E-Paper
Advertisement

లగ్జరీ కారు కొన్న ప్రేమలు హీరో.. ఖరీదు ఎంతంటే?

లగ్జరీ కారు కొన్న ప్రేమలు హీరో.. ఖరీదు ఎంతంటే?
Advertisement

Actor Naslen: ‘ప్రేమలు’ సినిమాతో నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్న నస్లేన్ (Naslen ) తాజాగా లగ్జరీ కారు కొనుగోలు చేసి ,అందుకు సంబంధించిన విషయాన్ని అభిమానులతో పంచుకోవడంతో ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా ఆయన కొనుగోలు చేసిన లగ్జరీ కార్ మోడల్ ఏంటి? దాని ఖరీదు ఎంత ? ఇలా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

లగ్జరీ కారు కొన్న నస్లేన్..

మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న నస్లేన్ ఈ మధ్యకాలంలో ‘లోక’ లాంటి సూపర్ హిట్ చిత్రంలో భాగమై పాన్ ఇండియా స్థాయిలో పేరు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అలాంటి నస్లేన్ ఇప్పుడు కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారు కొనుగోలు చేశాడు. ముఖ్యంగా రూ.2 కోట్లకు పైగా విలువ చేసే రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ మోడల్ కారును కొనుగోలు చేశారు.

26 ఏళ్లకే ఖరీదైన కారు సొంతం..

Advertisement

26 ఏళ్లకే ఇంత ఖరీదైన కారుకి ఈ నటుడు యజమాని అవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అతి తక్కువ సమయంలోనే ఈ రేంజ్ కారు కొనుగోలు చేయడం అంటే నస్లేన్ రెమ్యూనరేషన్ , ఆదాయం ఏ రేంజ్ లో ఉందో అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఏది ఏమైనా ఇంత ఖరీదైన లగ్జరీ కారును ఇంత చిన్న వయసులోనే కొనుగోలు చేయడం నిజంగా ప్రశంసనీయమంటూ పలువురు నెటిజన్లు ఈయనపై ప్రశంసలు కురిపిస్తూనే.. మరొకవైపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

నస్లేన్ సినిమా కెరియర్..

నస్లేన్ సినిమా కెరియర్ విషయానికి వస్తే.. 2019 నుండి సినిమాలు చేస్తున్నప్పటికీ 2024 లో వచ్చిన ప్రేమలు సినిమాతోనే హీరోగా బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. దీని తర్వాత కూడా హీరోగా పలు సినిమాలు చేస్తున్న నస్లేన్ సూర్య హీరోగా నటిస్తున్న సీన్ అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో పాటు మరో రెండు మూడు మలయాళం చిత్రాలలో కూడా భాగమయ్యారు.. పైగా కొన్ని రోజుల క్రితం ప్రేమలు 2చిత్రాన్ని కూడా ప్రకటించారు. అయితే దాన్ని ఇంకా పట్టాలెక్కించలేదు. బదులుగా ఆ చిత్ర దర్శకుడు గిరీష్ ఏడి ఇటు మమిత బైజుతో కలిసి బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ సినిమా తీసి మలయాళ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఏది ఏమైనా ప్రేమలు సినిమా తీసుకొచ్చిన విజయం.. ఈయనకు అటు రెమ్యూనరేషన్ పరంగా కూడా భారీగా క్రేజ్ పెంచేసింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి . మునుముందు మంచి మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆడియన్స్ కోరుతున్నారు.

Advertisement

ALSO READ: శ్రీ విష్ణులో ఇంత టాలెంటా? హీరో కాకపోయి ఉంటే?

స్టార్ దిగ్గజాల జాబితాలో స్థానం..

రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటో బయోగ్రఫీ కారు కొనుగోలు చేసిన నస్లేన్ ఈ వాహనానికి KL 47 N 7000 అనే ప్రీమియం రిజిస్ట్రేషన్ నంబర్ ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ లగ్జరీ ఎస్ యు వీ లను కలిగి ఉన్న మోహన్ లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, ఫహద్ ఫాజిల్ లాంటి అగ్ర తారల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

Related News

శ్రీ విష్ణులో ఇంత టాలెంటా? హీరో కాకపోయి ఉంటే?

త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ మరో సంచలన పోస్ట్..!

ఈ ఎడిటర్ కు ప్రొడ్యూసర్ కంటే బిల్డప్ ఎక్కువ.. మంచి సినిమాలను నాశనం చేస్తున్నాడుగా?

తెలుగింటి కోడలుగా అడుగు పెట్టబోతున్న నిధి అగర్వాల్.. అబ్బాయి ఎవరంటే?

వివేక్ ఆత్రేయ రవితేజ RT 78 టైటిల్ పై బిగ్ అప్డేట్!

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. కైకేయి పాత్రలో స్టార్ హీరోయిన్!

నాగచైతన్య వర్సెస్ నితిన్.. బాక్సాఫీస్ వార్ లో గెలిచేదెవరు?

Big Stories

Advertisement
×