Doomscroller Job: రోజంతా చేతిలో ఫోన్ పట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ స్క్రోల్ చేయడం మనలో చాలామందికి అలవాటే. సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలీకుండా గంటల తరబడి వీడియోలు చూస్తూనే ఉంటాం. అయితే ఇలా సరదాగా రీల్స్ చూస్తూ కూడా నెల నెలా జీతం సంపాదించవచ్చని ఎప్పుడైనా అనుకున్నారా? వినడానికి కాస్త వింతగా అనిపించినా ఇది నిజం. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన Influish అనే స్టార్టప్ కంపెనీ దివాళి సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అయ్యే ట్రెండ్స్‌ను గమనించడమే ఈ జాబ్ ముఖ్య ఉద్దేశం.
ఈ ఉద్యోగానికి కంపెనీ పెట్టిన పేరు Doomscroller. సాధారణంగా డూమ్‌స్క్రోలింగ్ అంటే ఫోన్‌లో రీల్స్, షార్ట్స్ చూస్తూ సమయాన్ని గడిపేయడం. కానీ ఇక్కడ అదే పని చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. రోజంతా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటూ ఏ రకమైన కంటెంట్, ఎలాంటి పాటలు లేదా కాన్సెప్ట్‌లు వైరల్ అవుతున్నాయో గమనించి కంపెనీ టీమ్‌కు రిపోర్ట్ ఇవ్వడమే ఈ ఉద్యోగం చేసే వ్యక్తి పని. ఇన్‌స్టాగ్రామ్ వాడటంలో నిజంగా ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక మంచి అవకాశమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో కింద Hi అని కామెంట్ చేస్తే ఉదయ్‌పూర్ వాసులకు నేరుగా అప్లికేషన్ లింక్ మెసేజ్ రూపంలో వస్తుంది. మిగతా వారు ఇన్‌స్టాగ్రామ్‌లోని gangsofstartup ఖాతా బయోలో ఉన్న గూగుల్ ఫామ్ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఫామ్‌లో పేరు, ఫోన్ నంబర్, పూర్తి సమయం పనిచేస్తారా లేదా ఇంటర్న్‌షిప్‌గా చేస్తారా అనే వివరాలతో పాటు ఆశించే జీతం నమోదు చేసి రెజ్యూమ్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
Also Read: రూ.18 వేల ఖర్చుకి రూ.50 వేల బాదుడా? iPhone 18 Pro స్టోరేజ్ వెనుక యాపిల్ సీక్రెట్ దందా!
?
నవంబర్ 4న పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు కొన్ని లక్షల మంది ఈ వీడియోను చూడగా.. దాదాపు 11 వేల మందికి పైగా అప్లికేషన్ ఫామ్ కోసం రిక్వెస్ట్ పంపారు. నెటిజన్లు కూడా దీనిపై చాలా సరదాగా స్పందిస్తున్నారు. ‘ఇది నా డ్రీమ్ జాబ్’, ‘ఈ ఉద్యోగానికి నేను ఖచ్చితంగా బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు గెలుచుకుంటాను’ అంటూ యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.
మారిన కాలానికి అనుగుణంగా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చెప్పడానికి ఈ జాబ్ నోటిఫికేషన్ ఒక ఉదాహరణ. వైరల్ ట్రెండ్స్‌ను వేగంగా పట్టుకోవడానికి కంపెనీలు ఇలాంటి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ అలవాటును ఒక ఆదాయ మార్గంగా మార్చుకోవాలనుకునే వారికి ఇది నిజంగా ఒక వినూత్నమైన అవకాశం.
Also Read: మొబైల్ డేటా త్వరగా అయిపోతోందా? ఫేస్‌బుక్‌లో ఈ సీక్రెట్ సెట్టింగ్ మార్చారో లేదో ఒకసారి చూసుకోండి!