BigTV English

Indian Mobile Number : భారత్​లో ఫోన్ నెంబర్లకు +91 కోడ్ ఇచ్చింది అందుకే – ఈ విషయాలు మీకు తెలుసా?

Indian Mobile Number : భారత్​లో ఫోన్ నెంబర్లకు +91 కోడ్ ఇచ్చింది అందుకే – ఈ విషయాలు మీకు తెలుసా?

Indian Mobile Number : మన దేశంలో ప్రతి మొబైల్ నంబరుకు ముందు +91 కనిపిస్తుంటుంది. అసలు ఈ నంబర్​ ఎందుకు ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మందికి దీని గురించి తెలియకపోవచ్చు. ఇది మన దేశ కోడ్. మరి +91 మాత్రమే ఎందుకు? ఇది ఇతర దేశానికి కోడ్ ఎందుకు కాదు? అసలు భారత దేశానికి ఈ కోడ్‌ను ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఏ ప్రాతిపదికన నిర్ణయించారు? అసలు ఈ కోడ్​ను కేటాయించడం వెనక ఉన్న అసలు కారణం ఏంటి? ఇలాంటి పలు ప్రశ్నలకు సమాధానాలను మీ ముందుకు తీసుకొచ్చాం.


కంట్రీ కాలింగ్ కోడ్‌లు లేదా కంట్రీ డయల్ ఇన్ కోడ్‌లు టెలిఫోన్ నంబర్లకు ప్రిఫిక్స్​లుగా ఉపయోగిస్తారు. దీని సాయంతోనే ఆయా ప్రాంతాల్లో ఉన్న ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సభ్యులు లేదా టెలిఫోన్ సబ్‌స్క్రైబర్లకు కనెక్ట్ చేయవచ్చు.

ఏ దేశానికి ఫోన్ చేయాలన్నా? – ఐక్య రాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్ యూనిట్ (ITU) అన్ని దేశాలకూ ఈ తరహా కోడ్​లను కేటాయిస్తుంటుంది. భారత దేశం కోసం కోడ్ +91, పాకిస్థాన్ కోసం డయల్ కోడ్ +92 అనేవి అంతర్జాతీయ సబ్‌ స్క్రైబర్ డయలింగ్ అని కూడా పిలుస్తారు. ఏ దేశానికి చెందిన స్థానిక నంబరకు ఫోన్ చేయాలన్నా, ఆ దేశానికి చెందిన కంట్రీ కోడ్ కచ్చితంగా ఎంటర్ చేయాలి. అప్పుడు కాల్ వెళ్తుంది.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశానికి టెలికాలు చేయాలి అంటే ఒక కోడ్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ కోడ్ ను ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే కాల్ వెళుతుంది. లేదంటే కాల్ చేయటం సాధ్యపడదు. అమెరికా, బ్రిటన్, రష్యా, జర్మనీ, జపాన్ వంటి టాప్ కంట్రీ లతో పాటు చిన్న కంట్రీలకు సైతం ప్రత్యేకంగా స్పెషల్ సబ్స్క్రైబ్ డయలింగ్ కోడ్ ఉంటుంది. ఇక భారత్ ఇక భారత్ సబ్స్క్రైబ్ డైలింగ్ కోడ్ 91 గా ఉంది. ఈ కోడ్ తో కాల్ వచ్చినప్పుడు భారత్ నుంచి వస్తున్నట్టు గమనించే అవకాశం ఉంటుంది.

ALSO READ : యాపిల్, గూగుల్​ టు ఫేస్​బుక్​, ఇన్​స్టా – ఈ 8 బడా సంస్థల అసలు పేర్లు తెలుసా?

9 వేర్వేరు జోన్​లుగా – అయితే ఐటీయూకు చెందిన కన్సల్టేటివ్ కమిటీ మొత్తం ప్రపంచాన్ని 9 వేర్వేరు జోన్లుగా విభజించింది. దీంతో ఈ కోడ్​ల జాబితాను రూపొందించింది. జనాభా, ఆర్థిక వ్యవస్థ, కమ్యూనికేషన్ సహా సంబంధిత ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఐటీయూ ఈ కోడ్లను రూపొందించి కేటాయిస్తుంది.

అవన్నీ 9తోనే – ఈ 9 తొమ్మిది వేర్వేవు జోన్లలో 9వ జోన్​ కిందకు దక్షిణ, మధ్య, పశ్చిమాసియాతో పాటు మధ్య ప్రాచ్య దేశాలు వస్తాయి. ఈ తొమ్మిదో జోన్​లో ఉన్న అన్ని దేశాల కోడ్ కూడా గమనిస్తే 9తోనే మొదలు అవుతుంది. భారత్​కు +91, పాకిస్థాన్​కు + 92, అఫ్గానిస్థాన్ +93 అని ఉంటుంది.

ప్రముఖ దేశాలకు, అత్యంత జనాభా కలిగిన దేశాలకు తక్కువ, చిన్న డిజిట్ ఉన్న కోడ్​ను కేటాయిస్తారు. చిన్న దేశాలకు అయితే 3 అంకెల కోడ్​ను కేటాయిస్తారు. ఇక యూఎస్ (+1), యూఎస్ఎస్ఆర్ (+7) వంటి దేశాలకు మాత్రమే సింగిల్ డిజిట్ కోడ్​లు ఉంటాయి. బంగ్లాదేశ్ (+880), ఫిజీ (+679), కాంగో వంటి చిన్న దేశాలకు అయితే మూడంకెల కోడ్ కనిపిస్తుంది.

Related News

Dinosaur Eggs: అంగారక గ్రహంపై ‘డైనోసార్ ఎగ్స్’.. ఒకప్పుడు అక్కడ జీవులు మనగడ ఉండేదా?

Google Pixel 9 vs Pixel 10: పిక్సెల్ 10 కంటే పిక్సిల్ 9 బెటర్.. ఎందుకంటే?

Grok Imagine AI: ఇప్పుడు ఏఐ వీడియో, ఇమేజ్‌‌లు చేయడం అంతా ఫ్రీ.. అందరికీ అందుబాటులో గ్రోక్ ఇమేజిన్

Lava Play Ultra 5G: కేవలం రూ.14999కే సూపర్ గేమింగ్ ఫోన్.. 64MP కెమెరా, భారీ బ్యాటరీతో లాంచ్

Google Pixel 10 Series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఇండియాలో విడుదల.. అద్భుత కెమెరా, పవర్ ఫుల్ ఏఐ ఫీచర్లు

Vivo V60: 50MP కెమెరా, పెద్ద బ్యాటరీ.. వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ పై భారీ డిస్కౌంట్

Big Stories

×