Prithvi Raj : టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ పేరు గత రెండు రోజులుగా వార్తల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం లైలా.. ఈ మూవీ ఈయన నటించారు.. ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే ఆదివారం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో గ్రాండ్గా నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ సినిమాలో తన పాత్ర గురించి చెప్పారు. ఆయన సత్యం అనే పాత్రలో నటించినట్లు ఈవెంట్ లో చెప్పారు. అయితే 150, 11 అని చెప్పడంతో అవి వైసీపీని కించపరిచేలా ఉన్నాయని వైసీపీ అభిమానులు ఆయనను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తూ లైలా మూవీని బాయ్ కాట్ చెయ్యాలని పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులపై స్పందించిన పృథ్వీరాజ్ బూతులతో రెచ్చిపోయారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం పై తాజాగా ఆయన సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు..
సైబర్ పోలీసులకు ఫిర్యాదు..
వైసిపి శ్రేణులు తనని, తన కుటుంబాన్ని దారుణంగా మాటలతో హింసిస్తున్నారని నటుడు పృథ్వీ రాజ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గత మూడు రోజులుగా ఆయనను మానసికంగా వైసిపి శ్రేణులు అభిమానులు హింసిస్తున్నారని, తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారని తెలుస్తుంది. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.. ఈ కేసు గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియని ఉన్నాయి..
అసలేం జరిగిందంటే..?
ప్రముఖ టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైలా.. ఈ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు చిత్ర యూనిట్. ఆ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ప్రస్తుతం రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. సినిమాను బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో హస్ట్రాక్ట్ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయనకు పర్సనల్ కూడా ఒత్తిడి ఎక్కువ అవడంతో హై బీపీకి గురై ఆస్పత్రిలో చేరారు. అనంతరం అయినా సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోని రిలీజ్ చేస్తారు. నేను ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు అని ఆ వీడియోలో పృథ్వీరాజ్ అన్నారు. దాంతో మరోసారి సోషల్ మీడియాలో ఆయన టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు గురించి పూర్తి వివరాలను త్వరలోనే పోలీసులు వెల్లడించనున్నారని తెలుస్తుంది.. ఇక లైలా మూవీకి జనాల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. మూవీలో విశ్వక్సేన్ లేడీ గెటప్ లో కనిపింఛనున్నాడని ట్రైలర్, టీజర్స్ ను చూస్తే అర్థమవుతుంది. మరి ఎన్ని వివాదాలు నడుమ రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..