BigTV English

Actor Nadhiya : బర్త్ డే స్పెషల్.. నదియా సినీ ప్రస్థానం.. అన్ని హిట్ సినిమాలే..

Actor Nadhiya :  బర్త్ డే స్పెషల్.. నదియా సినీ ప్రస్థానం.. అన్ని హిట్ సినిమాలే..

Actor Nadhiya : సినీ నటి నదియా పేరు అందరికి తెలిసి ఉంటుంది. ఈమె ప్రభాస్ మిర్చి సినిమాలో కనిపించింది. కానీ ఆ మూవీ అంతగా టాక్ ను సొంతం చేసుకోలేదు. పవన్ కళ్యాణ్ కు అత్తగా అత్తారింటికి దారేది సినిమాలో నటించింది ఈ సినిమా మంచి గుర్తింపును తెలుచ్చుకుంది. ఆ సినిమా మొత్తం ఆమె పాత్ర మీదే ఉంటుంది. హీరోయిన్లను మించిన అందం కల ఈమె అప్పటి లో హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. ఆ సినిమాలు అన్నీ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నేడు నదియా పుట్టినరోజు సందర్బంగా ఆమె సినిమాల గురించి ఈ రోజూ ఒకసారి గుర్తు చేసుకుందాం..


నదియా అసలు పేరు ఆమె అసలు పేరు జరీనా. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది. మలయాళ దర్శకుడు ఫాజిల్ ఫ్యామిలీ ఫ్రెండ్ కావడం తో ఆమె హీరోయిన్ కావడం యాదృచ్చికంగా జరిగిందట. ఓసారి ఫాజిల్ నదియా ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెను చూసి, మమ్ముట్టి సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అడిగారట.. అడిషన్స్కు రమ్మని చెప్పడంతో అక్కడికి వెళ్ళింది. అక్కడ ఇచ్చిన ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యింది. 18 ఏళ్ల వయసులోనే మలయాళం చిత్రం ‘నొక్కేత దూరతు కన్నుం నట్టులో’ మోహన్‌లాల్‌తో కలిసి నటించింది.

ఆ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం తో ఆమెకు వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తర్వాత, కూడమ్ తేడి, వన్ను కందు కీజా డక్కి, ఒన్నింగు వన్నెంగిల్, కందు కందరింజు వంటి చిత్రాల లో పని చేసింది. 1985 లో పూవే తో తమిళ చిత్ర రంగ ప్రవేశం చేసింది. 1988 లో శిరీష్ గాడ్‌బోలేని వివాహం చేసుకుని, అతనితో కలిసి అమెరికాకు వెళ్లింది. పెళ్ళైన తర్వాత ఈమె కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. భర్తతో పాటుగా అమెరికా లో ఉంది. మళ్లీ మళ్ళీ 2004 లో ఓ తమిళ సినిమాతో పునఃప్రవేశించింది. 2013 లో తెలుగు సినిమా మిర్చి లో ప్రభాస్ అమ్మగా, పవన్ కల్యాణ్ సినిమా అత్తారింటికి దారేది సినిమాలో హీరోకు అత్తగా నటించిన పాత్రలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి..


ఈమె 2004 నుంచి ఇండస్ట్రీ లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఎల్‌జీఎం , మిర్చి, అత్తారింటికి దారేది, మిస్ ఇండియా, దృశ్యం 2, ది వారియర్, ఓ తండ్రి ఓ కొడుకు సినిమాలు చేసింది.. ఇక ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ఇక ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందంలో తల్లిని మించిపోయారు. ఈ మధ్య వారిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. తన ఇద్దరు కూతుర్లు పై చదువులు చదువుతున్నారు మరి వాళ్ళు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా ఇవ్వరానిది తెలియాల్సింది ఈరోజు నదియా పుట్టినరోజు సందర్బంగా ఆమె ఇలాంటి పుట్టినరోజులను మరెన్నో జరుపుకోవాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×