Tanveer Ahmed On IND VS NZ Match Rain: టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 2nd ODI) మధ్య రేపు అంటే శనివారం రోజున వెల్లింగ్టన్ వేదికగా (Hnry Stadium, Wellington) రెండో వన్డే జరగనుంది. ఇప్పటికే మొదటి వన్డే గెలిచిన టీమిండియా, రెండో వన్డేలో కూడా దుమ్ము లేపేందుకు సిద్ధం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో వెల్లింగ్టన్ వేదికగా జరిగే రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
శనివారం రోజు ఫస్టాఫ్ లో 60 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సెకండ్ హాఫ్ లో 55 నుంచి 60 శాతం వర్షం పడే సూచన ఉన్నట్టు అంచనా వేసింది. ఇవాళ కూడా వెల్లింగ్టన్ లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో న్యూజిలాండ్, టీమిండియా ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దు అయింది. వర్షంతో తొలి వన్డేకు అంతరాయం ఏర్పడి టార్గెట్ మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో వన్డే కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.
టీమిడియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 2nd ODI) మధ్య వేదికగా రేపు జరిగే రెండో వన్డే కు వర్షం అంతరాయం కలిగిస్తుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ తన్వీర్ అహ్మద్ స్పందించాడు. రేపటి మ్యాచ్ కు వర్షం పడకూడదని తాను అల్లాకు ప్రార్థనలు చేస్తున్నట్టు వ్యాఖ్యానించాడు. ఒకవేళ వర్షం పడితే, మాత్రం టీమిండియా అవలీలగా గెలుస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు.
మొదటి వన్డేలో కూడా తాను ఇదే చెప్పానని గుర్తు చేశాడు. వర్షం పడితే, టీమిండియాకు అదృష్టం కలిసి వస్తుందని.. లేకపోతే సంకనాకి పోవడం గ్యారెంటీ అని సంచలన ప్రకటన చేశాడు. ఈ తరుణంలోనే వర్షం పడేలా టీమిండియా అభిమానులు దేవుడికి ప్రార్థనలు చేసుకోవాలంటూ హేళన చేశాడు. దేవుడు కరుణిస్తేనే ఇండియాను గెలుస్తున్నాడు. లేకపోతే టీమిండియా చిత్తుగా ఓడిపోవడం కళ్లారా చూస్తారని హెచ్చరించాడు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య వెల్డింగ్టన్ వేదికగా జరిగే రెండవ వన్డే టాస్ ఉదయం ఏడు గంటలకు వేస్తారు. ఏడున్నర గంటలకు మ్యాచ్ షురూ అవుతుంది. అంటే మధ్యాహ్నం వరకు మ్యాచ్ ఫినిష్ చేస్తారు. ఒకవేళ వర్షం అంతరాయం కలిగిస్తే, మ్యాచ్ కాస్త లేట్ అవుతుంది.