Samsung Galaxy S24 FE| మీరు ఎప్పటినుంచో ఒక మంచి, హై ఎండ్ Samsung స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. Samsung Galaxy S24 FE 5G ఫోన్‌కి ఫ్లిప్ కార్ట్ (Flipkart) లో భారీ తగ్గింపు లభిస్తోంది. ఇది మంచి డిజైన్, పవర్‌ఫుల్ ఫెర్ఫార్మెన్స్, అద్భుతమైన కెమెరాలతో వస్తుంది.
ఈ ఫోన్ ధర సాధారణంగా రూ.59,999 ఉంది. కానీ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్‌లో 41 శాతం తగ్గింపుతో కేవలం రూ.34,999కే లభిస్తోంది. పైగా మీరు ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే అదనంగా 5% క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
ఎక్సేంజ్ ఆఫర్ తో మరింత తక్కువ ధరకు!
మీ దగ్గర ఉన్న పాత ఫోన్ పనిచేస్తూ మంచి కండిషన్‌లో ఉంటే, దాన్ని ఎక్సేంజ్ చేసి ఈ సామ్ సాంగ్ గెలాక్సీ S24 FE 5G ఫోన్‌ను మరింత తక్కువ ధరకు పొందవచ్చు. పాత ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ అప్పుడప్పుడు రూ.32,700 వరకు ఎక్సేంజ్ వాల్యూను అందిస్తోంది.
ఉదాహరణకు, మీ పాత ఫోన్‌కి రూ.15,000 ఎక్సేంజ్ విలువ వస్తే, Galaxy S24 FE ఫోన్ ధరపై రూ.19,999 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది నిజంగా గొప్ప డీల్ అనే చెప్పాలి.
డిజైన్: ఫోన్ అల్యూమినియం ఫ్రేముతో వస్తుంది. ఇది IP68 రేటింగ్‌తో వాటర్ ప్రూఫ్ అంటే వర్షం పడినా, దుమ్ము ధూళికి కూడా తట్టుకునేలా తయారైంది. స్టైలిష్, మన్నికైన ఫోన్ అని చెప్పవచ్చు.
డిస్‌ప్లే: 6.7 అంగుళాల ఆమోలెడ్ (AMOLED) స్క్రీన్ ఉంది. ఇందులో కలర్స్, క్లారిటీ ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాలు, గేమ్స్ చూడడానికి చాలా బాగుంటుంది.
ప్రాసెసర్: ఇందులో ఎక్సినోస్ (Exynos) 2400e చిప్‌సెట్ ఉంది, ఇది వేగవంతమైన పనితీరును అందిస్తుంది. డే-టు-డే యూజ్, గేమింగ్, మల్టీటాస్కింగ్‌కి పర్‌ఫెక్ట్.
మూడు రేర్ కెమెరాలు:
ఈ ఫోన్‌లో మూడు రేర్ కెమెరాలు ఉన్నాయి. 50MP ప్రధాన కెమెరా, 8MP టెలిఫోటో లెన్స్ , 12MP అల్ట్రా వైడ్ లెన్స్ లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: 4,700mAh సామర్థ్యం గల బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. రోజంతా బ్యాటరీ సమస్య లేకుండా సాఫీగా ఫోన్ వాడవచ్చు.
Also Read: సిగరెట్ లైటర్ సైజులో మొబైల్.. క్రిమినల్స్ కోసం స్పెషల్!
మొత్తంగా చెప్పాలంటే.. ఈ డీలుతో Samsung Galaxy S24 FE 5G లాంటి ప్రీమియం ఫోన్ వేల్యూఫర్ మనీ (value for money) క్యాటగిరీలో ఇండియాలో లభించే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. పండుగ సీజన్ కోసం ఎదురు చూడకుండా ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.