Bank Loans: మీకు రూ. 5 లక్షలు రుణం కావాలా.. అది కూడ బ్యాంకుకు అలా వెళ్లామా.. ఇలా తెచ్చుకున్నామా అనే రీతిలో లోన్ కావాలా.. అయితే మీలాంటి వారి కోసమే ఈ గుడ్ న్యూస్. అంతేకాదండోయ్.. తక్కువ వడ్డీతో మీకు ఈ లోన్ సౌకర్యం అందుబాటులో ఉందని మీకు తెలుసా.. అదెలాగో తెలుసుకోండి.. ఏకంగా రూ. 5 లక్షల లోన్ సదుపాయం పొందండి.
కేంద్రం సన్న చిన్నకారు రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి, రైతన్నల నేస్తంగా పిలువబడుతోంది. సాగు చేసే రైతన్నలకు పెట్టుబడులు అవసరం. అందుకు రుణాలు పొందడం రైతన్నలకు షరామామూలే. ఎందరో రైతన్నలు అధిక వడ్డీలకు రుణాలు పొంది, ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అలాగే పశుపోషణ సాగించే రైతులు కూడ పశువుల మేత కొనుగోళ్ల కోసం అప్పులు చేస్తుంటారు. అధికవడ్డీల ధాటికి పంట చేతికి అందినా ఆ రైతులకు వచ్చిన ఆదాయం వడ్డీలకు సరిపోయేవి.
ఎందరో రైతన్నలు గతంలో వడ్డీలకు భయపడి సాగుకు కూడ సాహసించని పరిస్థితులు ఉండేవి. ఇటువంటి ఘటనలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతన్నలకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పించేందుకు కేంద్రం నడుంబిగించగా, అందులో కూడ పలు మార్పులను కేంద్రం తీసుకువచ్చింది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సన్న చిన్నకారు రైతులకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సదుపాయాన్ని కౌలు రైతులకు, చేపలు పట్టే మత్స్యకారులకు, డ్వాక్రా గ్రూపు సభ్యులకు కల్పించింది కేంద్రం. దీనితో ఏకంగా తక్కువ వడ్డీకి రూ. 5 లక్షల రుణ సదుపాయం పొందే అవకాశం మీ ముందుకు వచ్చింది. ఈ లోన్ సౌకర్యం కోసం.. నిబంధనలు కూడ సులువుగా ఉండడంతో అందరి కోసం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో అధిక సంఖ్యలోనే మేలు చేకూరనుంది.
ఇక అసలు విషయంలోకి వెళితే.. ముందుగా ఈ లోన్ సదుపాయం కావాల్సిన వారు.. కిసాన్ క్రెడిట్ కార్డును పొందాల్సి ఉంటుంది. ఈ కార్డును దేశంలోని ఏ బ్యాంక్ నుండైనా పొందవచ్చు. కార్డు పొందిన వారు.. రూ. 2 లక్షలలోపు రుణానికి పూచీకత్తు కూడ అవసరం లేదు. అంతేకాదు ఏకంగా రూ. 5 లక్షల రుణ సదుపాయం కూడ పొందవచ్చు.
Also Read: Rahul Gandhi: తెలంగాణలో సక్సెస్.. దేశవ్యాప్తంగా సర్వే సాగించలేరా? రాహుల్ గాంధీ ప్రశ్న
అందుకు తగిన పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. వడ్డీ కేవలం 4 శాతం అంటే.. 7 శాతంలో 3 శాతం కేంద్రం రాయితీ ఇస్తుండడం విశేషం. ఈ రుణం చెల్లింపులు ఐదేళ్ల కాలపరిమితిని కేంద్రం విధించింది. మరెందుకు ఆలస్యం.. మీకు రూ. 5 లక్షల రుణం కావాలంటే.. ముందుగా కిసాన్ క్రెడిట్ కార్డు పొందండి.. ఆ తర్వాత లోన్ సదుపాయం కూడ పొందండి.