E-Paper
Advertisement

“మా ఆఫీస్‌లో ఇలాంటి బాస్ ఉంటే బాగుండు!” సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో!

“మా ఆఫీస్‌లో ఇలాంటి బాస్ ఉంటే బాగుండు!” సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో!
Advertisement

Woman gifts iPhone to employees: ఉద్యోగులు తమ సంస్థ.. అభివృద్ధి కోసం కష్టపడి పని చేస్తుంటారు. అయితే.. వారి కష్టాన్ని గుర్తించి యజమానులు ఇచ్చే చిన్న ప్రశంస లేదా బహుమతి ఉద్యోగులలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. తాజాగా యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ఓ కంపెనీకి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కేరళకు చెందిన ఈ మహిళా బాస్ తన సంస్థలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ బ్రాండ్-న్యూ ఐఫోన్లను సర్ప్రైజ్ గిఫ్ట్‌గా అందించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాలో 2 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది.

ఊహించని సర్ప్రైజ్:

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. హసీనా నిషాద్ తన  ఉద్యోగులందరినీ కాన్ఫరెన్స్ రూంమ్‌కు రావాల్సిందిగా కోరారు. వారు కుర్చీలలో కూర్చునే.. సమయానికి, టేబుల్ కింద కుర్చీలపై అందంగా .. ప్యాక్ చేసిన గిఫ్ట్ బాక్సులు కనిపించాయి. ఆ బాక్సులను విప్పి చూసిన ఉద్యోగులు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే..వాటిలో కొత్త ఐఫోన్లు ఉన్నాయి. తమకు ఎంతో ఇష్టమైన బ్రాండ్ ఫోన్లు గిఫ్ట్‌గా రావడంతో.. మహిళా ఉద్యోగుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. కొందరైతే భావోద్వేగంతో కన్నీటిపర్యంతమయ్యారు.

హౌస్‌కీపింగ్ స్టాఫ్‌కు కూడా:

Advertisement

ఈ సర్ప్రైజ్‌లో అత్యంత గొప్ప విషయం మరొకటి ఉంది. ఆఫీసులో హౌస్‌కీపింగ్ స్టాఫ్‌గా పని చేస్తున్న ఒక మహిళా ఉద్యోగి హసీనా నిషాద్‌కు శరబత్ అందిస్తున్న సమయంలో.. ఆమెకు కూడా ఒక ఐఫోన్ బాక్స్‌ను బహుమతిగా అందించారు. తనతో పాటు పని చేసే ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవిస్తూ ఇచ్చిన ఈ కానుకను చూసి ఆ హౌస్‌కీపింగ్ సిబ్బంది ఉద్వేగానికి లోనయ్యారు. హసీనాను గట్టిగా కౌగిలించుకుని కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ భావోద్వేగ దృశ్యం వీడియో చూసే ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటోంది.

మహిళా సాధికారతే లక్ష్యం:

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. హసీనా నిషాద్ మహిళా సాధికారత గురించి గొప్ప మాటలు రాశారు. “ప్రతి మహిళ తనదైన కలలు, బాధ్యతలు, సవాళ్లతో ముందుకు సాగుతుందని నాకు తెలుసు. మీలో ప్రతి ఒక్కరూ మరింత బలంగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాలి. మీరు కన్న ప్రతి కల నిజం కావాలి” అని ఆమె పేర్కొన్నారు. మహిళ ఎదిగి విజయం సాధించడం చూస్తుంటే.. కలిగే గర్వం వేరుగా ఉంటుందని, ఒక మహిళ ఎదిగితే అది తోటి మహిళకు కూడా ఎదిగే ధైర్యాన్ని ఇస్తుందని ఆమె రాసుకొచ్చారు.

Advertisement

Also Read: శాంసంగ్ ట్యాబ్‌లపై భారీ డిస్కౌంట్‌లు..అస్సలు మిస్సవ్వొద్దు

నెటిజన్ల ప్రశంసలు:

ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా యూజర్లు హసీనా నిషాద్ గొప్ప మనసును అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ” బాస్ అంటే ఇలానే ఉండాలి”, “ఇలాంటి బాస్ ఉంటే ఆఫీస్‌కి వెళ్లాలని ఎవరికైనా ఉంటుంది” అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు “మీ కంపెనీలో ఏమైనా ఖాళీలు ఉన్నాయా?” అంటూ జోకులు వేస్తున్నారు. కేవలం మహిళా ఉద్యోగులే కాకుండా కింది స్థాయి సిబ్బందిని కూడా సమానంగా చూసే ఈ సంస్కృతి అందరికీ ఆదర్శం అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

వ్యాపారంలో.. లాభాలతో పాటు తోటి ఉద్యోగుల ఆనందాన్ని కూడా కోరుకునే నాయకులు ఉంటే.. సంస్థలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయి. హసీనా నిషాద్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక గిఫ్ట్ మాత్రమే కాదు, తోటి మహిళలకు ఆమె ఇచ్చిన గొప్ప మనో ధైర్యం.

?utm_source=ig_embed&ig_rid=Abw2jMEhaUeGqRvClkGuMt4

Related News

రూ.15వేలకే 40 ఇంచుల స్మార్ట్ హెచ్‌డీ టీవీ..ఫీచర్స్ ఇవే!

శాంసంగ్ ట్యాబ్‌లపై భారీ డిస్కౌంట్‌లు..అస్సలు మిస్సవ్వొద్దు

దీపావళి షాపింగ్ చేస్తున్నారా?ఈ 5 సైబర్ మోసాలతో జాగ్రత్త!

రూ.18 వేల ఖర్చుకి రూ.50 వేల బాదుడా? iPhone 18 Pro స్టోరేజ్ వెనుక యాపిల్ సీక్రెట్ దందా!

చలికాలంలో ఫోన్ ఛార్జింగ్ నెమ్మదిగా అవుతోందా? అసలు కారణం ఇదే!

కపుల్స్ కోసం Airtel బంపరాఫర్.. రూ.749కే అపరిమిత 5G డేటా.. ఓటీటీలు, 2 సిమ్ కార్డ్‌లు!

రూ.800లోపే గేమింగ్ ఇయర్‌బడ్స్..ఫీచర్లు మాములుగా లేవు!

Big Stories

Advertisement
×