BigTV English

Infinix Zero Flip 5G : Infinix ఫోల్డబుల్ మెుబైల్.. నేడే ఫ్లిప్కార్ట్ లో ఫస్ట్ సేల్.. ఫోన్ కొని ఎంచక్కా పాకెట్లో దాచేయండి

Infinix Zero Flip 5G : Infinix ఫోల్డబుల్ మెుబైల్.. నేడే ఫ్లిప్కార్ట్ లో ఫస్ట్ సేల్.. ఫోన్ కొని ఎంచక్కా పాకెట్లో దాచేయండి

Infinix Zero Flip 5G : Infinix కంపెనీ లాంఛ్ చేసిన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కొన్ని రోజుల క్రితమే భారత్ లో లాంఛ్ అయింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ Flipkart లో అందుబాటులో ఉండనుంది. ఈ రోజు నుంచే అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ నేపథ్యంలో Infinix Zero Flip 5G మెుబైల్ ధర, బ్యాంక్ ఆఫర్‌లు, ఫీచర్స్ పై ఓ లుక్కేద్దాం.


Infinix Zero Flip 5G ఈ రోజు నుండి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో మధ్యాహ్నం  12 గంటల నుంచి అందుబాటులో ఉండనుంది. ప్రత్యేక బ్యాంక్ ఆఫర్స్ ను సైతం ఫ్లిప్కార్ట్ అందిస్తుంది. ఎస్బిఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే కస్టమర్స్ కు భారీ తగ్గింపును అందిస్తుంది.

Infinix Zero Flip 5G మొబైల్ లో హై స్టోరేజ్ సదుపాయంతో పాటు డిస్ ప్లే, కెమెరా ఫీచర్స్ సైతం అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ మెుబైల్ ఒక్కటే వేరియంట్ లో అందుబాటులోకి వచ్చింది. 8GB/512GB స్టోరేజ్ మోడల్‌ అందుబాటులో ఉండగా.. రూ. 49,999కు కొనుగోలు చేసే అవకాశం ఉంది. SBI కార్డ్‌లతో కొనుగోలు చేస్తే రూ. 6,500 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. దీంతో ఈ మెుబైల్ ను రూ. 43,499కే దక్కించుకునే అవకాశం ఉంది.


Infinix జీరో ఫ్లిప్ 5G స్పెసిఫికేషన్‌లు –

డిస్ ప్లే –

Infinix Zero Flip 5G 6.9 అంగుళాల FHD+ (1080 x 2640 పిక్సెల్‌) LTPO OLED మెయిన్ డిస్‌ప్లే ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌, 1,400 nits గరిష్ట బ్రైట్ నెస్ తో లాంఛ్ అయింది. ఇక 120Hz రిఫ్రెష్ రేట్‌తో 3.64-అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లే ఉంది. ఇది కెమెరాకు వ్యూఫైండర్‌గా పని చేస్తుంది. YouTube, WhatsAppలతో పాటు మరిన్ని యాప్స్ యాక్సెస్ చేయడానికి షార్ట్‌కట్‌గా పనిచేస్తుంది.

ALSO READ : దీవాళి స్పెషల్ సేల్.. కిర్రాక్ ఫీచర్స్ తో రూ.10వేల కంటే తక్కువ ధరలో బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

స్టోరేజ్‌ –

8GB RAM, 512GB UFS 3.1 స్టోరేజ్‌తో లాంఛ్ అయిన ఈ మెుబైల్ MediaTek డైమెన్సిటీ 8020 SoC గా ఉంది. 70W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,720 mAh బ్యాటరీ సదుపాయం కలదు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HiOS ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఇక ఈ మెుబైల్ కు 2ఏళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 ఏళ్ల రెగ్యులర్ సర్వీస్ అందుబాటులో ఉంది. ఇక బ్లోసమ్ గ్లో, రాక్ బ్లాక్ కలర్స్ లో ఈ మెుబైల్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కెమెరా –

ఈ మొబైల్లో హై క్వాలిటీ కెమెరా అందుబాటులో ఉంది. OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇన్నర్ డిస్‌ప్లే 60fps 4K వీడియో రికార్డింగ్‌తో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక ఇతర ఫీచర్లలో AI వ్లాగ్ మోడ్, JBL తో ట్యూన్ చేసే స్టీరియో స్పీకర్లు, హై-రెస్ ఆడియో సపోర్ట్ ఈ మెుబైల్ లో అందుబాటులో ఉన్నాయి.

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×