SwaRail Superapp : ఇండియన్ రైల్వే తాజాగా ఓ సరి కొత్త యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ తో రైల్వేకు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని ఒకే ఫ్లాట్ఫామ్ లో పొందవచ్చు. ప్రస్తుతానికి పరిమితి సంఖ్యలో యూజర్స్ మాత్రమే ఈ యాప్ ను వాడుకోగలరు.
స్వరైల్ (SwaRail) యాప్ ను భారతీయ రైల్వే తీసుకువచ్చింది. ఈ యాప్ ఎన్నో ప్రయోజనాలతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం అందించడానికి రూపొందించారు. ఇది రైల్వే ప్రయాణీకులు తమ ప్రయాణాలను తేలిక చేసుకోటానికి, టికెట్స్ బుక్ చేసుకోటానికి, ట్రైన్ కు సంబంధించిన సమాచారాన్ని ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. అయితే ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు మరెన్నో ముఖ్యమైన సేవలు అందుతాయి.
SwaRail యాప్ ప్రయోజనాలు –
అన్ని సేవలు ఒకటే యాప్ లో –
యాప్ లో టికెట్ బుకింగ్, ట్రైన్ షెడ్యూల్, రైల్వే స్టేషన్ల సమాచారం, ట్రైన్ల సమాచారం, ఆలస్యం, ప్రత్యేక రైళ్లు వంటి పలు సేవలు అందించబడతాయి. ఈ మొత్తం సేవలను ఒకే యాప్ తో పొందడం ద్వారా ప్రయాణికులు మరింత తేలికగా రైల్వే సేవలను పొందగలుగుతారు.
ట్రైన్ ట్రాకింగ్ –
ప్రస్తుత ట్రైన్ స్టేటస్, ముందురోజు ఆ ట్రైన్ ఏ సమయానికి నడిచింది? ఆలస్యంగా నడిచిందా? లేదా సరైన సమయానికి నడిచిందా? వంటి సమాచారం తెలియజేస్తుంది. రైలు ప్రయాణించే మార్గంలో ఏమైనా ఆటంకాలు ఉన్నా తెలుపుతుంది. రైలు ఎక్కడ ఆగిపోయింది.. మళ్ళీ ఎప్పుడు బయలుదేరుతుందో కూడా చెప్పేస్తుంది. ఇప్పటికే ఇందులో కొంతమేర సమాచారాన్ని Where Is My Train App అందిస్తున్నప్పటికీ ఇప్పుడు అన్ని సేవలు ఒకే ప్లాట్ ఫామ్ లో అందించే విధంగా కొత్త యాప్ ను రైల్వే శాఖ తీసుకువచ్చింది.
ఇంకా ఈ SwaRail యాప్ ద్వారా ప్రయాణికులు దేశవ్యాప్తంగా అన్ని రైళ్లను బుక్ చేయడం, ట్రైన్స్ షెడ్యూల్ తెలుసుకోవడం, రైలు మార్గాలను అన్వేషించడం వంటి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.
కమ్యూనికేషన్ –
ఈ యాప్ లో ట్రైన్ ప్రయాణం చేసే సమయంలో ప్రయాణీకులకు సమాచారాన్ని పంపించి, రైల్వే అధికారులతో ఇంటరాక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
లైవ్ ట్రాకింగ్ – లేట్ అప్డేట్స్ –
ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్స్ రావల్సిన సమయం కంటే ఆలస్యంగా ఉంటే లైవ్ ట్రాకింగ్ ఉపయోగించి మరో మార్గం ఎంచుకోవచ్చు.
కస్టమర్ సపోర్ట్ –
యాప్ తో కస్టమర్ కు సరైన సపోర్ట్ అందించే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికులు సందేహాలను తేలికగా పరిష్కరించుకోవచ్చు.
వర్చువల్ సహాయాన్ని అందించడం –
యూజర్ ఇంటర్‌ఫేస్ తో ప్రయాణికులకు ఏదైనా సహాయం కావాలనుకుంటే, చాట్‌బాట్ లేదా ఇతర వర్చువల్ టూల్స్ అందుబాటులో ఉంటాయి.
ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడం –
స్మార్ట్ బుకింగ్స్, కమ్యూనికేషన్, ఎకో ఫ్రెండ్లీ మేనేజిమెంట్ తో ప్రయాణికులు మరింత తేలికగా తమ ప్రయాణాన్ని కొనసాగించే ఛాన్స్ ఉంది.
అంతేకాకుండా యాప్ ద్వారా భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రతీ ప్రయాణికుడు ఎంతో సులభంగా తమ గమ్యస్థానాన్ని చేరగలుగుతాడని.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్య సమయంలో సైతం చక్కని పరిష్కారం వెతుక్కోగలుగుతాడని తెలుస్తోంది.
ALSO READ : ఆధార్ లో కీలక మార్పులు.. తెలుసుకోకపోతే నష్టపోతారు!