iPhone 15 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ లాంఛ్ చేసిన ఐఫోన్ 15పై ఫ్లిప్కార్ట్ లో అదిరే ఆఫర్స్ నడుస్తున్నాయి. ఈ మొబైల్ ను ఆఫర్ లో కనుగోలు చేస్తే రూ. 52,000కే కొనే ఛాన్స్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ మొబైల్ ఆఫర్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ ఎప్పటికప్పుడు తన కస్టమర్ కోసం లేటెస్ట్ మొబైల్స్ ను అదిరిపోయే ఆఫర్స్ తో అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఎన్నో ఆఫర్స్ ను అందించిన ఫ్లిప్కార్ట్ తాజాగా ఐఫోన్ 15 పై మరో భారీ ఆఫర్ ను ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో ఐఫోన్ 15 ధర రూ. రూ. 58,999 ఉండగా.. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా రూ. 9,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. iPhone 15 Plus అదనంగా రూ. 52,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో రూ. 63,999కే లభిస్తుంది. ఇక ఐఫోన్ 16 కొత్త ఫీచర్లతో రూ.72,500కే అందుబాటులో ఉంది. Apple ఇంటెలిజెన్స్ ఫీచర్లతో పాటు డైనమిక్ ఐలాండ్, టైప్-C, మెరుగైన కెమెరాతో సహా ఎన్నో ఫీచర్స్ ఈ మెుబైల్ లో ఉన్నాయి.
ఐఫోన్ 15 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బేస్ 128GB వేరియంట్ కోసం రూ. 58,999గా ఉంది. ఇక కస్టమర్‌లు ఎంపిక చేసిన కార్డ్‌లను ఉపయోగించడంపై రూ. 1,000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించడంపై 5 శాతం అపరిమిత తగ్గింపు పొందవచ్చు. అదనంగా కస్టమర్‌లు తమ గ్యాడ్జెట్ ను మార్చుకుంటే రూ. 8,000 వరకు అదనపు తగ్గింపును పొందుతారు. కస్టమర్‌లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లలో నో కాస్ట్ EMI ఛాన్స్ కూడా ఉంది.
పెద్ద స్క్రీన్‌లు, బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే కస్టమర్‌లు iPhone 15 Plusను కొనుగోలు చేయవచ్చు. ఈ గ్యాడ్జెట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 63,999కే అందుబాటులో ఉంది. కస్టమర్లు పాత మెుబైల్స్ ను రూ. 52,000 వరకు ఎక్స్ఛేంజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.
iPhone 15 కొనుగోలు చేయాలా? –
iPhone 15 A16 బయోనిక్ చిప్‌సెట్, 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, డైనమిక్ ఐలాండ్, టైప్-సి పోర్ట్, 48+12MP కెమెరాతో వచ్చేసింది. 60hz రిఫ్రెష్ రేట్‌తో 6.1 అంగుళాల OLED ప్యానెల్‌తో డిస్‌ప్లే తో వచ్చేసింది. iPhone 16 మెుబైల్ కొత్త డిజైన్, మెరుగైన పనితీరు, Apple ఇంటెలిజెన్స్ ఫీచర్లతో పాటు మెరుగైన కెమెరాను అందిస్తుంది. ఐఫోన్ 16 ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో అన్ని బ్యాంక్ ఆఫర్‌లతో రూ.72,500కే అందుబాటులో ఉంది.
ఇక ఏడాది లాంఛ్ అయిన ఐఫోన్ 16 సిరీస్ తో పాటు వచ్చే ఏడాది లాంఛ్ కాబోతున్న ఎన్నో మొబైల్స్ లో యాపిల్ అధునాతన ఫీచర్స్ ను తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొత్త మొబైల్స్ లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ తో పాటు కెమెరా అప్ డేట్స్ సైతం వచ్చేసాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది లాంఛ్ అయిన ఐఫోన్ 15 పై ప్రముఖ ఈ కామర్ సంస్థలన్నీ వరుస ఆఫర్స్ ను అందిస్తున్నాయి.
ALSO READ : క్వాడ్ రియర్ కెమెరాతో Infinix కొత్త మెుబైల్.. ఫీచర్స్ కిర్రాక్ బాస్