E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో థియేటర్ ఫీల్, 43 ఇంచుల టీవీపై భారీ డిస్కౌంట్

బడ్జెట్ ధరలో థియేటర్ ఫీల్, 43 ఇంచుల టీవీపై భారీ డిస్కౌంట్
Advertisement

Onida 43 inch QLED 4K Smart Fire TV: ఇంట్లో కూర్చుని థియేటర్ లాంటి విజువల్ ఎక్స్‌పీరియన్స్ పొందాలని చూస్తున్నారా? అయితే.. మీకోసం మార్కెట్లో ఒక అద్భుతమైన బడ్జెట్ ఆప్షన్ వచ్చేసింది. ప్రముఖ హోమ్ అప్లయన్సెస్ బ్రాండ్ ‘ఒనిడా’ విడుదల చేసిన ఈ స్మార్ట్ టీవీ టెక్ లవర్స్‌ను  ఎంతగానో ఆకట్టుకుంటోంది. తక్కువ ధరలోనే అదిరిపోయే పిక్చర్ క్లారిటీ, లేటెస్ట్ ఫైర్ ఓఎస్ ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్ టీవీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, డిస్‌ప్లే:

ప్రస్తుత కాలంలో స్మార్ట్ టీవీల మార్కెట్ పూర్తిగా మారిపోయింది. కేవలం.. వేల రూపాయల బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్లు లభిస్తున్నాయి. ఈ కోవకే చెందిన ఒనిడా క్యూ43యూఎఫ్‌డీ మోడల్ ట్రూ-బెజెల్ లెస్ డిజైన్‌తో వస్తుంది. అంటే టీవీ చుట్టూ ఉండే అంచులు చాలా పల్చగా ఉండి, స్క్రీన్ మరింత పెద్దదిగా కనిపిస్తుంది.

Advertisement

ఇందులోని 43 అంగుళాల (108 సెం.మీ)ఓఎల్ఈడీ డిస్‌ప్లే స్పెషల్ అట్రాక్షన్. 4K Ultra HD (3840 x 2160 పిక్సెల్స్) రెక్షూల్యూషన్‌తో ఈ టీవీ వస్తుంది. సాధారణ ఎల్ఈడీ టీవీలతో.. పోలిస్తే క్యూఎల్ఈడీ టెక్నాలజీ వల్ల కలర్స్ చాలా రిచ్‌గా, బ్రైట్‌గా కనిపిస్తాయి. HDR10 సపోర్ట్ ఉండటం వల్ల హెచ్‌డీఆర్ కంటెంట్ చూస్తున్నప్పుడు.. ప్రతీ చిన్న డీటైల్ స్పష్టంగా కళ్ల ముందు కదలాడుతుంది. ఇంట్లో 5 నుంచి 10 అడుగుల దూరంలో.. కూర్చుని చూసేందుకు ఈ సైజ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

స్మార్ట్ ఫీచర్లు,ఫైర్ ఓఎస్ మ్యాజిక్:

ఈ టీవీ పర్ఫామెన్స్ కోసం క్వాడ్-కోర్ ARM కార్టెక్స్-A55 CPU ని ఉపయోగించారు. ఇందులో 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. దీని వల్ల టీవీ ఎలాంటి లాగ్స్ లేకుండా చాలా స్మూత్‌గా పని చేస్తుంది.

Advertisement

ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ ఫైర్ ఓఎస్‌పై రన్ అవుతుంది. దీని వల్ల ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్‌తో పాటు యాప్ స్టోర్ నుంచి ఏకంగా 18,000 పైచిలుకు యాప్స్‌ను డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు. అలాగే అలెక్సా వాయిస్ రిమోట్ సపోర్ట్ దీని ప్రత్యేకత. కేవలం.. మీ గొంతుతో వాయిస్ కమాండ్ ఇచ్చి మీకు నచ్చిన ఛానెల్స్ లేదా సినిమాలను సెర్చ్ చేసుకోవచ్చు. డిటీహెచ్ సెట్-టాప్ బాక్స్ ఇంటిగ్రేషన్ ఉండటం వల్ల మామూలు టీవీ ఛానెల్స్ నుంచి ఓటీటీ యాప్స్‌కు ఈజీగా మారొచ్చు.

సౌండ్, కనెక్టివిటీ ఆప్షన్స్:

మంచి విజువల్స్‌తో పాటు పవర్ ఫుల్ సౌండ్ ఉంటేనే.. అసలైన వినోదం దక్కుతుంది. ఈ ఒనిడా టీవీలో 20 వాట్స్ అవుట్‌పుట్ ఇచ్చే డాల్బీ ఆడియ స్పీకర్లు ఉన్నాయి. ఇవి రూమ్ మొత్తానికి సరి పడా క్లియర్ సౌండ్‌ను అందిస్తాయి. మరింత గట్టి సౌండ్ కావాలనుకునేవారు.. హోమ్ థియేటర్లను కనెక్ట్ చేసుకోవచ్చు.

Also Read: వీడియో వాచ్ ఫేసెస్‌తో బోట్ కొత్త స్మార్ట్‌వాచ్..లుక్ అదుర్స్

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇందులో డ్యూయల్ బ్యాండ్ వై-ఫై సపోర్ట్ ఉంది. సెట్-టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేయడానికి 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, హార్డ్ డ్రైవ్‌ల కోసం 2 యూఎస్‌బీ పోర్ట్‌లు ఇచ్చారు. ఇవే కాకుండా బ్లూటూత్ v5.0, ఈథర్నెట్ , 3.5ఎంఎం ఇయర్ ఫోన్ జాక్ వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

ధర, ఎవరికి బెస్ట్?

ఇండియన్ మార్కెట్లో. ఈ మడల్ ప్రస్తుత ధర సుమారు రూ. 23,999 వరకు ఉంది. క్రెడిట్ కార్డ్ ఆఫర్లు, సేల్ డిస్కౌంట్స్ పోతే ఇది ఇంకా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. రూ.25 వేల లోపు బడ్జెట్‌లో.. బెస్ట్ క్యూఎల్ఈడీ పిక్చర్ క్వాలిటీ, ఫైర్ ఓఎస్ స్మార్ట్ ఫీచర్లు కోరుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది ఒక అద్భుతమైన ఛాయిస్ అని చెప్పొచ్చు.

Related News

రూ.500 లోపు బెస్ట్ టైప్-సి, 3.5ఎంఎం ఇయర్ ఫోన్స్.. వీటికి ఇప్పుడు మార్కెట్లో ఫుల్ డిమాండ్!

క్యాష్, కార్డుల టెన్షన్ వదిలేయండి.. విదేశాల్లోనూ ఇకపై PhonePeతో చిటికెలో పేమెంట్స్!

వైరల్ 1980s ఏఐ ఫొటో ట్రెండ్ వెనుక అసలు ప్రమాదం ఇదే.. ఈ యాప్స్‌తో జాగ్రత్త!

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

Big Stories

Advertisement
×