Apple Watch Series 11: యాపిల్ వాచ్ కొనడం చాలామంది డ్రీమ్.. కానీ ఆ ప్రైస్ చూసి వెనక్కి తగ్గుతుంటారు. మీరు కూడా అలాగే వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో క్రేజీ న్యూస్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో యాపిల్ లేటెస్ట్ ‘వాచ్ సిరీస్ 11’పై ఊహించని రేంజ్‌లో ప్రైస్ డ్రాప్ అయ్యింది. బ్యాంక్ ఆఫర్లు, ఫ్లాట్ డిస్కౌంట్లు, కూపన్ కోడ్స్ అన్నీ కలిపితే తక్కువ రేటుకే వస్తోంది. అసలు ఆఫర్ ఏంటి, ఎలా అప్లై చేస్తే రూ.35,999కే సొంతం చేసుకోవచ్చో క్లియర్‌గా చూద్దాం!
యాపిల్ వాచ్ సిరీస్ 11 (46mm GPS వేరియంట్) అసలు ధర భారతదేశంలో రూ.46,900 వరకు ఉంటుంది. కానీ ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో దీనిని రూ.36,499కే లిస్ట్ చేశారు. అంటే నేరుగా రూ.10,401 తగ్గించారు. ఇది కాకుండా.. ప్రొడక్ట్ పేజీలోనే మీకు రూ.500 విలువైన కూపన్ కూడా కనిపిస్తుంది. ఆ కూపన్ అప్లై చేస్తే దీని ధర రూ.35,999కి తగ్గుతుంది. మొత్తంగా చూస్తే మీకు ఎంఆర్‌పీపై రూ.10,901 వరకు తగ్గింపు లభిస్తుంది.
Also Read: షాపింగ్ ప్రియులకు పండుగ బొనాంజా.. టీవీ నుంచి ల్యాప్‌టాప్ వరకు.. మిస్ చేసుకోలేని డీల్స్!
ఈ ధరతోనే ఆగిపోకుండా బ్యాంకు ఆఫర్లను కూడా వాడుకుంటే ఇంకా తక్కువకే పొందవచ్చు. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ట్రాన్సాక్షన్ల ద్వారా కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం ఆన్ ది స్పాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కార్డుల ద్వారా గరిష్టంగా రూ.3,000 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు. అర్హత ఉన్న కార్డుదారులు ఈ ఆఫర్‌ను వాడుకుంటే వాచ్ ధర రూ.33,000 దగ్గరకు దిగివస్తుంది. యాపిల్ వాచ్ సిరీస్ 11 ని ఈ ధరకు పొందడం నిజంగా గొప్ప డీల్ అని చెప్పవచ్చు.
ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ వాచ్ watchOS 26పై పనిచేస్తుంది. 5జీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉంది. స్క్రీన్ రక్షణ కోసం ఆయాన్-ఎక్స్ గ్లాస్‌తో పాటు కొత్త సెరామిక్ కోటింగ్ ఇచ్చారు. దీనివల్ల పాత మోడళ్లతో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువగా స్క్రాచ్‌లను తట్టుకుంటుంది. 100 శాతం రీసైకిల్ చేసిన టైటానియమ్, అల్యూమినియంతో దీనిని తయారు చేశారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటల పాటు బ్యాటరీ వస్తుంది. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్, లైవ్ ట్రాన్స్‌లేషన్ సదుపాయం కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.
ఆరోగ్య సంరక్షణ కోసం ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. సాధారణ ఈసీజీ, హృదయ స్పందనల పరిశీలనతో పాటు కొత్తగా ‘స్లీప్ స్కోర్’ ఫీచర్ ఇచ్చారు. ఇది మన నిద్ర నాణ్యతను అంచనా వేస్తుంది. అలాగే ఇందులో కొత్తగా హైపర్‌టెన్షన్ నోటిఫికేషన్స్ అనే ఫీచర్ వచ్చింది. ఇది 30 రోజుల పాటు మీ రక్తనాళాల స్పందనలను విశ్లేషించి, రక్తపోటు (బీపీ) సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే హెచ్చరిస్తుంది. ఫీచర్లు, డిజైన్, ధర అన్నింటి పరంగా చూస్తే ఈ వాచ్ చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
Also Read: రూ.25 వేల బడ్జెట్‌లో ఐదు అదిరిపోయే ఫోన్ ఆఫర్లు.. ఏది కొనడం బెస్ట్ అంటే?