iPhone Measure App: ఇంటికి కొత్త సోఫా కొనాలనుకుంటున్నారా? ఉన్న ఫర్నిచర్‌ను మరో గదిలోకి మార్చాలనుకుంటున్నారా? అయితే ముందుగా కొలతలు చూసుకోవాల్సిందే కదా! లేదంటే ఎంత నచ్చిన ఫర్నిచర్ కొన్నా.. అది మీ ఇంట్లో ఇమడకపోతే ఇబ్బందే. ఇలాంటి సమయంలో టేప్ కొలత కోసం వెతకాల్సిన పనిలేదు. మీ చేతిలో ఐఫోన్ ఉంటే చాలు.. టేప్ లేకుండానే ఫర్నిచర్ కొలతలను తెలుసుకోవచ్చు. మీ ఐఫోన్‌లోనే ఉన్న ఓ ప్రత్యేక యాప్‌తో ఇదెలా సాధ్యమో తెలుసా? కేవలం కొన్ని సెకన్లలో కొలతలు తీసుకునే ఈ సింపుల్ ట్రిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..
ఐఫోన్‌లో Major అనే యాప్ డిఫాల్ట్‌గా వస్తుంది. ఇది మన కెమెరా సహాయంతో ఎదురుగా ఉన్న వస్తువుల పొడవు, వెడల్పు, ఎత్తును అంచనా వేస్తుంది. కొత్తగా ఫర్నిచర్ కొనేటప్పుడు, ఇల్లు మారేటప్పుడు వ్యానులో సామాన్లు పడతాయో లేదో తెలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది. అయితే పూర్తి ఖచ్చితత్వం కాకుండా అంచనా మాత్రమే ఇస్తుంది కాబట్టి.. కలప తయారీ లాంటి పనులకు టేప్ వాడటమే మంచిది.
Also Read: Apple Watch Series 11పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. యాపిల్ ప్రియులకు ఇంత కంటే మంచి ఛాన్స్ రాదు!
ఈ యాప్ వాడటం చాలా సులువు. ముందుగా మేజర్ యాప్ ఓపెన్ చేసి, మీరు కొలవాలనుకుంటున్న వస్తువుకు రెండు నుండి పది అడుగుల దూరంలో నిలబడాలి. ఫోన్ స్క్రీన్ పై కనిపిచే చుక్కను వస్తువు మొదట్లో ఉంచి ప్లస్ గుర్తు నొక్కాలి. ఆ తర్వాత ఫోన్‌ను చివరి వరకు జరిపి మళ్లీ ప్లస్ నొక్కితే కొలత కనిపిస్తుంది. వేరే వైపు కొలవడానికి స్క్రీన్ క్లియర్ చేస్తే సరిపోతుంది.
ఇది ఇచ్చే కొలతలు దాదాపు టేప్ కొలతలకు దగ్గరగా ఉంటాయి. సాధారణ టేప్‌తో 46.75 అంచులు ఉన్న వార్డ్‌రోబ్, యాప్‌లో 46 అంగుళాలుగా చూపిస్తుంది. అలాగే 70.5 అంగుళాల సోఫా, యాప్‌లో 71 అంగుళాలుగా వస్తుంది. అంటే దాదాపు అర అంగుళం తేడా మాత్రమే ఉంటుంది. అత్యవసర సమయంలో ఫర్నిచర్ పట్టే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ మేజర్ యాప్ చాలా బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు.
సరిగ్గా కొలతలు రావాలంటే మీరు ఉండే భంగిమ ముఖ్యం. వస్తువుకు సరిగ్గా మధ్యలో నిలబడి, కెమెరాను కూడా అదే ఎత్తులో ఉంచాలి. పక్క నుండి చూస్తే కొలతల్లో తేడా వస్తుంది. అలాగే స్ట్రెయిట్ ఎడ్జ్ ఉన్న ఫర్నిచర్ కొలిచేటప్పుడు, స్క్రీన్ పై కనిపించే పసుపు రంగు గైడ్ లైన్స్ ఆధారంగా పాయింట్స్ మార్క్ చేస్తే మరింత సరైన కొలతలు వస్తాయి.
Also Read: Google Pixel 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.19,000 ఆదా చేసుకునే అవకాశం!