Huawei MatePad 11.5 with Keyboard: ఆఫీసులు, కాలేజీలకు ల్యాప్ టాప్ మోసుకెళ్లడం కష్టంగా ఉందా? లేదా ప్రయాణాల్లోనూ మీ ఆఫీస్ పని లేదా చదువు సాఫీగా సాగిపోవాలా? అయితే మీ కోసమే హువావే బ్రాండ్ నుంచి మార్కెట్లోకి ఒక అద్భుతమైన గాడ్జెట్ అందుబాటులోకి తీసుకువచ్చింది. పవర్ ఫుల్ స్టోరేజ్ స్టోరేజ్, డిటాచబుల్ కీబోర్డ్‌తో వస్తున్న.. ఈ ట్యాబ్ ధర కేవలం రూ.34,999 మాత్రమే. స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో.. ఆకట్టుకుంటున్న ఈ ట్యాబ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుత ట్రెండ్‌కు తగినట్టుగా హువావే కంపెనీ ఈ మోడల్‌ను చాలా సన్నగా, అంతే కాకుండా మెటాలిక్ బాడీతో తయారు చేసింది. ఇది చూడటానికి చాలా ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. దీంతో పాటు కంపెనీ అందించే డిటాచబుల్ కీబోర్డ్ దీనికి అతి పెద్ద ప్లస్ పాయింట్. దీన్ని కనెక్ట్ చేస్తే చాలు.. ట్యాబ్ కాస్తా పూర్తి స్థాయి ల్యాప్‌టాప్‌లా మారిపోతుంది. ఆఫీస్ డాక్యుమెంట్లు టైప్ చేయడం, ఈమెయిల్స్, కాలేజ్ అసైన్‌మెంట్లు చేయడం వంటి పనులకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
ఈ ట్యాబ్ మెయిన్ హైలైట్ దాని స్క్రీన్. ఇందులో .. 11.5 ఇంచుల పెద్ద డిస్‌ప్లేను వాడారు. అంతే కాకుండా ఇది 2K రెక్షూల్యూషన్, 120Hz హై రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల వీడియోలు చూసేటప్పుడు, గేమ్‌లు ఆడేటప్పుడు లేదా స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నప్పుడు ఫీల్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే TÜV రేన్ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉండటం వల్ల ఎక్కువ సేపు స్క్రీన్ చూసినా కళ్ళ మీద ఒత్తిడి పడదు. ఆన్‌లైన్ క్లాసులు వినే స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
మల్టీటాస్కింగ్ పనులను ఎలాంటి లాగ్స్ లేకుండా.. చేయడంలో ఈ ట్యాబ్ ముందుంటుంది. ఇందులో.. పవర్ ఫుల్ ప్రాసెసర్‌తో పాటు ఏకంగా 8GB RAM , 256GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. దీని వల్ల భారీ యాప్స్‌ను రన్ చేయడం, ఒకే సమయంలో..ఎక్కువ యాప్స్ ఓపెన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అలాగే 256GB పెద్ద మెమరీ ఉండటం వల్ల మీ ఫొటోలు, వీడియోలు, సినిమాలు, ముఖ్యమైన డాక్యుమెంట్‌లను సేవ్ చేసుకోవడానికి కూడా స్పేస్ టెన్షన్ ఉండదు. హువావే సొంత హార్మొనీ ఓఎస్ పై ఇది పని చేస్తుంది. కాబట్టి ఇది యూజర్లకు చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.
ఎంటర్టైన్మెంట్ , ఆన్‌లైన్ మీటింగ్‌ల కోసం ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. వీడియో కాల్స్ కోసం క్లియర్ ఫ్రంట్ కెమెరా, వెనుకవైపు మంచి కెమెరా సెటప్ ఇచ్చారు. ఇక సౌండ్ విషయానికి వస్తే.. ఇందులో క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. ఇవి హువావే.. హిస్టన్ ఆడియో టెక్నాలజీతో పనిచేస్తాయి. దీనివల్ల సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ లాంటి సౌండ్ ఎక్స్‌పీరియన్స్ దక్కుతుంది.
Also Read: బడ్జెట్ ధరలో థియేటర్ ఫీల్, 43 ఇంచుల టీవీపై భారీ డిస్కౌంట్
బ్యాటరీ పరంగా… ఇందులో పవర్ ఫుల్ బ్యాటరీ వాడారు. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ .. చేస్తే రోజంతా పని చేసుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.. ఉండటం వల్ల తక్కువ సమయంలోనే బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది.
ఇండియన్ మార్కెట్లో కీబోర్డ్‌తో వచ్చిన ఈ మోడల్ ధర సుమారు రూ. 34,999 గా ఉంది రూ. 35 వేల బడ్జెట్‌లో ల్యాప్‌టాప్ లాంటి కీబోర్డ్, పెద్ద 2K డిస్‌ప్లే, భారీ స్టోరేజ్ కోరుకునే విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, కంటెంట్ క్రియేటర్లకు ఇది ఒక బెస్ట్ ఛాయిస్!