Genetic Wonder : తల్లి లేకుండా పిల్లలు సాధ్యమేనా..? అదెలా వీలవుతుంది, మీకేమైనా తిక్కా అని తొందరపడి తిట్టకండి. ఇద్దరు పురుషులు సైతం బిడ్డకు జన్మనివచ్చని నిరూపించారు శాస్త్రవేత్తలు. నిజంగానే.. ఇది నిజం. జీవసంబంధమైన తల్లి లేకుండానే ఇద్దరు పురుషులు సంతానం పొందేలా శాస్త్రవేత్తలు మంచి పురోగతి సాధించారు. ఈ పరిశోధనతో స్వలింగ సంపర్క జంటలకు ఇకపై పిల్లల కోసం బాధ లేకుండా.. వారి సొంత బిడ్డలకు జన్మనివ్వచ్చని అంటున్నారు పరిశోధకులు. ఇద్దరు పురుషుల స్పెర్మ్ ద్వారానే పిల్లలను కనే తాజా విధానంతో ఇది సాధ్యమైంది అంటున్నారు. ఈ కొత్త పరిశోధన జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా సాధ్యమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపుతున్నారు. అంటే.. ఇద్దరు పురుషుల డీఎన్ఏ ఆధారంగా ఒక పిల్లవాడిని కనడం. తొలుత ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో మంచి ఫలితాలు సాధించడంతో తాజాగా మనుషులపై ప్రయోగం చేసి చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు.
జన్యు సంబంధమైన తల్లి లేకుండా ఇద్దరు పురుషులు సంతానం పొందేందుకు మార్గం సుగమం చేసే తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఒక సంచలనాత్మక ఆవిష్కరణ చేశారు. జన్యు ఇంజనీరింగ్ ప్రయోగంలో తల్లి లేకుండానే ఓ చిట్టి ఎలుకకు ప్రాణం పోయగలిగారు. ఇలాంటి ప్రయోగాల్లో ఇలాంటి పిల్లలు పుట్టినా.. వెంటనే చనిపోతూ ఉంటాయి. కానీ.. ఇందులోని ఎలుక యుక్తవయస్సు వరకు జీవించి ఉన్నట్లు తెలిపారు.
గతంలో.. శాస్త్రవేత్తలు ఇద్దరు తల్లుల నుంచి జన్యు పదార్థాన్ని ఉపయోగించి స్పెర్మ్ లేకుండానే ఎలుకను ఉత్పత్తి చేశారు. ఇది రెండు స్పెర్మ్‌లతో పిల్లలను పునరుత్పత్తి చేయడంతో పోలిస్తే చాలా సులువైన ప్రక్రియ. ఖచ్చితమైన స్టెమ్ సెల్ ఇంజనీరింగ్‌ని ఉపయోగించి మాలిక్యులర్ బయాలజిస్ట్ “ఝి కున్ లి” ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. ఇది పూర్తిగా జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా సాధించిన విజయంగా చెబుతున్నారు. ఈ పరిశోధనలో ఎలుకను ఉపయోగించారు. తొలుత ఇందులో ఒక ఎలుక సజీవంగా మూడో దశ వయస్సు వరకు చేరుకుందని తెలిపారు. అయితే.. గతంలో కొందరు శాస్త్రవేత్తలు.. ఇద్దరు తండ్రులతో ఎలుకను సృష్టించినప్పటికీ, ఈసారి పునరుత్పత్తి చేసిన ఎలుక.. గతంలో కంటే ఎక్కువ కాలం జీవించింది. పైగా.. ఉన్నన్ని రోజులు ఆరోగ్యకరంగా జీవించి ఉందని తెలుస్తోంది.
గతంలో శాస్త్రవేత్తలు మహిళల కణాల మధ్య ప్రయోగాలు చేశారు. అయితే.. పురుషుల కణాలను ఉపయోగించడంలో ఎన్నో సవాళ్లు ఉంటాయని చెబుతున్నారు. అందులో ముఖ్యమైంది.. పురుష కణాలు ఎక్కువ ప్రత్యేకంగా ఉండడమే. వీటితో.. ఒక ఎంబ్రియోను తయారు చేయడం చాలా కష్టమైన ప్రక్రియ. ఆడవాళ్ల కణాల్లో ఎంబ్రియో సృష్టి సులువుగానే జరిగిపోతుంది. అందుకు తగిన ఏర్పాట్లు అందులో నిగూఢంగానే ఉంటాయి. కానీ.. జీవం ఏర్పాటుకు, కణ విభజనకు కావాల్సిన సామర్థ్యాలు మగవాళ్ల కణాల్లో ఉండవు. కానీ.. తాజా ప్రయోగంలో.. సున్నితమైన స్టెమ్ సెల్ ఇంజినీరింగ్ ద్వారా ఎంబ్రియో తయారు చేయడంలో పరిశోధకులు విజయం సాధించారు. ఇందులో.. కఠినమైన “జీన్ ఎడిటింగ్”, “జీన్ డిలీషన్”, “జీన్ ఇంప్రింటింగ్” వంటి ఆధునిక టెక్నాలజీలు ఉపయోగించి, ఈ విజయాన్ని సాధించారు.
ఈ పరిశోధన ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మొదటగా ఉత్పత్తి చేసిన ఎలుకకు ఆరోగ్య పరంగా పెద్ద సమస్యలు కనిపించలేదు. ఇది ఇతర సాధారణ ఎలుకలతో పోల్చితే చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే, కొన్ని లోపాలు కూడా ఉన్నట్లు కనుక్కున్నారు. వాటిలో.. ఆ పిల్లలు సంతానోత్పత్తి చేయలేని స్థితిలో ఉన్నాయి. మిగతా విషయాల్లో అంతా బాగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ విధానంలో 90% పుట్టిన ఎంబ్రియోలు జీవించలేదు. కేవలం అతి కొద్దిగా మాత్రమే పెద్ద వయస్సు వరకు పెరిగాయి.. అంటే ఈ సాంకేతికత మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మొత్తం మీద.. ఈ ప్రక్రియను ఉపయోగించి, పిల్లలు ఉత్పత్తి చేయడంలో ఉన్న అవకాశాలు వెలుగులోకి వస్తున్నాయి.
Also Read :
ఈ ప్రయోగం భవిష్యత్తులో స్వలింగ జంటలకు పిల్లలు సృష్టించడాన్ని ఉపయోగించే అవకాశాలున్నాయి. కానీ, ఇది ఇప్పటికీ పరిశోధన దశలో మాత్రమే ఉంది. ఇంకా.. పూర్తిగా అమల్లోకి తీసుకు రావాలి అంటే మాత్రం మరిన్ని పరిశోధనలు, మరింత కాలం పట్టొచ్చని చెబుతున్నారు.