Energy Drink Capsules : ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఈ సీజన్ లో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తోంది. పేలవ ప్రదర్శన చేసినప్పటికీ చెన్నై క్రీడాకారులు చాలా ఉత్సాహంగా పరుగెత్తడం విశేషం. ఇందుకు ఓ కారణం ఉందండోయ్. సాధారణంగా క్రీడాకారులకు తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. క్రికెట్ లో పరుగెత్తుతుంటే అలసట రావడం.. చెమట ద్వారా సాల్ట్ ని కోల్పోతారు. దీంతో అలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వారికి నీరు చాలా అవసరం. క్రీడాకారులు తాగే వాటర్ లో టాబ్లెట్లు వేస్తుంటారు. అందులో ఏముంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : Energy Drink Capsules : ప్లేయర్లు తాగే నీళ్లలో టాబ్లెట్లు.. అందుకే అంతలా పరిగెడతారా..!
క్రీడాకారులు తీసుకునే వాటర్ బాటిల్స్ లో ఎలక్ట్రోలైట్స్ టాబ్లెట్లు వేస్తుంటారు. అసలు వీటిలో ఏముంటాయంటే..? సాల్ట్, పొటాషియం, పాస్పెట్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలుంటాయి. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహించడం వల్ల శరీరం కండరాలు, అవయవాలు కీళ్ల పనితీరు పెరుగుతుంది. అందుకే శరీరం స్వయంగా ఉత్పత్తి చేయగల బైకార్బోనేట్ మినహా, మీరు తీసుకునే ఆహారం, పానీయాల నుండి ఎలక్ట్రోలైట్లు వస్తాయి. ఎలక్ట్రోలైట్స్ నీటిలో కరిగిపోతాయి. దీంతో చెమట ద్వారా శరీరం నీటిని కోల్పోయినప్పుడు శక్తి కోల్పోకుండా ఉంటుంది. అందుకే క్రీడాకారులు తీసుకునే వాటర్ లో ఎలక్ట్రోలైట్స్ టాబ్లెట్స్ వేస్తున్నారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు తాగే బాటిల్స్ లో వేసే టాబ్లెట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సీజన్ లో ఐపీఎల్ మ్యాచ్ లను పరిశీలించినట్టయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 8 మ్యాచ్ లు ఆడి కేవలం 2 మ్యాచ్ లల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్ లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించి చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. టాప్ 4 ప్లేస్ ల్లో గుజరాత్ నెంబర్ 1 స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానం, ఆర్సీబీ మూడో స్థానం, పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ లో సగానికి పైగా మ్యాచ్ లు జరిగాయి. వాటిలో కొన్ని విజయం సాధించగా.. మరికొన్ని ఓటమి పాలయ్యాయి.
మరోవైపు ఈ ఏడాది ఫీల్డింగ్ లో అన్ని జట్లు చెత్త ప్రదర్శన కనబరిచాయనే చెప్పాలి. ఇప్పటివరకు 40 ఐపీఎల్ మ్యాచ్ లు జరిగితే వాటిలో అన్ని జట్లు కలిపి 111 క్యాచ్ లను వదిలేయడం విశేషం. 247 మిస్ ఫీల్డ్స్, 172 రనౌట్స్ మిస్ అయ్యాయి. 2020 నుంచి తొలి 40 మ్యాచ్ లతో పోల్చితే ఇదే చెత్త ప్రదర్శన కావడం గమనార్హం. కేవలం ఒక్క ముంబై జట్టు మాత్రమే 83.6 శాతం క్యాచింగ్ పర్సెంటేజ్ తో కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. గతంలో అద్భుతమైన క్యాచ్ లు చూసిన అభిమానులు ప్రస్తుతం పట్టిన ప్రతీ క్యాచ్ ను అద్భుతం అంటున్నారు.