BigTV English

Instagram In India : టీనేజర్లకు ఇన్‌స్టాగ్రామ్ ఝలక్.. ఇక ఆ కంట్రోల్స్ అన్నీ పేరెంట్స్ చేతుల్లోనే, చచ్చారు పో!

Instagram In India : టీనేజర్లకు ఇన్‌స్టాగ్రామ్ ఝలక్.. ఇక ఆ కంట్రోల్స్ అన్నీ పేరెంట్స్ చేతుల్లోనే, చచ్చారు పో!

Instagram In India : టీనేజ్ పిల్లలు సెన్సార్ లేని సోషల్ మీడియా కంటెంట్ నుంచి దూరంగా ఉంచాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఇన్ స్టా టీన్స్ భారత్ లో అందుబాటులోకి వచ్చింది. ఆ విషయాన్ని ఇన్ స్టా మాతృ సంస్థ మెటా అధికారికంగా వెల్లడించింది. యుక్త వయస్సులో సమాజ పోకడలు, పూర్తి స్థాయిలో ఆలోచించే సామర్థ్యం లేని సందర్భంలో.. వారు చెడు, తప్పుడు అలవాట్లకు, మార్గాల్లో వెళ్లే ప్రమాదముందన్న ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ టీన్స్ అకౌంట్స్ ఇప్పటికే.. అమెరికా, యూకే వంటి దేశాల్లో అందుబాటులోకి రాగా, ఇప్పుడు భారత్ లోనూ మోటా ఈ సేవల్ని ప్రారంభించింది. ఇప్పటికే.. 16 ఏళ్ల లోపు పిల్లలు క్రియేట్ చేసిన అకౌంట్లతో పాటు కొత్తగా అకౌంట్లు క్రియేట్ చేస్తున్న వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయని మెటా స్పష్టం చేసింది. ఈ కేటగిరీలోని అకౌంట్లపై తల్లిదండ్రులకు కంట్రోలింగ్ అథారిటీని కల్పించింది. వారికి చాలా విషయాలు తెలిసేలా, పిల్లల అకౌంట్లను పరిశీలించేలా, నియంత్రించేలా కంట్రోల్స్ వారి చేతిలో పెట్టింది.


టీన్స్ అకౌంట్ ద్వారా పూర్తి సురక్షితంగా యువత సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చని మెటా వెల్లడించింది. వారి ఆరోగ్యం, ఆలోచనలపై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తన పోస్టులో వెల్లడించింది. ఈ అకౌంట్లు పూర్తిగా ప్రైవేట్ మోడ్ లో ఉంటాయని తెలిపిన మెటా.. వాటిని మార్చేందుకు వీలుండదని తెలిపింది. ఒకవేళ ఏవైనా మార్పు చేర్పులు చేయాలి అంటే తల్లిదండ్రులే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. సాధారణ అకౌంట్ల నుంచి కొత్తవారికి సైతం మెసేజ్ లు పంపించేందుకు వీలవుతుంది. కానీ.. టీన్ అకౌంట్ల ద్వారా కేవలం ఫాలో అవుతున్న లేదా కనెక్ట్ అయిన వారి నుంచి మాత్రమే సందేశాలు అందుకునే వీలుంటుంది. అలాగే.. వారికి మాత్రమే మెసేజ్లు పంపించేందుకు వీలవుతుంది. అలాగే.. వీరిని ఎవరైనా కొత్త వాళ్లు ఫాలో అయ్యేందుకు ప్రయత్నించి, రిక్వెస్టులు పెడితే.. వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం తల్లిదండ్రులకు ఉండనుంది. అలాగే.. కేవలం ఇరువైపుల ఫాలో అయితేనే.. మెసేజ్లు పంపేందుకు, చూసేందుకు వీలవుతుంది.

టీన్స్ అకౌంట్ల యూజ్ చేస్తున్న పిల్లలు ఎలాంటి కంటెంట్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు. వారు ఏ విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు వంటి కచ్చితమైన సమాచారం తల్లిదండ్రులకు తెలిసిపోతుంది. అలాగే.. టీన్ ఖాతాలకు సెన్సిటివ్‌ కంటెంట్‌పై నియంత్రణ ఉంది. కాబట్టి.. వారికి చెడు కలిగింతే, సెన్సార్ అవసరమైన కంటెంట్ కనిపించదు. ఏవైనా వీడియోలు, కామెంట్లల్లో అసభ్య పదాలున్నా… వాటిని ఇన్ స్టా తప్పనిసరిగా ఫిల్టర్ చేస్తుంది. దీని వల్ల వారికి బూతులు, ఇతర వల్గర్ కంటెంట్ అందేందుకు వీలుండదని మెటా వెల్లడించింది.


సోషల్ మీడియాకు, ఫోన్ వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రతీ గంటకు యాప్ మూసేయండి అనే నోటిఫికేషన్ చూపించనుంది. అలాగే..రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆటోమేటిక్ గా స్లీప్‌ మోడ్‌ ఆన్‌ అవుతుంది. ఆ టైమ్ లో ఎలాంటి నోటిఫికేషన్లు, మెసేజ్ లు రావని మెటా వెల్లడించింది. అలాగే.. డైరెక్ట్ మెసేజ్ లకు.. ఆటో రిప్లైలు వెళ్లేలే ప్రత్యేక కంట్రోల్స్ ఏర్పాటు చేశారు. దాంతో పాటే.. కావాలనుకుంటే తల్లిదండ్రులు పిల్లల ఇన్ స్టా సందేశాలను యాక్సెస్ చేయొచ్చని మెటా వెల్లడించింది. వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు వంటి అనేక విషయాలపై నిఘా ఉంచేందుకు ఈ విధానం తోడ్పడుతుందని తెలుపుతున్నారు.

Also Read : తల్లి లేకుండా పిల్లల్ని కన్న ఇద్దరు పురుషులు – జెనెటిక్ ఇంజినీరింగ్ అద్భుతం

తాజా టీన్ ఇన్ స్టా యాప్ లో మెజార్టీ నియంత్రణలను తల్లిదండ్రుల చేతిలో పెట్టిన మెటా.. వారే పూర్తిగా చిన్నారుల యాక్టివిటీని పరిశీలించేందుకు, నియంత్రించేందుకు అవకాశం కల్పించింది. ఈ విధానంలో త్వరలోనే అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో అందుబాటులోకి వస్తుందని మెటా వెల్లడించింది. గతేడాదే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశంలో టీనేజ్ పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నియంత్రణ విధించింది. భారత్ లో అలాంటి నియంత్రణలు, నిబంధనలు ఏమీ లేవు. కానీ.. డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ చట్టం మాత్రం.. చిన్నారుల ఆన్ లైన్ రక్షణ కోసం.. ధృవీకరించదగిన తల్లిదండ్రుల సమ్మతి అవసరం అంటూ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. దీంతో.. భారత్ చట్టాలను అనుసరించేందుకు ఇన్ స్టా సిద్ధమవుతుందనే ప్రచారం సాగుతోంది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×