BigTV English

Infinix Zero 40 5G: మ.. మ.. మాస్ ఫోన్.. మార్కెట్‌లో దూకుడు పెంచేందుకు వచ్చేస్తుంది..!

Infinix Zero 40 5G: మ.. మ.. మాస్ ఫోన్.. మార్కెట్‌లో దూకుడు పెంచేందుకు వచ్చేస్తుంది..!

Infinix Zero 40 5G Launching In India Soon: ప్రముఖ టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ కొత్త కొత్త స్మార్ట్‌‌ఫోన్లను రిలీజ్ చేస్తూ మార్కెట్‌లో హవా కొనసాగిస్తోంది. బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చూస్తూ అదరగొడుతోంది. ఇప్పుడు మరొక ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫినిక్స్ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ తాజాగా సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ద్వారా వెల్లడైంది. ఈ స్మార్ట్‌ఫోన్ Infinix Zero 40 5G పేరుతో మార్కెట్‌లోకి వచ్చే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


కాగా ఈ ఫోన్ ఇంతకుముందు యూరోపియన్ సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో కూడా దర్శనమిచ్చింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కూడా కనిపించింది. ఈ సర్టిఫికేషన్ల వెబ్‌సైట్ల ప్రకారం.. ఈ ఫోన్‌కి సంబంధించి కొన్ని ప్రధాన స్పెసిఫికేషన్‌లు కూడా వెల్లడయ్యాయి. Infinix Zero 40 5G స్మార్ట్‌ఫోన్ FCC లిస్టింగ్‌లో గుర్తించబడిన కంపెనీ రాబోయే స్మార్ట్‌ఫోన్ కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఫోన్ మోడల్ నంబర్ X6861తో సర్టిఫికేషన్ వెబ్‌సైట్లో కనిపించింది.

గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 OSతో మార్కెట్‌లో రిలీజ్ అవుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. పాత మోడల్‌తో పోలిస్తే ఇది 6.78 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిలో AMOLED డిస్‌ప్లేను అందించినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫోన్ కలర్ వేరియంట్లలో పోలార్ బ్లాక్ కూడా ఒకటిగా చెబుతున్నారు. ఇది రౌండ్ కెమెరా మాడ్యూల్‌తో లాంచ్ కావచ్చని తెలుస్తోంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలను అమర్చినట్లు సమాచారం. దీనితో పాటు డ్యూయల్ LED ఫ్లాష్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 12 GB RAM + 512 GB స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది.


Also Read: పోటుగాడు దిగుతున్నాడు.. AI ఫీచర్లతో రెనో 12 సిరీస్ ఇవాళే లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ వివరాలివే..!

అదే సమయంలో దాని వేరియంట్‌లలో 12 GB RAM + 256 GB స్టోరేజ్ కూడా ఒకటి. FCC లిస్టింగ్ ప్రకారం.. NFC కనెక్టివిటీని ఫోన్‌లో అందించినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా 45W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇందులో అందించబడుతుంది. కాగా దీని ముందు మోడల్ Infinix Zero 30 5G భారతదేశంలో 8GB RAM + 128 GB స్టోరేజ్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇది బేస్ వేరియంట్‌.

దీని ధరను రూ. 23,999గా కంపెనీ నిర్ణయించింది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.24,999 ధరతో లభిస్తుంది. ఈ ఫోన్ గోల్డెన్ అవర్, రోమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది సెల్ఫీ కోసం 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Tags

Related News

iphone 17 Discount: ఐఫోన్ 17పై తొలిసారి డిస్కౌంట్.. తక్కువ ధరలో తాజా ఫ్లాగ్‌షిప్‌.. ఎక్కడంటే?

Smartphone Comparison: గెలాక్సీ A07 vs లావా బోల్డ్ N1 vs టెక్నో పాప్ 9.. ₹10,000 కంటే తక్కువ ధరలో ఏది బెస్ట్?

Galaxy S25 Ultra Discount: గెలాక్సీ ప్రీమియం ఫోన్‌పై బ్లాక్‌బస్టర్ ఆఫర్.. S25 అల్ట్రాపై ఏకంగా రూ.59000 తగ్గింపు!

Phone EMI Default: ఈఎంఐలో ఫోన్ కొనుగోలు చేసి పేమెంట్ చేయలేదా?.. ఆర్బిఐ బిగ్ వార్నింగ్

iPhone 17 Dual Camera: ఐఫోన్ 17లో అద్భుత ఫీచర్.. ఒకేసారి ముందు వెనుక కెమెరాలతో వీడియో రికార్డింగ్

Galaxy A35 5G: గెలాక్సీ A35 5Gపై భారీ తగ్గింపు.. రూ.16000 డిస్కౌంట్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే

Babies Without Pregnancy: గర్భం దాల్చకుండానే బిడ్డకు జన్మనివ్వచ్చు! పరిశోధనలో షాకింగ్ విషయాలు

Comet Browser: గూగుల్‌‌కే చెమటలు పట్టిస్తున్న ఈ అరవింద్ శ్రీనివాస్ ఎవరో తెలుసా? ఇదే భారతీయుడి పవర్!

Big Stories

×