Gurnoor Brar Cheated Blair Tickner: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 1st ODI) మధ్య ఇవాళ వన్డే సిరీస్ షురూ అయింది. ఈ సిరీస్ నేపథ్యంలో తొలి మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. మనోళ్ళ బౌలింగ్ దెబ్బకు 185 పరుగులకు కుప్పకూలింది న్యూజిలాండ్. అయితే ఈ మ్యాచ్ లో కుర్ర బౌలర్ గురునూర్ బ్రార్ (Gurnoor Brar Cheated Blair Tickner) మూడు వికెట్లతో రెచ్చిపోయాడు. అంచనాలకు మించి ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ టెయిలెండర్ బ్లెయిర్ టిక్‌నెర్ ( Blair Tickner) ను చీటింగ్ చేసి వికెట్ తీసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. గుర్నూర్ బ్రార్ మాస్టర్ మైండ్ ను మెచ్చుకుంటున్నారు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి వన్డే సందర్భంగా గుర్నూర్ బ్రార్ న్యూజిలాండ్ ఆటగాడు బ్లెయిర్ టిక్‌నెర్ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వికెట్లు పడుతున్నా 34 పరుగులు చేసిన బ్లెయిర్ టిక్‌నెర్, టీమిండియా బౌలర్లను చాలా ఇబ్బంది పెట్టాడు. నాలుగు సిక్సర్లతో పాటు బౌండరీ కొట్టి.. చెడుగుడు ఆడుకున్నాడు. అలాంటి బ్లెయిర్ టిక్‌నెర్ ను ఔట్ చేసేందుకు గుర్నూర్ బ్రార్ అదిరిపోయే ప్లాన్ వేశాడు. అతడిని రెచ్చగొట్టి వికెట్ తీసుకున్నాడు.
ముందు షార్ట్ డెలివరీ వేసి బ్లెయిర్ టిక్‌నెర్ ను ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలోనే అలా కాదు ఇలా బ్యాటింగ్ చెయ్… దమ్ముంటే నా బౌలింగ్ లో సిక్సర్ కొట్టు అంటూ బ్రార్ రెచ్చగొట్టాడు. దీంతో టెంప్ట్ అయిన బ్లెయిర్ టిక్‌నెర్… ఆ తర్వాతి షార్ట్ పిచ్ బంతికే కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే బ్లెయిర్ టిక్‌నెర్ ను ఔట్ చేసిన తర్వాత గుర్నూర్ బ్రార్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. ఓ టెయిలెండర్ ను ఔట్ చేసి ఇంత సంబరపడడం ఏంటని బ్లెయిర్ టిక్‌నెర్ కూడా తెగ నమ్ముకున్నాడు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డే సందర్భంగా టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. దీంతో కివీస్ 40.2 ఓవర్లు ఆడి…185 పరుగుల వద్ద కుప్ప కూలింది. అర్ష్ దీప్ సింగ్ నాలుగు వికెట్లు తీయగా, గురునూర్ బ్రార్ 3 వికెట్లతో రెచ్చిపోయాడు. అన్షుల్ కంబోజ్ రెండు వికెట్లతో రాణించాడు.
Blair Tickner vs Gurnoor Brar 😂#GurnoorBrar #TeamIndia #INDvNZ #NZvsIND #ODIs #CricketTwitter #CricketNews pic.twitter.com/jYfRcTdiAp
— Rajesh kumar (@rajeshtaatu) November 4, 2026