రీన్ పూర్తిగా తొలగిపోతుంది. ఆటోమేటిక్‌గా ఫోన్ రీస్టార్ట్ అయి కొత్త ఫోన్ లాగా ఓపెన్ అవుతుంది.

2: శాంసంగ్ యూజర్ల కోసం ‘స్మార్ట్‌థింగ్స్ ఫైండ్’

Advertisement

మీరు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ వాడుతన్నట్లయితే.. కంపెనీ ప్రత్యేకంగా ‘SmartThings Find’ ఫీచర్‌ను అందిస్తుంది. వేరే పరికరంలో బ్రౌజర్ ఓపెన్ చేసి smartthingsfind.samsung.com వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
మీ శాంసంగ్ అకౌంట్ వివరాలతో లాగిన్ అవ్వాలి. తర్వాత డాష్‌బోర్డ్‌లో లభించే ‘అన్‌లాక్’ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా మీ ఫోన్ లాక్ స్క్రీన్‌ను రిమోట్‌గా తొలగించి మళ్లీ వాడుకోవచ్చు.

3: రికవరీ మోడ్ ద్వారా ‘ఫ్యాక్టరీ రీసెట్’:

పైన చెప్పిన పద్ధతులు పని చేయకపోతే లేదా ఫోన్ ఇంటర్నెట్ ఆఫ్‌లో ఉంటే..చివరి మార్గంగా ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఫోన్‌ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయాలి.తర్వాత స్క్రీన్‌పై కంపెనీ లోగో కనిపించే వరకు పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ (లేదా వాల్యూమ్ అప్) బటన్‌ను ఒకే సారి నొక్కి పట్టుకోవాలి. లోగో రాగానే బటన్లు వదిలేస్తే రికవరీ మెనూ వస్తుంది. ఇక్కడ టచ్ పని చేయదు కాబట్టి వాల్యూమ్ బటన్లతో పైకి కిందకి వెళ్ళి, ‘Wipe data/factory reset’ ఆప్షన్‌ను పవర్ బటన్‌తో సెలెక్ట్ చేయాలి. కొన్ని నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఫార్మాట్ చేసి అన్‌లాక్ అవుతుంది.

Advertisement

Also Read: వాటర్ రెసిస్టెంట్, బెస్ట్ బ్యాటరీ..మార్కెట్‌లో ఫిలిప్స్ ఇయర్‌బడ్స్ రచ్చ

ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు పూర్తిగా డిలీట్ అవుతాయి. అలాగే.. రీసెట్ అయిన తర్వాత ఫోన్ ఆన్ అయ్యేటప్పుడు గతంలో వాడిన అదే గూగుల్ అకౌంట్ వివరాలు అడుగుతుంది కాబట్టి వాటిని గుర్తుంచుకోవడం ముఖ్యం.

ఆండ్రాయిడ్ ఫోన్ పాస్‌వర్డ్ మర్చిపోవడం పెద్ద సమస్యే అయినప్పటికీ.. సరైన టెక్నిక్స్ ఫాలో అయితే నిమిషాల్లో పరిష్కరించుకోవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది రాకుండా.. మీ పాస్‌ వర్డ్స్‌ను ఎక్కడైనా సేఫ్ గా నోట్ చేసి పెట్టుకోవడం మంచిది.

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×