Naa Anvesh: ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ వంటి యూట్యూబ్ ఛానల్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నా అన్వేషణ అన్వేష్ (Anvesh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దేశ విదేశాలను చుట్టేస్తూ అక్కడి విషయాలను ఫాలోవర్స్ తో పంచుకుంటూ నిత్యం వార్తల్లో నిలిచే అన్వేష్.. గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై తనదైన శైలిలో స్పందిస్తూ విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా గత రెండు మూడు రోజులుగా అగ్నిపరీక్ష జడ్జెస్ పై మాత్రమే కాకుండా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున (Nagarjuna) పై కూడా తనదైన శైలిలో స్పందించి రెచ్చిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా కోట్ల రూపాయల స్కాం లో అరెస్ట్ అయిన యూట్యూబర్ నందన (Nandana ) పై తనదైన శైలిలో స్పందించిన ఈయన.. ఏం పీ*క*లే*రు అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
“జాబ్ స్కామ్స్ మీద లండన్ నుండి ఇండియాకి వచ్చిన నందనను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులందరూ అరెస్టు చేశారు. ఆమె అరెస్టు కావడంతో నెక్స్ట్ నువ్వే.. నీ పైన కూడా లుక్ అవుట్ నోటీసులు ఉన్నాయి.. నువ్వు ఇండియాలోకి అడుగుపెట్టగానే నిన్ను అరెస్టు చేస్తారు.. కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అరెస్టు చేయనివ్వండి. నందన అంటే కోట్లల్లో జాబు స్కామ్స్ చేసింది కాబట్టి ఆమెను అరెస్ట్ చేశారు. నేనేం చేశాను.. ప్రజల కోసం పోరాటం చేశాను. ఆ బెట్టింగ్ యాప్ వాళ్లను తిట్టడం వల్ల నాపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా భారతదేశానికి నేనేం చేయబోతున్నానో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
ఇది చెప్పడానికి ముందు నా యూట్యూబ్ సంపాదన గురించి మీకు చెప్పాలి. ఏడు సంవత్సరాలలో నేను 8 కోట్ల రూపాయల సంపాదించాను. 4 కోట్ల రూపాయలు ఈ ఏడు సంవత్సరాలు తిరగడానికి ఖర్చు అయిపోయాయి. మిగిలిన 4 కోట్లల్లో అందులో రూ.1 కోటి టాక్స్, జీఎస్టీ అంటూ అయిపోయాయి. ఒక కోటి రూపాయలను మా అమ్మకు ఇచ్చాను. ఒక కోటి రూపాయలను నా బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేసుకున్నాను. ఇక మరో కోటి సమాజానికి సేవా కార్యక్రమాల కోసం వాడేసాను. సబ్స్క్రైబర్లను నేను దేవుళ్ళుగా భావిస్తాను కాబట్టి ఏ ఒక్కరూపాయి నేను దేనిని ప్రమోట్ చేసి తీసుకోలేదు. 30 కోట్లు సంపాదించే స్టామినా నాకున్నా కూడా నేను ఏ రోజు తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించలేదు.
also read:సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?
నేను కొలిచే వినాయకుడి మీద, ప్రార్థించే భగవద్గీత మీద ప్రమాణం చేసి చెబుతున్నాను.. ప్రాంసరీ నోటు మీద రాసి పెట్టుకోండి . ఇండియాకి వచ్చిన తర్వాత నేను 100 టన్నుల చెత్త క్లీన్ చేస్తాను. దీని ద్వారా వచ్చిన డబ్బుతో వెయ్యి టన్నుల చేత క్లీన్ చేస్తాను. ఇక తర్వాత పదివేల స్కూళ్లలో ఏ ఐ టెక్నాలజీ కోర్స్ గురించి.. నేను తిరిగిన 130 దేశాల పిల్లల కోసం దీని గురించి చెప్తాను. ఎన్నో పర్యావరణ కార్యక్రమాలు చేస్తాను. రాజకీయాల్లోకి రాను.. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి. కాబట్టి ఇదంతా చేస్తున్నాను. ఇక నేను ఏక్ నిరంజన్.. పెళ్లి , పిల్లలు లేరు. అమ్మ నాన్న ఆకాశంలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖాళీగా ఉన్న నేను సమాజ సేవ చేస్తాను” అంటూ కామెంట్ చేశారు.
?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==