Big Stories

PM Modi: జూన్ 4న దేశం గెలుస్తుంది.. వారంతా పారిపోతారు: పీఎం మోదీ

PM Modi: జూన్ 4 తర్వాత దేశం గెలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలకు ఎందరో బలయ్యారని ఆరోపించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు. తనకు హైదరాబాద్ చాలా ప్రత్యేకమైందని మోదీ అన్నారు.

- Advertisement -

డిజిటల్ రంగంలో భారత దేశం దూసుకుపోతుందని తెలిపారు. భారత దేశ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పని చేస్తోందని ఆరోపించారు. జూన్ 4 తర్వాత ఆర్టికల్ 370 వ్యతిరేకులు పారిపోతారని అన్నారు. బీజేపీ పాలనలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మధ్య తరగతి ప్రజల కలలను బీజేపీ సాకారం చేస్తుందని చెప్పారు. గత పదేళ్లలో ఎన్డీఏ ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిందని పేర్కొన్నారు. అంకుర సంస్థల్లో భారత్ ముందుందని తెలిపారు. కాంగ్రెస్ దేశాన్ని విభజించి పాలించేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు.

- Advertisement -

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని మోదీ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారన్న ఆయన బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గత కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎన్నో చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయని అన్నారు. గతంలో ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా బయపడే పరిస్థితి ఉండేదని తెలిపారు.

Also Read: కేసీఆర్ ధన దాహానికి పాలమూరు బలైంది: సీఎం రేవంత్

భారతీయులపై కాంగ్రెస్ నేతలు జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీ రాముడిని పూజించడం దేశ ద్రోహమా అని అన్నారు. వేల సంవత్సరాల భారత సంస్కృతి రక్షణే అసలైన భారత్ సిద్ధాంతం అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ముక్తి దివాస్ ను నిర్వహించలేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం సెప్టెంబర్ 17 న అధికారికంగా ముక్తి దివాస్ నిర్వహించిందని గుర్తు చేశారు. మత పరమైన రిజర్వేషన్లను బీజీపీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి 4 వందేభారత్ రైళ్లు ఇచ్చిందెవరు ? పసుపు బోర్డు ఇచ్చిందెవరు ? గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చిందెవరు ? అని మోదీ ప్రశ్నించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News