BigTV English

India Tour of Australia 2024: ఆస్ట్రేలియా టూర్‌కి ముషీర్ ఖాన్ ? టీమ్ ఇండియాలో చోటు?

India Tour of Australia 2024: ఆస్ట్రేలియా టూర్‌కి ముషీర్ ఖాన్ ? టీమ్ ఇండియాలో చోటు?

Musheer Khan set for India A tour of Australia: యువ సంచలనం ముషీర్ ఖాన్ కి అద్భుతమైన అవకాశం వచ్చేలా కనిపిస్తోంది. అండర్ 19లో అదరగొట్టిన ముషీర్ ఖాన్ తర్వాత ఆడిన మ్యాచ్ లన్నింటిలో అదరగొడుతున్నాడు. ఎక్కడా నిరాశపడకుండా తన పని తాను చేసుకువెళ్లిపోతున్నాడు.


ఈ పరిస్థితుల్లో దులీప్ ట్రోఫీలో ఇండియా బీ తరఫున ఆడి 181 పరుగులు చేయడంతో అందరి దృష్టిలో పడ్డాడు. పరుగులు అందరూ చేస్తారు. కానీ ఒక దశలో 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆ జట్టుని ముషీర్ ఖాన్ గట్టెక్కించాడు. టెయిల్ ఎండర్లతో కలిసి అద్భుతంగా ఆడాడు. అంతేకాదు 8వ వికెట్ కి 205 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీటన్నింటితో టీమ్ ఇండియా తలుపులు తెరుచుకుంటున్నాయి.

అంతకుముందు ముషీర్ రంజీట్రోఫీలో డబుల్ సెంచరీ చేశాడు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూ వెళ్లడంతో త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా టూర్ కి ముషీర్ ఖాన్ ఎంపిక కావడం లాంఛనమే అంటున్నారు. అయితే కేఎల్ రాహుల్ ఫామ్ లో లేకపోవడంతో వారు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.


అయితే ముషీర్ ఖాన్ అన్నయ్య సర్ఫరాజ్ ఖాన్ కూడా బాగా ఆడుతున్నాడు. కాకపోతే క్రీజులో నిలదొక్కుకున్నాక.. ఆఫ్ సెంచరీలు చేశాక అవుట్ అవుతున్నాడు. వాటిని పెద్ద ఇన్నింగ్స్ గా మలచలేకపోతున్నాడు. ఆ పని తమ్ముడు ముషీర్ ఖాన్ చేస్తున్నాడు. అందుకే తనకి ఆస్ట్రేలియా టూర్ లో ప్రాధాన్యత దక్కేలా ఉందని అంటున్నారు.

Also Read: దులీప్ ట్రోఫీ.. రెండో రౌండ్‌కు టీమ్స్ ఎంపిక.. జట్టులోకి తెలుగు కుర్రాడు

ఇకనుంచి జరగబోయే దేశవాళీ మ్యాచ్ ల్లో ముషీర్ ఖాన్ రాణిస్తే, టీమ్ ఇండియాలో చోటు కన్ ఫర్మ్ అని అంటున్నారు. ఇంతకుముందే బంగ్లాదేశ్ టూర్ కి ఎంపిక చేస్తారని అంతా ఊహించారు. కాకపోతే కేఎల్ రాహుల్ కి మరొక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంపిక ఆగినట్టు తెలిసింది. అంతకుముందు ఇంగ్లండ్ టూర్ లో మెప్పించిన సర్ఫరాజ్ కి అన్యాయం చేయకూడదనే ఉద్దేశం కూడా సెలక్షన్ కమిటీలో ఉంది.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ టూర్ కి ముషీర్ ఖాన్ ఎంపికవలేదని తెలిసింది. తొలి టెస్టులో రాహుల్ క్లిక్ అయితే రెండో టెస్టు ఆడతాడు. లేదంటే రెండో టెస్టుకి సర్ఫరాజ్ ఆడతాడు.అప్పుడు వీరిద్దరిలో ఎవరో ఒకరు తేలిపోతారు. దీంతో ఆస్ట్రేలియా టూర్ కి.. ముషీర్ ఖాన్ కి లైన్ క్లియర్ అవుతుందని అంటున్నారు.

ఈలోపు తొలిటెస్టుకి మాత్రం సర్ఫరాజ్ బెంచ్ కే పరిమితమవుతారని చెబుతున్నారు. లేదంటే తమ్ముడి కోసం అన్న, అన్నకోసం తమ్ముడు ఇద్దరిలో ఒకరి కెరీర్ త్యాగం చేయకతప్పదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×