E-Paper
Advertisement

వాటర్ రెసిస్టెంట్, బెస్ట్ బ్యాటరీ..మార్కెట్‌లో ఫిలిప్స్ ఇయర్‌బడ్స్ రచ్చ

వాటర్ రెసిస్టెంట్, బెస్ట్ బ్యాటరీ..మార్కెట్‌లో ఫిలిప్స్ ఇయర్‌బడ్స్ రచ్చ
Advertisement

PHILIPS TAT1269 TWS earbuds: ప్రయాణాల్లో ఉన్నప్పుడు.. లేదా ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు మంచి మ్యూజిక్ వినడానికి రిలయబుల్ బ్రాండెడ్ ఇయర్‌ బడ్స్ ఉండటం చాలా ముఖ్యం. అయితే.. బ్రాండెడ్ ఇయర్‌ బడ్స్ అంటేనే.. ఎక్కువ ధర ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అలాంటి ..వారి కోసం ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ ఫిలిప్స్ నుంచి కేవలం రూ. 1251 బడ్జెట్‌లోనే 40 గంటల లాంగ్ బ్యాటరీ లైఫ్, లేటెస్ట్ బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తున్న ‘PHILIPS TAT1269’ TWS ఇయర్‌ బడ్స్ గురించిన పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుత డిజిటల్ మార్కెట్లో ఎన్నో కొత్త బ్రాండ్లు వస్తున్నప్పటికీ, ఫిలిప్స్ లాంటి నమ్మకమైన బ్రాండ్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. క్వాలిటీ ఆడియో గాడ్జెట్‌లు అందించడంలో పేరుగాంచిన ఈ సంస్థ, తాజాగా బడ్జెట్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని ‘PHILIPS TAT1269’ TWS ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

డిజైన్, కలర్ ఆప్షన్:

Advertisement

ఈ ఇయర్‌ బడ్స్ డిజైన్ చాలా క్లాసీగా, మోడ్రన్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇవి వచ్చే ‘కాస్మిక్ బ్లూ’కలర్ చూడడానికి చాలా ట్రెండీగా ఉంటుంది. ఇవి చెవుల్లో చాలా సౌకర్యంగా ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువ సేపు పెట్టుకున్నా ఎలాంటి నొప్పి ఉండదు. కాంపాక్ట్ సైజ్‌లో ఉండే ఛార్జింగ్ కేస్ మీ పాకెట్‌లో లేదా బ్యాగ్‌లో చాలా ఈజీగా సరి పోతుంది.

ఆడియో క్వాలిటీ, బ్లూటూత్ 5.4:

ఫిలిప్స్ గాడ్జెట్ సౌండ్ క్లారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. TAT1269 మోడల్ అద్భుతమైన సౌండ్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. పాటలు వినేటప్పుడు వోకల్స్ చాలా క్లియర్‌గా, బ్యాలెన్స్డ్ బేస్‌తో వినిపిస్తాయి. ఇందులో ఉన్న లేటెస్ట్ బ్లూటూత్ 5.4 (BT 5.4) టెక్నాలజీ కారణంగా కనెక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఫోన్‌కు ఇయర్‌ బడ్స్ క్షణాల్లో కనెక్ట్ అవుతాయి. అంతే కాకుండా ఆడియో లాగ్ ఉండదు.

40 గంటల ప్లేటైమ్:

Advertisement

ఈ ఇయర్‌ బడ్స్ అతిపెద్ద ప్లస్ పాయింట్ వీటి బ్యాటరీ బ్యాకప్. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది దాదాపు 40 గంటల పాటు నాన్‌స్టాప్ ప్లేటైమ్‌ను అందిస్తుంది. అంటే.. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజుల తరబడి ఛార్జింగ్ గురించిన టెన్షన్ ఉండదు. ఆఫీస్‌కి వెళ్లేవారికి, స్టూడెంట్స్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

IPX5 వాటర్ రెసిస్టెన్స్:

మీరు జిమ్ చేసేటప్పుడు, వర్కౌట్లు చేసేటప్పుడు లేదా జాగింగ్‌కి వెళ్ళినప్పుడు చెమట పట్టినా.. లేదా అనుకోకుండా చిన్న పాటి వర్షంలో తడిచినా.. ఈ ఇయర్‌ బడ్స్‌కు ఎలాంటి డ్యామేజ్ కాదు. ఇందులో.. ఇచ్చిన IPX5 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ వీటిని మరింత సురక్షితంగా ఉంచుతుంది.

ధర:

ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లో.. ఈ మోడల్ ఇయర్‌ బడ్స్ ధర కేవలం రూ.1251 (ఆఫర్లను బట్టి కొద్దిగా మారొచ్చు) మాత్రమే ఉంది. బ్రాండెడ్ , లాంగ్ లాస్టింగ్ ఇయర్‌ బడ్స్ కోరుకునేవారికి.. ఇది పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్.

మొత్తానికి చూస్తే.. తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన ఫిలిప్స్ బ్రాండ్, 40 గంటల భారీ బ్యాటరీ బ్యాకప్ , లేటెస్ట్ బ్లూటూత్ 5.4 ఫీచర్లు కోరుకునే.. వారికి ఈ ఇయర్‌ బడ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీ మ్యూజిక్ ఫీల్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి ఇది పర్ఫెక్ట్.

Related News

ఆన్ లైన్ షాపింగ్ చేయకపోయినా పార్శిల్ వచ్చిందా? ఇలా చేస్తే..నిలువునా మోసపోతారు!

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×